// // Fridge magnets: కరెంట్ బిల్లు మోతకు.. ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కారణమా? -->
E-Paper
Advertisement

ఫ్రిజ్ డోర్‌పై బొమ్మలు అతికిస్తున్నారా? అసలు నిజం తెలిస్తే అస్సలు నమ్మలేరు!

ఫ్రిజ్ డోర్‌పై బొమ్మలు అతికిస్తున్నారా? అసలు నిజం తెలిస్తే అస్సలు నమ్మలేరు!
Advertisement

Fridge magnets: మనలో చాలా మందికి ఫ్రిజ్ డోర్‌పై రకరకాల అందమైన బొమ్మలు, ట్రావెల్ మెమోరీస్ లేదా పిల్లల చిన్న చిన్న క్యూట్ మ్యాగ్నెట్స్ (అయస్కాంతాలు)అతికించడం ఒక అలవాటు. కిచెన్‌కు ఒక కలర్‌ఫుల్ లుక్ వస్తుందని ఇలా చేస్తుంటాం. అయితే.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఫ్రిజ్‌పై ఇలా అయస్కాంతాలు పెట్టడం వల్ల కరెంట్ బిల్లు విపరీతంగా పెరిగిపోతుందని, అంతేకాదు ఫ్రిజ్ కూడా త్వరగా పాడైపోతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజముంది? ఈ చిన్న మ్యాగ్నెట్లు నిజంగానే కరెంట్ బిల్లును పెంచుతాయా? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయస్కాంతాల వల్ల కరెంట్ బిల్లు పెరుగుతుందా?

Advertisement

స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్: ఫ్రిజ్ డోర్‌పై మనం పెట్టే మ్యాగ్నెట్స్ చాలా తక్కువ పవర్ ఉన్న ‘స్టాటిక్ అయస్కాంతాలు’. ఇవి కేవలం డోర్ ఉపరితలానికి మాత్రమే అంటుకుని ఉంటాయి. వీటి నుంచి వచ్చే అయస్కాంత క్షేత్రం ఫ్రిజ్ లోపల ఉండే కంప్రెసర్ వరకు లేదా కూలింగ్ సిస్టమ్ వరకు అస్సలు వెళ్లలేదు..

కంప్రెసర్ : ఫ్రిజ్ కరెంట్ వినియోగం అనేది పూర్తిగా దాని కంప్రెసర్, ఇన్సులేషన్, మనం డోర్ ఎన్నిసార్లు తీస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. డోర్ బయట పెట్టే బొమ్మల వల్ల కంప్రెసర్‌పై ఎలాంటి లోడ్ పడదు. కాబట్టి మీ కరెంట్ బిల్లు పెరిగే ఛాన్సే లేదు.

Advertisement

మరి ఈ అపోహ ఎక్కడ నుంచి వచ్చింది?
పాతకాలపు ఫ్రిజ్‌లలో లేదా కొన్ని ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ రిఫ్రిజిరేటర్లలో భారీ మోటార్లు ఉండేవి. వాటికి దగ్గరగా చాలా పవర్‌ఫుల్ అయస్కాంతాలు పెడితే కొద్దిగా ప్రభావం ఉండే అవకాశం ఉండేది. కానీ.. ఇప్పుడు మనం వాడేవన్నీ లేటెస్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఫ్రిజ్‌లు. వీటిపై చిన్న చిన్న బొమ్మలు పెట్టడం వల్ల 0.001% కూడా ఎఫెక్ట్ ఉండదు.

ఫ్రిజ్‌పై మ్యాగ్నెట్స్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:

మ్యాగ్నెట్స్ వల్ల కరెంట్ బిల్లు పెరగకపోయినా.. కొన్ని చిన్న సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.

స్క్రాచెస్ (గీతలు): పవర్‌ఫుల్ లేదా రఫ్ బేస్ ఉన్న మ్యాగ్నెట్లను డోర్‌పై పదే పదే జరపడం వల్ల ఫ్రిజ్ కలర్ పోయి, గీతలు పడే ప్రమాదం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫ్రిజ్‌లు: మీది గనక డోర్‌పైనే టచ్ స్క్రీన్ డిస్‌ప్లే లేదా స్మార్ట్ డిస్‌ప్లే ఉన్న హై-ఎండ్ ఫ్రిజ్ అయితే, ఆ స్క్రీన్లకి ఇరు వైపులా లేదా చాలా దగ్గరగా పవర్‌ఫుల్ అయస్కాంతాలు పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే అవి డిస్‌ప్లే సెన్సార్లను స్వల్పంగా కన్‌ఫ్యూజ్ చేయవచ్చు. నార్మల్ ఫ్రిజ్‌లకు ఎలాంటి ఇబ్బంది లేదు.

ఎక్కువ బరువు పెట్టకండి: డోర్ నిండా భారీ బరువున్న వస్తువులను అయస్కాంతాలతో తగిలిస్తే.. డోర్ అలైన్‌మెంట్ మారిపోయి సరిగ్గా లాక్ కాకపోవచ్చు. అలాంటప్పుడు లోపలి కూలింగ్ బయటకు పోయి కరెంట్ బిల్లు పెరగొచ్చు. కాబట్టి లైట్ వెయిట్ మ్యాగ్నెట్స్ మాత్రమే వాడండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×