E-Paper
Advertisement

Google Pixel 8a : త్వరలో మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 8a ఫోన్.. ఫీచర్లు మహా అద్భుతం!

Google Pixel 8a : త్వరలో మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 8a ఫోన్.. ఫీచర్లు మహా అద్భుతం!
Advertisement

Google Pixel 8a : స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు పిక్సెల్ సిరీస్ నుంచి Google Pixel 8a ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కొనుగోలుదారులను అట్రాక్ట్ చేసేందుకు AI ఫీచర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రోమో వీడియోను టిప్‌స్టర్ షేర్ చేసింది. ఫోన్‌ను మే 14న జరగనున్న I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించే అవకాశం ఉంది. ఇందులో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉంటాయో తెలుసుకోండి.

రాబోయే గూగుల్ పిక్సెల్ 8a ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లను టిప్‌స్టర్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ప్రోమోను టీజ్ చేసింది. ఈ వీడియో ఆధారంగా ఫోన్‌ను మే 14న జరగనున్న I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించవచ్చు. Pixel 8a ఫోన్‌లో AI ఫీచర్లు ఉంటాయని బయటకు వచ్చిన ప్రోమో వీడియో చూపిస్తుంది. ఇందులో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉంటాయో కూడా వీడియోలో చూపించారు.

Advertisement

Also Read : మొబైల్ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. రూ.7,999లకే స్మార్ట్‌ఫోన్

ఫోన్‌లో AI ఫీచర్లు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ‘బెస్ట్ టేక్’ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇది గ్రూప్ ఫోటోల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే యూజర్లు అనేక చిత్రాలను క్లిక్ చేసిన తర్వాత వారికి బెస్ట్ ఫోటోను ఎంచుకోనే ఆప్షన్ ఇస్తుంది. తద్వారా మీకు నచ్చని ఫోటోలను సులభంగా డిలేట్  చేయవచ్చు.

Advertisement

Samsung S24 సిరీస్‌లో కనిపించే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్లో చూడొచ్చు. ఈ ఏడాది జనవరిలో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మొదట ఇది Samsung S24 సిరీస్‌లో మాత్రమే ఉండేది ఆ తర్వాత Google Pixel 8తో పాటు Pixel 7 సిరీస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సర్కిల్ ఆధారంగా మాత్రమే సెర్చ్ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.

ఫోన్‌లో లైవ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఇది వాయిస్ కాల్‌ని లైవ్‌లో మనకు అనుకూలమైన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఇది కాకుండా కెమెరా సంబంధిత ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ కూడా తీసుకొస్తుంది. ఇది వీడియో నుండి అనవసరమైన సౌండ్‌ను రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

Also Read : కొత్త ఫోన్ లాంచ్.. రూ.10 వేలకే 50MP కెమెరా!

Google Pixel 8a ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్‌లలో లాంచ్ చేయవచ్చు. కొన్ని రోజుల క్రితం ఒక నివేదిక ప్రకారం Pixel 8a దీని ముందు సిరీస్ Pixel 7a కంటే ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×