E-Paper
Advertisement

Cinema hybrid camera: 1930ల నాటి క్లాసిక్ లుక్.. 2026 క్రేజీ ఫీచర్స్.. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఫుజిఫిల్మ్ నయా సెన్సేషన్!

Cinema hybrid camera: 1930ల నాటి క్లాసిక్ లుక్.. 2026 క్రేజీ ఫీచర్స్.. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఫుజిఫిల్మ్ నయా సెన్సేషన్!
Advertisement

Cinema hybrid camera: మన తాతల కాలం నాటి ఆ పాత కెమెరాలు గుర్తుకున్నాయా మీకు? మెటల్ బాడీతో.. చేతిలో పట్టుకుంటే ఒక రాయల్ లుక్ వచ్చేది. సరిగ్గా అలాంటి 1930ల వింటేజ్ స్టైల్‌ కెమెరాను మళ్లీ మన ముందుకు తెచ్చింది ఫుజిఫిల్మ్. ఇది చూడటానికి మాత్రమే పాత కాలపు కెమెరా కానీ, దీని లోపల ఉన్న ఫీచర్లు మాత్రం 2026 నాటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని తలపిస్తాయి.

అయితే, మనకు చాలాసార్లు అనిపిస్తుటుంది.. కెమెరాతో కేవలం ఫొటోలు క్లిక్ మనిపించి ఆగిపోకుండా.. ఆ ఫొటో వెనుక ఉన్న మధుర జ్ఞాపకాలను, ఆ క్షణంలోని మాటలను కూడా దాచుకునే వీలుంటే ఎంత బాగుంటుంది కదాని? అలాంటి అనుభూతినే అందిస్తుందీ కొత్త ‘Evo Cinema’ కెమెరా. మనం తీసిన ఫొటోను స్కాన్ చేస్తే చాలు.. అదొక వీడియోలా మారి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ లవర్స్ అయితే.. తమ మధుర జ్ఞాపకాలను భద్రపరుచుకోవాలనుకుంటే ఫుజిఫిల్మ్ తెచ్చిన ఈ ప్రత్యేక కెమెరా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాల్సిందే.

ఈ కెమెరా ప్రత్యేకత ఏమిటి?

Advertisement

ఈ కెమెరా మనల్ని 1930ల నుండి 2020 వరకు ఉన్న విభిన్న కాలాల్లోకి తీసుకెళ్తుంది. ఆనాటి 8mm ఫిల్మ్ ఎఫెక్ట్స్ లేదా పాతకాలపు టీవీ టెక్స్చర్‌లను ఈ కెమెరా ద్వారా రీ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. విజువల్స్ మాత్రమే కాదు.. ఆ కాలానికి తగ్గట్టుగా ఆడియో ఎఫెక్ట్స్ కూడా దీనిలో ఉండటం విశేషం. అలాగే దీనిలోని వెర్టికల్ గ్రిప్ డిజైన్, ప్రింట్ లీవర్ ఫీచర్స్ వల్ల పాతకాలపు కెమెరాను వాడుతున్నామనే అనుభూతిని ఇది కల్పిస్తుంది.

Also Read: యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్ జీపీటీకి దీటుగా కొత్త ఏఐ సిరి, ఐఫోన్ వాడకాన్ని పూర్తిగా మార్చేసే ఫీచర్లివే!

ఫొటోను స్కాన్ చేస్తే వీడియో..

Advertisement

ఈ కెమెరాలో వీడియో రికార్డింగ్ ఫీచర్ చాలా వినూత్నంగా ఉంటుంది. మనం తీసిన షార్ట్ వీడియోలను నేరుగా ఒక QR కోడ్‌గా మార్చి ఫొటో ఫ్రేమ్‌లోనే ప్రింట్ చేయవచ్చు. ఆ ఫొటోను స్కాన్ చేస్తే చాలు, మన జ్ఞాపకం వీడియో రూపంలో ప్లే అవుతుంది. 1.54 అంగుళాల LCD స్క్రీన్‌పై ప్రివ్యూ చూసుకుని నచ్చిన ఫొటోను మాత్రమే ప్రింట్ చేసుకునే సదుపాయం ఉండటం వల్ల ఫిల్మ్ వేస్ట్ అవ్వదు. ఇక స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేక యాప్ ద్వారా మొబైల్‌లోని ఫొటోలను కూడా ఇన్‌స్టంట్‌గా ప్రింట్ తీసుకోవచ్చు.

మెరుగైన పనితీరు..

ఇక సాంకేతిక పరంగా చూసుకుంటే.. Evo Cinema కెమెరా 5MP CMOS సెన్సర్ ఉంది. అలాగే లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా క్వాలిటీ ఫొటోల కోసం 100-1600 ISO రేంజ్, ఫేస్ రికగ్నిషన్ ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ద్వారా మొబైల్‌తో సులభంగా అనుసంధానం చేయవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు 100 ప్రింట్స్ తీసుకోవచ్చు. USB-C టైప్ ఛార్జింగ్‌తో ఇది మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారనుంచి.

ధర ఎంతంటే?

భారత మార్కెట్లో ఈ ప్రీమియం ఎడిషన్ ధర రూ. 47,999 గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో కెమెరాతో పాటు రెండు గ్లోసీ ఫిల్మ్ ప్యాక్‌లు వస్తాయి. ఇప్పటికే ఈ కెమెరా కోసం ప్రీ బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతోపాటు అదనంగా రెండు డిజైనర్ ఫిల్మ్ ప్యాక్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. జనవరి 28 నుండి ఇది అన్ని ప్రధాన స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మీ జర్నీలను, ప్రత్యేక క్షణాలను సినిమాటిక్ స్టైల్‌లో దాచుకోవాలనుకుంటే ఈ మినీ ఎవో సినిమా బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Also Read: పిల్లలు ఎక్కడున్నా లైవ్ లొకేషన్ తెలిసిపోతుంది.. షియోమీ కొత్త కిడ్స్ స్మార్ట్ వాచ్, ధర కూడా తక్కువే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×