// // Flipkart's Buy Buy Sale: ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్‌లో కొనేయండి -->
E-Paper
Advertisement

Flipkart’s Buy Buy Sale: బ్లాక్ ఫ్రైడే షాపింగ్ మిస్ అయ్యారా.. డోంట్ వర్రీ.. ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్‌లో కొనేయండి

Flipkart’s Buy Buy Sale: బ్లాక్ ఫ్రైడే షాపింగ్ మిస్ అయ్యారా.. డోంట్ వర్రీ.. ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్‌లో కొనేయండి
Advertisement

Flipkart’s Buy Buy Sale:  దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ ఫ్లిప్‌కార్ట్ బై బై 2025 సేల్‌లో అధికారికంగా ప్రారంభమైంది. సేల్ స్టార్ట్ అయిన వెంటనే ఈ-కామర్స్ వేదికలపై ట్రాఫిక్ పెరిగి, టెక్ మార్కెట్‌లో హడావుడి నెలకొంది. ఇటీవల ముగిసిన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను మిస్ అయిన వినియోగదారులకు ఈ సేల్ మరోసారి అరుదైన అవకాశంగా కనిపిస్తోంది. ఈసారి ప్రత్యేకంగా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు ప్రకటించడంతో వినియోగదారుల ఆసక్తి మరింత పెరిగింది. సాధారణ పరిస్థితుల్లో ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఈ స్థాయి డిస్కౌంట్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే బై బై సేల్ ద్వారా ధరలు భారీ తగ్గడంతో ఫోన్ కొనాలనుకునేవారికి సరైన సమయంగా మారింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా (Galaxy S24 Ultra) పై భారీ తగ్గింపు

Advertisement

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా (Galaxy S24 Ultra)ఈ సేల్ లో టాప్ హైలైట్ గా నిలిచింది. సాధారణ రోజుల్లో దీని మార్కెట్ ధర రూ.134999. కానీ ఇప్పుడిప్పుడే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ధరగా ఈ ఫోన్ రూ.78999కి లభిస్తోంది. అంటే మొత్తం రూ.56000 తగ్గింపు వచ్చింది అన్నమాట. ఈ తగ్గింపుని శాతంలో లెక్కిస్తే దాదాపు 41 శాతం పడిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు బ్యాంక్ కార్డు ఆఫర్ కలిపితే ధర మరింత తగ్గి రూ.75000 కంటే తక్కువకు రావచ్చు. ఎస్ పెన్n సపోర్ట్, 200ఎంపి కెమెరా సామర్థ్యం, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 పవర్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కలిసి ఈ డీల్‌ను మార్కెట్లో డిమాండ్ పీక్‌కి తీసుకెళ్లాయి. ప్రొఫెషనల్ వర్క్, ఫోటోగ్రఫీ, వీడియో షూట్స్ వారికీ ఇప్పుడు ఈ ధర నిజంగానే వరం.

ఐ ఫోన్ 16 (iPhone 16) ధర షాకింగ్ లెవెల్‌కి తగ్గింది

Advertisement

యాపిల్ ఐఫోన్ 16 లగ్జరీ, ప్రెస్టీజు, బ్రాండ్ విలువలకి సింబల్ గా నిలిచింది. సాధారణంగా దీని ధర రూ.89999. కానీ బైబై సేస్‌లో ఆఫర్ ధర62999కి దిగిపోయింది. మొత్తం రూ.27000 తగ్గింది. అంటే సుమారు 30 శాతం. ఇంకా బ్యాంక్ కార్డు వాడితే ఫైనల్ ప్రైస్ రూ.60000కి చేరే అవకాశం ఉంది. మెరుగైన ఐఓఎస్ ఆప్టిమైజేషన్, సూపర్ స్మూత్ సాఫ్ట్‌వేర్ అనుభవం, స్టెబుల్ బ్యాటరీ లైఫ్, స్టూడియో లెవెల్ కెమెరా ఫీచర్లు ఇవన్నీ కలిసినప్పుడు చాలా మంది ఐఫోన్ ఎంచుకోవడంలో ఒక్క సెకండ్ కూడా ఆలోచించడం లేదు. ఈసారి ఐఫోన్ 16, యువత నుంచి బిజినెస్ వరకు అందరి టార్గెట్ ఫోన్‌గా మారింది.

పిక్సల్ 9 ఏఐ కెమెరా ప్రేమికుల టార్గెట్

గూగుల్ పిక్సెల్ 9 ఈ సేల్ లో మరో పెద్ద ఆకర్షణ. పిక్సెల్ కెమెరా అనుభవం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పేరుంది. సాధారణ ధర రూ.71999. కాని బై బై సేల్‌లో ఈ ఫోన్ ఆఫర్ ధర రూ.54999. మొత్తం తగ్గింపు రూ.17000 వచ్చింది. ఇది దాదాపు 24 శాతం తగ్గింది. బ్యాంక్ ఆఫర్ ఉపయోగిస్తే రూ.50000కు దగ్గరగా తీసుకోవచ్చు. గూగుల్ ఏఐ ఫోటోగ్రఫీ, నైట్ విజన్ కెమెరా, సూపర్ క్లియర్ వీడియో స్టెబిలైజేషన్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఈ కారణాల వల్ల పిక్సెల్ 9 ఈ అమ్మకాల కాలంలో హాట్ పిక్ అయింది.

Also Read: Motorola 5G Monster: ఇండియా మార్కెట్ మళ్లీ హీట్.. 5జి స్పీడ్‌తో మోటరోలా పవర్‌ఫుల్ ఎంట్రీకి రెడీ

మిడ్ రేంజ్.. బడ్జెట్ సెగ్మెంట్‌పై కూడా రికార్డు స్థాయి డీల్స్

ప్రీమియం ఫోన్లతో పాటుగా మిడ్ రేంజ్ ఇంకా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లపై కూడా ఈసారి ఫ్లిప్‌కార్ట్ భారీ డీల్స్ తెచ్చింది. సాధారణంగా రూ.15000 నుండి రూ.25000 మధ్య వచ్చే మిడ్ రేంజ్ ఫోన్లపై సుమారు రూ.3000 నుండి రూ.6000 వరకు నేరుగా ధర తగ్గింది. ఇక బడ్జెట్ రేంజ్ రూ.8000 నుంచి రూ.12000 మధ్య వచ్చే ఫోన్లు మరింత పోటీ ధరల్లో లభిస్తున్నాయి. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు, బ్యాంక్ ఇన్స్టంట్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ బోనస్, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు కూడా కలిపితే ఫైనల్ ప్రైస్ ఇంకాస్త తగ్గిపోతుంది. అందువల్ల ఈసారి చాలామంది ఒక్కరి కోసం మాత్రమే కాదు, ఇంట్లోని ప్రతి ఒక్కరికీ రెండు మూడు ఫోన్లు బుక్ చేసుకోవడం కనిపిస్తోంది.

స్టాట్ ఉన్నంత వరకే డిస్కౌంట్

ఈ సేల్ కి మరో పెద్ద బూస్ట్ వచ్చిన కారణం, న్యూ ఇయర్ దగ్గర పడటమే. కొత్త సంవత్సరానికి కొత్త ఫోన్ అనే ఫీల్‌తో అందరూ ముందుగానే కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని మోడళ్లకు out-of-stock అలర్టులు కూడా రావడం జరిగింది. ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్ 2025 జనవరి మొదటి వారం వరకు కొనసాగుతుందని సమాచారం ఉన్నా బెస్ట్ ఆఫర్లు మాత్రం మొదటి కొన్ని రోజుల్లోనే క్లీన్ అయిపోవడం ఖాయం అని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎవరైనా కొత్త phone కొనాలని నిర్ణయించుకున్నా, ఆలస్యం చేయకుండా వెంటనే చెక్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ఏ ఫోన్ కొనటం బెస్ట్..

ఇప్పుడు అందరి డౌట్ ఒక్కటే, ఏ ఫోన్ కొనాలి? ఫోటోగ్రఫీ, హెవీ యూజ్, హై ఎండ్ పనుల కోసం శామ్‌సంగ్ ఎస్24 అల్ట్రా బెస్ట్ ఎంపిక. రిప్యూటేషన్, ప్రెస్టీజు, స్టేబుల్ సాఫ్ట్‌వేర్ అనుభవం కోసం ఐఫోన్ 16 సరైన ఆప్షన్. క్లీన్ ఆండ్రాయిడ్, గూగుల్ ఏఐ కెమెరా అనుభవం, రియలిస్టిక్ ఫోటోలు కావాలంటే పిక్స్‌ల్ 9 అన్నది perfect choice. మీ usage ఏదైతే, మీ బడ్జెట్ దానికి సరిపోతే, ఈ సేల్‌ని మిస్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇంత తక్కువ ధరలు మళ్ళీ త్వరగా రాకపోవచ్చు.

ఆఫర్ ఎప్పటి వరకు అంటే..

ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్ 2025 ఆఫర్లు జనవరి 2026 మొదటి వారం వరకు కొనసాగనున్నాయి అని సమాచారం. అయితే ఇప్పటికే ప్రతి మోడళ్లపై పెద్ద మొత్తంలో డిమాండ్ పెరగడంతో బెస్ట్ డీల్‌లు ఎప్పుడైనా ముగిసే అవకాశం ఉందని టాక్. ప్రముఖ ఫోన్లకు అవుట్ అఫ్ స్టాక్ అలర్ట్‌లు ప్రారంభమయ్యాయి, కాబట్టి ఆలస్యం చేస్తే మిస్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంతవరకే వాలిడిటీ ఉంటుంది. ధర తగ్గింపులు మొదటి కొన్ని రోజుల్లోనే మ్యాగ్జిమమ్ లభించే అవకాశముంది. వినియోగదారులు ఆలస్యం చేయకుండా వెంటనే చెక్ చేసి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇప్పటికే బ్లాక్ ఫ్రైడేలో మిస్ అయ్యింది అని ఫీల్ అవుతున్న వారికి బైబై సేల్ లో కొనుగోలు చేసుకునేందుకు మంచి అవకాశం అని చెప్పాలి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×