E-Paper
Advertisement

ఇంతకంటే తక్కువకు రాదు.. Google Pixel 10పై రూ.29,000 వరకు లాభం పొందే సూపర్ ఛాన్స్!

ఇంతకంటే తక్కువకు రాదు.. Google Pixel 10పై రూ.29,000 వరకు లాభం పొందే సూపర్ ఛాన్స్!
Advertisement

Google Pixel 10 Price Cut: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘పిక్సెల్ 10’ పై భారీగా ధర తగ్గించింది. అద్భుతమైన ఏఐ ఫీచర్లు, అదిరిపోయే కెమెరా పెర్ఫార్మెన్స్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్ల వివరాలు:

గూగుల్ ఈ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.79,999 లాంచ్ ధరతో మార్కెట్లోకి తెచ్చింది. కానీ ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.57,999కే అందుబాటులో ఉంది. అంటే నేరుగా రూ.22 వేల తగ్గింపు లభిస్తోంది. దీనికి తోడు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.7,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా లేదా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల ద్వారా ఈ ధరను ఇంకా తగ్గించుకోవచ్చు.

Advertisement

Also Read: ఫోన్ ఓపెన్ చేయక్కర్లేదు.. చేతిపైనే అంతా, పెబుల్ తెచ్చిన ఈ స్మార్ట్ బ్యాండ్ స్పెషాలిటీ ఏమిటంటే?

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ సొంతంగా తయారు చేసిన లేటెస్ట్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనిలో 6.3 ఇంచుల యాక్చువా OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది కాబట్టి.. స్క్రీన్ చాలా స్మూత్‌గా, బ్రైట్‌గా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్, సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

ట్రిపుల్ కెమెరా సెటప్:

Advertisement

ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి Pixel 10 ఒక మంచి ఛాయిస్. దీని వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 10.5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

లేటెస్ట్ సాఫ్ట్‌వేర్:

రోజంతా వాడుకోవడానికి ఈ ఫోన్‌లో 4970mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 30W వైర్డ్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Pixel 10 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే నీరు, ధూళి నుండి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. గూగుల్ క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవంతో పాటు దీనికి సుదీర్ఘ కాలం పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను కూడా అందించనుంది.

Also Read: మీ WhatsApp హ్యాక్ అయిందా? ఢిల్లీ పోలీస్ చెప్పిన ఈ సీక్రెట్ కోడ్‌తో క్షణాల్లో రికవరీ చేయొచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×