E-Paper
Advertisement

అబ్బా.. ఏం ఆఫర్ రా బాబు, Google Pixel 10 ఫోన్ ఇంత తక్కువకా? ఈ బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకోవద్దు!

అబ్బా.. ఏం ఆఫర్ రా బాబు, Google Pixel 10 ఫోన్ ఇంత తక్కువకా? ఈ బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకోవద్దు!
Advertisement

Flipkart Sasa Lele Sale: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే Sasa Lele సేల్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా Google Pixel 10 ఫోన్ అంటే ఇష్టపడే వారికి ఇదొక పండగ లాంటి వార్త అనే చెప్పాలి. మొన్నటి దాకా భారీ ధరతో అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. ఈ సేల్‌లో మాత్రం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చే ధరకి పడిపోతుందన్నమాట.

ఎంత తగ్గుతుందంటే?

ఈ Google Pixel 10 మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని ధర రూ.79,999గా ఉండేది. కానీ మే 9 నుంచి మొదలయ్యే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ దాదాపు రూ.59,999కే లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే.. నేరుగా రూ.20,000 దాకా తగ్గనుంది. ప్రస్తుతం ఇది రూ.74,999కి ఉన్నా.. సేల్ మొదలయ్యాక బ్యాంకు ఆఫర్లతో కలిపి మరింత తగ్గే ఛాన్స్ ఉంది.

10% అదనపు డిస్కౌంట్:

Advertisement

అయితే ఇక్కడో విషయం గమనించాలి.. ఈ రూ.60,000 ధర అనేది కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ వల్ల మాత్రమే రాకపోవచ్చు. మీకు SBI క్రెడిట్ కార్డ్ ఉంటే 10% దాకా అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీరు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే.. ఆ బోనస్ కూడా కలిపి ఈ తక్కువ ధరకే పిక్సెల్ ఫోన్ 10ని సొంతం చేసుకోవచ్చు. మే 9న సేల్ స్టార్ట్ అయ్యాక దీనిపై ఇంకా క్లారిటీ వస్తుంది.

Also Read: భారత్‌లోకి వచ్చేసిన Vivo X300 FE .. ఐదేళ్ల అప్‌డేట్స్, 100x జూమ్ కెమెరా.. ఐఫోన్, శాంసంగ్‌లకు చుక్కలే!

ఈ ఫోన్ ప్రత్యేకతలివే:

Advertisement

పిక్సెల్ ఫోన్లు అంటేనే సాఫ్ట్‌వేర్ పనితీరుకి పెట్టింది పేరు. అడ్డంకులు లేని క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, గూగుల్ నుంచి వచ్చే వేగవంతమైన అప్‌డేట్స్ దీని ప్రత్యేకత. ముఖ్యంగా ఫొటోల పిచ్చి ఉన్న వారికి పిక్సెల్ కెమెరాలు తెగ నచ్చేస్తాయి. అలాగే ఇందులో ఉండే AI ఫీచర్లతో ఫొటోలను ఎడిట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.

కొనేముందు గమనించాల్సినవి:

మీరు గనుక మరీ హెవీగా గేమ్స్ ఆడేవారైతే లేదంటే రోజంతా ఫోన్ వాడేవారైతే, బ్యాటరీ, ప్రాసెసర్ విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం కావచ్చు. లాంచ్ అయినప్పుడు రూ.80,000 వద్ద యాపిల్, శాంసంగ్‌లతో పోలిస్తే కొంచెం వెనుకబడినట్టు అనిపించినా.. ఇప్పుడు రూ.60,000 ధరలో మాత్రం పిక్సెల్ 10 కచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఆఫర్ కొన్ని రోజులే:

మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా బ్లాక్ సబ్‌స్క్రైబర్లు అయితే.. మీకు ఈ సేల్ అందరికంటే ముందే మొదలవుతుంది. కాబట్టి.. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టాక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సేల్ మొదలైన వెంటనే డీల్ లాక్ చేసుకోవడం మంచిది. మంచి కెమెరా, ప్యూర్ ఆండ్రాయిడ్ కావాలనుకునే వారికి ఇది నిజంగా మంచి సమయం.

Also Read: 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, అమోలెడ్ డిస్‌ప్లే.. మార్కెట్లోకి Redmi Watch 6 ఎంట్రీ, ఇక రచ్చే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×