E-Paper
Advertisement

Google Pixel 11: ఐఫోన్‌కు కూడా సాధ్యం కాని డిజైన్.. యువతను కట్టిపడేసేలా గూగుల్ స్పెషల్ సర్ప్రైజ్!

Google Pixel 11: ఐఫోన్‌కు కూడా సాధ్యం కాని డిజైన్.. యువతను కట్టిపడేసేలా గూగుల్ స్పెషల్ సర్ప్రైజ్!
Advertisement

Google Pixel 11: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్‌ను మరింత పెంచుతూ గూగుల్ తన తదుపరి తరం ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, Pixel 11 Pro Fold అనే నాలుగు మోడళ్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే గూగుల్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన లీకులు నెటిజన్లను ఊరిస్తున్నాయి.

ఎప్పుడు విడుదల కావచ్చు?

సాధారణంగా గూగుల్ తన కొత్త ఫోన్లను ఏడాది చివరలో లాంచ్ చేస్తుంది. కానీ ఈసారి పిక్సెల్ 11 సిరీస్‌ను మార్చి నెలలోనే పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, అసలు లాంచ్ ఈవెంట్ ఆగస్టు 17 నుండి 25 మధ్య జరిగే ఛాన్స్ ఉందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇవన్నీ సవ్యంగా సాగితే సెప్టెంబర్ చివరి నాటికి ఈ ఫోన్లు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: అబ్బే, ఇలాంటి ఫోన్ ఎప్పుడూ చూసుండరు.. రియల్‌మీ సెల్ఫీ మిర్రర్ ఫోన్ వచ్చేస్తోందిరోయ్!

 ఆండ్రాయిడ్ 17 సాఫ్ట్‌వేర్‌..

ఈ ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గూగుల్ సొంతంగా తయారుచేస్తున్న టెన్సర్ G6 చిప్‌సెట్ గురించి. ఇది 2nm టెక్నాలజీతో వస్తోంది. దీనివల్ల ఫోన్ వేడెక్కడం తగ్గి, పనితీరు చాలా వేగంగా ఉంటుంది. 6.6 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది. ప్రో మోడళ్లలో ఇది 144Hz వరకు ఉండొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5,500 mAh సామర్థ్యంతో పాటు 45W లేదా 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 17 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్లు పనిచేయనున్నాయి.

ధర వివరాలు (అంచనా):

Advertisement

పిక్సెల్ అంటేనే కెమెరాకు పెట్టింది పేరు. దీనిలో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్, 12MP టెలిఫోటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. ఇండియాలో పిక్సెల్ 11 బేస్ వేరియంట్ సుమారు రూ.79,990 నుండి రూ.85,000 మధ్య ఉండవచ్చని అంచనా. అలాగే ప్రో మోడల్స్ ధర లక్ష రూపాయలు దాటే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమే. గూగుల్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: ఒప్పో నుంచి రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్ లీక్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×