E-Paper
Advertisement

షాపింగ్ మాత్రమే కాదు, ఇకపై ఫుడ్ కూడా.. Flipkart కొత్త ప్లాన్ మామూలుగా లేదుగా!

షాపింగ్ మాత్రమే కాదు, ఇకపై ఫుడ్ కూడా.. Flipkart కొత్త ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Flipkart Food Delivery: భారతీయ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఈ విభాగంలో దూసుకెళ్తున్న స్విగ్గీ, జొమాటోలకు ఇది పెద్ద సవాలుగా మారనుంది. తమ ఇ-కామర్స్ పరిధిని దాటి.. ఈ కొత్త బిజినెస్‌లోకి ప్రవేశించేందుకు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది.

తొలుత కొన్ని నగరాల్లోనే..

ఫ్లిప్‌కార్ట్ ఒకేసారి దేశమంతటా కాకుండా.. దశలవారీగా ఈ సర్వీసులను ప్రారంభించాలని భావిస్తోంది. ముందుగా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లోనే ఫుడ్ డెలివరీని అందుబాటులోకి తెస్తారు. అక్కడ కస్టమర్ల స్పందన, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్ది, ఆ తర్వాత ఇతర చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ ఏమన్నారంటే..

Advertisement

ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి స్వయంగా ధృవీకరించారు. మరో కొన్ని వారాల్లోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు. తాము ఏదైనా కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నామంటే.. అందులో కస్టమర్లకు కచ్చితంగా ఏదో ఒక కొత్త ప్రయోజనం చేకూరాలనేది తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

Also Read: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

యాప్, ONDC సపోర్ట్..

Advertisement

ఈ సేవలను వినియోగదారులు నేరుగా ఉన్న ఫ్లిప్‌కార్ట్ యాప్ నుంచే కాకుండా.. ప్రత్యేకంగా తీసుకొచ్చే మరో యాప్ ద్వారా కూడా పొందవచ్చు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన ONDC (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ పనిచేయనుంది. దీనివల్ల అతి తక్కువ సమయంలోనే ఎక్కువ రెస్టారెంట్లను, డెలివరీ పార్ట్‌నర్లను తమ నెట్‌వర్క్‌లోకి త్వరగా జోడించుకునే వీలు కలుగుతుంది.

‘మినిట్స్’ విజయంతో పెరిగిన నమ్మకం..

క్విక్ కామర్స్ విభాగంలో ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన ‘మినిట్స్’ సాధించిన విజయమే ఈ ఫుడ్ డెలివరీ నిర్ణయానికి ప్రధాన కారణం. దాదాపు 130 నగరాల్లో వెయ్యికి పైగా మైక్రో సెంటర్లతో మినిట్స్ చాలా వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల నుంచి లభించిన అద్భుతమైన స్పందనతో తమ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌పై ఫ్లిప్‌కార్ట్‌కు విపరీతమైన నమ్మకం పెరిగింది.

హాట్ టాపిక్‌గా మారుతున్న పోటీ..

ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్ చాలా పోటీతో కూడుకుని ఉంది. ఒకవైపు జొమాటో, స్విగ్గీలు ఉంటే.. మరోవైపు ర్యాపిడో కూడా సున్నా శాతం కమీషన్‌తో ‘ఓన్లీ’ పేరుతో ఈ రంగంలోకి వచ్చింది. ఇన్ని సంస్థల మధ్య ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుందో, కస్టమర్లను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Also Read: బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×