E-Paper
Advertisement

రూ. 899 కే 50 గంటల బ్యాటరీ..ట్రెండ్ సెట్ చేస్తున్న ఇయర్‌బడ్స్!

రూ. 899 కే 50 గంటల బ్యాటరీ..ట్రెండ్ సెట్ చేస్తున్న ఇయర్‌బడ్స్!
Advertisement

GOBOULT K10 Review: మ్యూజిక్ ఎంజాయ్ చేయాలన్నా, తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడాలన్నా, గేమింగ్‌లో మునిగిపోవాలన్నా ఒక మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఉండాల్సిందే. అయితే .. కొన్ని సార్లు సరైన ఇయర్‌బడ్స్ ఎంచుకోవడం కాస్త కష్టమే! కానీ మన దేశంలో తయారైన ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ గోబౌల్ట్ తీసుకొచ్చిన GOBOULT K10 ఇయర్‌బడ్స్ కేవలం రూ. 899 కే క్రేజీ ఫీచర్లతో లభిస్తున్నాయి. 50 గంటల బ్యాటరీ లైఫ్, గేమింగ్ మోడ్‌తో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ ఎలా ఉన్నాయో, వీటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

GOBOULT K10 రివ్యూ:

ఈ రోజుల్లోవెయ్యి లోపు మంచి బ్లూటూత్ ఇయర్‌బడ్స్ దొరకడం చాలా అరుదు. ఒకవేళ దొరికినా ఏదో ఒక ఫీచర్‌లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఈ బడ్స్ మాత్రం రూ. 899 కే అద్భుతమైన స్పెసిఫికేషన్లతో మార్కెట్‌లోకి వచ్చి బడ్జెట్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

డిజైన్,లుక్:

Advertisement

దీని ‘ప్యూర్ బ్లాక్’ వేరియంట్ చాలా క్లాసీ అండ్ ప్రొఫెషనల్ లుక్‌తో ఉంటుంది. మ్యాట్ ఫినిషింగ్ వల్ల కేస్‌పై ఫింగర్ ప్రింట్స్ పడవు. చెవిలో పెట్టుకోవడానికి ఎర్గోనామిక్ డిజైన్‌తో రావడం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్కువ సేపు పెట్టుకున్నా చెవులు నెప్పి పుట్టవు.

సౌండ్ క్వాలిటీ & బాస్:

ఇందులో 10mm డైనమిక్ బాస్ డ్రైవర్లు ఇచ్చారు. అంతే కాకుండా దీనిలోని సౌండ్ టెక్నాలజీ వల్ల పాప్‌, రాక్‌, జానపద పాటలు ఏదైనా సరే.. ప్రొఫెషనల్ ట్యూనింగ్‌తో క్లియర్‌గా వినిపిస్తాయి. బాస్ లవర్స్ కోసం క్లీన్ అండ్ డిప్ బాస్ అవుట్‌పుట్ ఇందులో లభిస్తుంది.

4 మైక్స్ – క్రిస్టల్ క్లియర్ కాల్స్:

Advertisement

చాలా తక్కువ ధర ఇయర్‌బడ్స్‌లో కాల్ క్వాలిటీ సరిగా ఉండదు. కానీ ఈ బడ్స్ లో 4 మైక్రోఫోన్లు అందించారు. ఇవి ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ తో పని చేస్తాయి. అంటే బయట ఎంత రద్దీ లేదా శబ్దం ఉన్నప్పటికీ, మీ వాయిస్ అవతలి వారికి స్పష్టంగా వినపడేలా చేస్తుంది. ఆఫీస్ ఆన్‌లైన్ మీటింగ్స్, డైలీ ఫోన్ కాల్స్ మాట్లాడేవారికి ఇది చాలా ప్లస్ అవుతుంది.

45ms లో-లేటెన్సీ గేమింగ్ మోడ్:

గేమర్స్‌కి ఇదొక గుడ్ న్యూస్! పబ్జీ, ఫ్రీఫైర్ లాంటి గేమ్‌లు ఆడేటప్పుడు శబ్దం కొద్దిగా ఆలస్యంగా వినపడితే గేమ్ ఓడిపోతాం. కానీ ఇందులో ఉన్న ఫీచర్ల వల్ల విజువల్స్ అండ్ సౌండ్ పర్ఫెక్ట్‌గా సింక్ అవుతాయి. బడ్జెట్ ధరలో.. ఈ రేంజ్ లో-లేటెన్సీ ఇవ్వడం చాలా అరుదు.

50 గంటల మెగా బ్యాటరీ లైఫ్:

ఇక బ్యాటరీ విషయంలో.. ఈ ఇయర్‌బడ్స్ అసలు నిరాశపరచవు. ఒక్క సారి చార్జింగ్ పెడితే చార్జింగ్ కేస్‌తో కలిపి దాదాపు 50 గంటల ప్లేటైమ్ వస్తుంది. రోజూ 4-5 గంటలు వాడినా దాదాపు వారం రోజులకు పైగా చార్జింగ్ కేబుల్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో టైప్-సి పోర్ట్‌తో వస్తుంది.

Also Read: స్టైలిష్ లుక్, అదిరిపోయే బేస్..రూ. 999 కే కేక పుట్టించే ఫీచర్స్

ఇతర ఫీచర్లు:

IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్: జిమ్‌లో వర్కవుట్స్ చేసేటప్పుడు పట్టిన చెమటకు లేదా చిన్నపాటి వర్షపు చినుకులకు ఇయర్‌బడ్స్ పాడవవు.

కనెక్టివిటీ: లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌కి క్షణాల్లో కనెక్ట్ అవుతుంది.

స్మార్ట్ టచ్ కంట్రోల్స్: పాటలు ప్లే/పాజ్ చేయడానికి, ట్రాక్స్ మార్చడానికి, కాల్స్ మాట్లాడటానికి, వాయిస్ అసిస్టెంట్‌ని ఆన్ చేయడానికి బెస్ట్ టచ్ ఆప్షన్స్ ఉన్నాయి.

మీరు రూ. 900 లోపు ధరలో ఒక ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ నుంచి బెస్ట్ లుకింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, గేమింగ్ మోడ్, క్లియర్ కాల్స్ ఇచ్చే ఇయర్‌బడ్స్ కోసం చూస్తుంటే మాత్రం వీటిని కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×