E-Paper
Advertisement

Front Load VsTop Load Washers: ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏది కరెక్ట్ ?

Front Load VsTop Load Washers: ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏది కరెక్ట్ ?
Advertisement

Front Load vs. Top Load Washers: ఈ ఏడాదిలో కొత్త వాషింగ్ మెషిన్ కొనాలనుకునే ప్రతి ఒక్కరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇదే. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ మంచిదా? లేక టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ మంచిదా? సరైన వాఫింగ్ మెషిన్ సెలక్ట్ చేసుకుంటేనే..  మీ డబ్బు వృథా కాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రకాల వాషింగ్ మెషిన్లు  అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో బెస్ట్ ఎంచుకోవాలంటే.. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ , టాప్ లోడ్ మోడళ్ల మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం  అవసరం.

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్(Front Load washing machine):
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు ముందుభాగంలో డోర్ ఉండే విధంగా ఉంటాయి. ఈ మెషిన్లు బట్టలను గుండ్రంగా తిప్పుతూ బాగా శుభ్రం చేస్తాయి. బట్టల మురికి, మరకలు  తొలగించడంలో ఇవి ముందుంటాయి. అంతే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ శుభ్రతను కూడా ఇస్తాయి. అలాగే తక్కువ కరెంట్ మాత్రమే వీటికి అవసరం అవుతుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌లో ఉతకడం వల్ల బట్టలు కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి. ఇదిలా ఉంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు కూడా ఎక్కువ కాలం పాడవకుండా  పనిచేస్తాయి.

Advertisement

మైనస్ పాయింట్లు:
1.ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది.
2. బట్టలు ఉతకడానికి కూడా సమయం కొంచెం ఎక్కువగానే పడుతుంది.

టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లు(Top Loadwashing machine):
ఇక టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ల విషయానికి వస్తే.. ఇవి పైభాగంలో డోర్ కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించడం చాలా సింపుల్. ముఖ్యంగా వృద్ధులకు లేదా సులభంగా వాడాలనుకునే వారికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. టాప్ లోడ్ మెషిన్లు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి కాబట్టి మధ్యతరగతి కుటుంబాలకు ఇవి బెస్ట్. బట్టలు వాష్ చేయడానికి ఇవి తక్కువ సమయం తీసుకుంటాయి. డైలీ వాడకానికి ఇవి చాలా బెస్ట్. అయితే నీటి వాడకం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ లోడ్ మెషిన్లతో పోలిస్తే కొంచెం తక్కువగానే బట్టలను ఇవి శుభ్రం చేస్తాయి.

Advertisement

మైనస్ పాయింట్లు:
బట్టలను ఇవి పూర్తిగా శుభ్రం చేయవు.
నీరు ఎక్కువ అవసరం అవుతుంది.
కరెంట్ ఖర్చు కూడా ఎక్కువే.
త్వరగా బట్టలు శుభ్రం అవుతాయి.

Front Load vs. Top Load Washers: Which Is Better?
ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లలో ఏది బెస్ట్ అంటే.. మీరు ఏ అవసరంతో కొనాలనుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు బట్టలు పూర్తిగా శుభ్రం కావాలని అనుకుంటే, అంతే కాకుండా నీటి వాడకం తగ్గించాలనుకుంటే, ఎక్కువ కాలం మెషిన్ పాడవకుండా ఉండాలంటే మాత్రం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ బెస్ట్. మరోవైపు.. మీరు తక్కువ ఖర్చుతో సులభంగా ఉపయోగించగల మెషిన్ కావాలనుకుంటే.. అంతే కాకుండా త్వరగా బట్టలు శుభ్రం కావాలంటే.. టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ బెస్ట్.

Also Read: బడ్జెట్‌లో ఏసీ లాంటి చల్లదనం.. 2026 లోరూ.10వేలలోపు బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!

ప్రస్తుతం మార్కెట్లో LG Electronics, Samsung, Bosch వంటి ప్రముఖ సంస్థలు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లలో బెస్ట్ మోడళ్లను అందిస్తున్నాయి. ఇవి ఏఐ టెక్నాలజీతో, తక్కువ కరెంట్ వినియోగంతో, చాలా బాగా పనిచేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా Whirlpool, Godrej, Haier వంటి సంస్థలు టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లలో మంచి నాణ్యతతో పాటు తక్కువ ధరలకు లభిస్తున్నాయి.

మీరు డబ్బుకు సరైన విలువ పొందాలనుకుంటే.. మీ బడ్జెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా తక్కువ ధరలో టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లు బెస్ట్. కానీ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఇది నీరు, కరెంట్ ఆదా చేస్తుంది. అందుకే మొదట్లో ఎక్కువగా ఖర్చు చేసినా తర్వాత మీకు ఆదా అవుతుంది.

మొత్తానికి.. 2026లో ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లలో ఏది బెస్ట్ అనే ప్రశ్నకు సమాధానం మీ అవసరాలపైనే ఆధారపడి ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×