E-Paper
Advertisement

Google AI Plus: 200 జీబీ స్టోరేజ్.. జెమిని 3 యాక్సెస్‌తో వచ్చేస్తున్న గూగుల్ AI ప్లస్!

Google AI Plus: 200 జీబీ స్టోరేజ్.. జెమిని 3 యాక్సెస్‌తో వచ్చేస్తున్న గూగుల్ AI ప్లస్!
Advertisement

Gemini 3 Pro: గూగుల్ తన AI ప్లస్ సబ్‌ స్క్రిప్షన్ సర్వీసును అధికారికంగా భారత్ లో ప్రారంభించింది.  వినియోగదారులు దాని అత్యంత అధునాతన ఏఐ టూల్స్ ను యాక్సెస్ చేయడానికి మరింత సరసమైన మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర నెలకు రూ.399గా నిర్ణయించింది. కానీ భారత్ లో ఎంట్రీ ఆఫర్ లో భాగంగా గూగుల్ మొదటి ఆరు నెలల పాటు నెలకు కేవలం రూ.199 ప్రమోషనల్ రేటు తో సబ్‌స్క్రిప్షన్‌ ను అందిస్తోంది.

ఈ కొత్త సబ్‌ స్క్రిప్షన్ లో భాగంగా గూగుల్ ఫ్లాగ్‌ షిప్ AI మోడల్ జెమిని 3 ప్రోని పరిచయం చేసింది. దీనిని కంపెనీ ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన AI మోడల్ గా అభివర్ణించింది. జెమిని యాప్ ద్వారా, సబ్‌ స్క్రైబర్లు మరింత పరిశోధన, కాంప్లెక్స్ రీజనింగ్, లాంగ్ ఫార్మ్ కంటెంట్ డ్రాఫ్టింగ్, థింకింగ్, కోడింగ్ పనుల కోసం జెమిని 3 ప్రోను ఉపయోగించవచ్చు. ఈ టూల్స్ వర్క్‌ ను మరింత సులభతరం చేయనున్నాయి.

Advertisement

AI ప్లస్ ప్లాన్ కింద అదనంగా నానో బనానా ప్రోను అందిస్తుంది. ఇది గూగుల్ తాజా ప్రొఫెషనల్ గ్రేడ్ ఇమేజ్ జనరేషన్ మోడల్. ఈ టూల్ వినియోగదారులను తక్కువ కష్టంతో అధిక నాణ్యతతో కూడి చిత్రాలను అందిస్తుంది. డిజైన్ భావనలు, ఇతర సృజనాత్మక కొత్త ఇమేజెస్ ను క్రియేట్ చేయడానికి అనుమతిస్తుంది. కళాకారులు, డిజైనర్లు, మార్కెటర్లు, డిజిటల్ క్రియేటర్స్ కోసం ఈ మోడల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే, AI ప్లస్ అనేది జెమిని 3 ప్రోకి యాక్సెస్ కంటే ఎక్కువ అని Google చెప్తోంది. సృజనాత్మకతను పెంచడానికి శక్తివంతమైన AI టూల్స్ మరింత అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు. Gmail, డాక్స్, డ్రైవ్, ఫోటోలతో సహా Google  అత్యధికంగా ఉపయోగించే యాప్‌ లలో జెమిని డీప్ ఇంటిగ్రేషన్ ప్రధాన హైలైట్. ఇమెయిల్స్ రాయడం, డాక్యుమెంట్స్ క్లీన్ చేయడం, అవుట్‌ లైన్లను రూపొందించడం, నివేదికలను రూపొందించడం లాంటి పనులను పూర్తి చేయనుంది.

Advertisement

ఈ సబ్‌ స్క్రిప్షన్ మెరుగైన క్రియేటివ్ టూల్స్ తో కూడా వస్తుంది. వినియోగదారులు ప్రతి నెలా 200 AI క్రెడిట్లను అందుకుంటారు. వీటిని అధునాతన వీడియో జనరేషన్ ఫీచర్లపై ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. Google  ఫ్లో టూల్, Veo 3.1 మోడల్ ద్వారా సినిమాటిక్ వీడియో క్రియేషన్ ప్లాట్‌ ఫామ్, టెక్స్ట్ ప్రాంప్ట్‌ ల నుంచి షార్ట్ ఫిల్మ్ లాంటి విజువల్స్ ను  రూపొందించడానికి అనుమతిస్తుంది. అటు Whisk, ఇమేజ్ టు వీడియో సామర్థ్యాలను విస్తరిస్తుంది, Google Veo 3 మోడల్‌ను ఉపయోగించి స్టిల్ చిత్రాలను యానిమేట్ చేయడం సాధ్యపడుతుంది.

అటు AI టూల్స్ తో పాటు, Google AI Plus సబ్‌స్క్రైబర్‌లు 200GB షేర్డ్ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్ ఫ్యామిలీ గ్రూప్స్ కు సపోర్టుగా ఉంటుంది. దీనిని  ఐదుగురు అదనపు సభ్యులు పంచుకోవచ్చు.

Read Also: మీకు తెలుసా? ఈ బ్రా.. బాయ్ ఫ్రెండ్ ఫింగర్ ప్రింట్‌తో మాత్రమే ఓపెన్ అవుతుందట!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×