E-Paper
Advertisement

Gas Alternatives: సిలిండర్ అయిపోయినా నో టెన్షన్.. ఈ గ్యాస్ ప్రత్యామ్నాయాలతో వంట చేసేయండి!

Gas Alternatives: సిలిండర్ అయిపోయినా నో టెన్షన్.. ఈ గ్యాస్ ప్రత్యామ్నాయాలతో  వంట చేసేయండి!
Advertisement

Gas Alternatives: ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో గ్యాస్ స్టౌ మీదే ఎక్కువగా వంట చేస్తుంటారు. కానీ కొన్ని సార్లు గ్యాస్ సిలిండర్ అయిపోవడం, ధరలు పెరగడం లేదా గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే ఇప్పుడు చాలా మంది గ్యాస్‌కు ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. నిజానికి గ్యాస్ లేకుండానే వంట చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కరెంట్ సోలార్ తో పనిచేసే గార్జెట్లతో సులభంగా వంట చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్‌కు ఉన్న ప్రధాన ప్రత్యామ్నాయాలు ఏంటో తెలుసుకుందాం.

గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలు ఏంటి ?
చాలా కాలంగా ఎల్పీజీ గ్యాస్ స్టవ్ ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. కానీ టెక్నాలజీ అభివృద్ధి వల్ల ఇప్పుడు గ్యాస్ లేకుండానే వంట చేసుకునే పద్ధతులు కూడా చాలా వచ్చాయి. వీటిలో కొన్ని తక్కువ ఖర్చుతో ఉండగా.. కొన్ని పర్యావరణానికి కూడా మంచివి.

Advertisement

1. ఇండక్షన్ స్టవ్:
ఇండక్షన్ స్టవ్ ప్రస్తుతం గ్యాస్‌కు మంచి ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. ఇది విద్యుత్‌తో పని చేస్తుంది. మంట లేకుండా పాత్రను నేరుగా వేడి చేస్తుంది. అందుకే.. వంట త్వరగా అవుతుంది. టీ, కాఫీ, అన్నం, కూరలు వంటి చాలా వంటలు ఇండక్షన్ స్టవ్ మీద సులభంగా చేసుకోవచ్చు. అయితే దీనికి ఇండక్షన్ బేస్ ఉన్న పాత్రలు అవసరం.

2. ఎలక్ట్రిక్ స్టవ్:
ఎలక్ట్రిక్ స్టవ్ కూడా గ్యాస్‌కు మరో మంచి ప్రత్యామ్నాయం. ఇందులో హీటింగ్ కాయిల్ లేదా హీటింగ్ ప్లేట్ ఉంటుంది. అది వేడి అయి పాత్రను వేడి చేస్తుంది. దీనిపై కూడా చాలా రకాల వంటలు చేయవచ్చు. గ్రామాల్లో గానీ.. నగరాల్లో గానీ ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

3. మైక్రోవేవ్ ఓవెన్:
మైక్రోవేవ్ ఓవెన్ సాధారణంగా ఆహారం వేడి చేయడానికి వాడినా.. ఇందులో కూడా కొన్ని వంటలు చేయవచ్చు. కేకులు, పిజ్జాలు, స్నాక్స్, అలాగే కొన్ని కూరలు కూడా మైక్రోవేవ్‌లో తయారు చేయవచ్చు. గ్యాస్ లేకపోయినా త్వరగా వంట చేయడానికి ఇది సహాయ పడుతుంది.

4. సోలార్ కుక్కర్:
సూర్యరశ్మిని ఉపయోగించి వంట చేయడం కూడా ఒక మంచి పద్ధతి. దీనిని సోలార్ కుక్కర్ అంటారు. ఇది పూర్తిగా సూర్యశక్తితో పని చేస్తుంది. అందుకే గ్యాస్ లేదా విద్యుత్ అవసరం ఉండదు. అన్నం, పప్పు, కూరలు వంటి వంటలు ఇందులో చేయవచ్చు. ఇది పర్యావరణానికి కూడా చాలా మంచిది.

5. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్:

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనేది చాలా ఇళ్లలో వాడే మరో పరికరం. దీనిలో కేవలం అన్నం మాత్రమే కాకుండా పులావ్, ఉప్మా, మగ్గీ, కూరలు కూడా తయారు చేయవచ్చు. గ్యాస్ లేకపోయినా ఇది చాలా ఉపయోగ పడుతుంది.

Also Read: ఇండక్షన్ స్టవ్ మీద వంట చేయడం ఎలా ? ఎలాంటి పాత్రలు అవసరం?

6.కట్టెల పొయ్యి:
ఇంకా కొన్ని గ్రామాల్లో మట్టితో చేసిన కట్టెల పొయ్యి ఉపయోగిస్తారు. కట్టెలు లేదా బొగ్గు ఉపయోగించి వంట చేస్తారు. ఇది పాత పద్ధతి అయినప్పటికీ ఇప్పటికీ చాలా చోట్ల వాడుతున్నారు.

గ్యాస్ లేకుండా వంట చేస్తే ప్రయోజనాలు:

గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలు వాడటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

1.గ్యాస్ మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

2.కొన్నిసార్లు ఖర్చు కూడా తగ్గుతుంది.

3.పర్యావరణానికి హాని తక్కువగా ఉంటుంది.

4.టెక్నాలజీతో వంట సులభంగా అవుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×