E-Paper
Advertisement

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?
Advertisement

Google Fitbit Air: టెక్ ప్రియులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు తీసుకురావడంలో గూగుల్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసింది. మే నెలలోనే అమెరికాలో లాంచ్ అయిన ‘ఫిట్‌బిట్ ఎయిర్’ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియాలో ఈ డివైజ్ కనిపించడంతో.. అతి త్వరలోనే ఇది మన దేశంలో విడుదలకు కానుందని స్పష్టమవుతోంది.

స్క్రీన్ లేని డిజైన్.. పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్:

ఈ ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి ఎలాంటి స్క్రీన్ ఉండదు. చూడటానికి చాలా సింపుల్‌గా, ట్రెండీగా కనిపిస్తుంది. రోజంతా మన ఆరోగ్యాన్ని, శారీరక కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. మూడ్రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అత్యవసర సమయంలో కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు.

Advertisement

Also Read: గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

ఫోన్ ద్వారానే హెల్త్ అప్‌డేట్స్:

స్క్రీన్ లేదు కాబట్టి.. రోజంతా సేకరించిన హెల్త్ డేటాను మనం స్మార్ట్‌ఫోన్‌లోని ‘గూగుల్ హెల్త్’ యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల రెండింటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. గుండె స్పందనలు, నిద్ర నాణ్యత, రక్తంలో ఆక్సిజన్ శాతంతో పాటు గుండె లయలో మార్పులను కూడా ఇది ఖచ్చితంగా గుర్తిస్తుంది. మనం చేసే వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా రికార్డ్ చేస్తుంది.

జెమిని ఏఐతో పర్సనల్ కోచింగ్:

Advertisement

ఈ డివైజ్‌లో మరో విశేషం ‘గూగుల్ హెల్త్ కోచ్’. జెమిని ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ ఫీచర్.. మన వ్యక్తిగత ఆరోగ్యానికి తగిన సూచనలు, సలహాలు అందిస్తుంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం ఇది లావెండర్ రంగులో అందుబాటులో ఉండనుంది. అలాగే కొనుగోలుదారులకు మూడు నెలల గూగుల్ హెల్త్ ప్రీమియం ట్రయల్ కూడా లభిస్తుంది.

స్టైలిష్ లుక్.. త్వరలోనే అందుబాటులోకి:

మార్చుకోవడానికి వీలుగా ఉండే రకరకాల కలర్‌ఫుల్ బ్యాండ్లతో ఇది రానుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ‘అన్‌అవైలబుల్’ అని ఉన్నప్పటికీ.. త్వరలోనే గూగుల్ దీని అధికారిక లాంచ్ తేదీని, ధరను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు టెక్ నిపుణులు.

Also Read: ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×