E-Paper
Advertisement

Digital Wall Clocks: లిమిటెడ్ ఆఫర్.. టాప్ బ్రాండ్ డిజిటల్ క్లాక్స్‌పై 50% పైగా డిస్కౌంట్

Digital Wall Clocks: లిమిటెడ్ ఆఫర్.. టాప్ బ్రాండ్ డిజిటల్ క్లాక్స్‌పై 50% పైగా డిస్కౌంట్
Advertisement

Digital Wall Clocks: నేటి డిజిటల్ యుగంలో వాల్ క్లాక్స్.. కేవలం సమయాన్ని చూపే పరికరాలు మాత్రమే కాదు, అవి ఇంటి అలంకరణలో కూడా అంతర్భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా అనలాగ్ గడియారాల కంటే డిజిటల్ వాల్ క్లాక్స్ కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కారణం వీటిలో ఉండే ఎల్ఈడీ డిస్‌ప్లే, దూరం నుంచి కూడా సమయం స్పష్టంగా కనిపించడం, తేదీ, ఉష్ణోగ్రత వంటి అదనపు ఫీచర్లు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐదు ప్రముఖ బ్రాండ్ల డిజిటల్ వాల్ క్లాక్స్ ఫీచర్ల గురించి పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. JANCOM డిజిటల్ వాల్ క్లాక్ (10 cm X 16 cm):

JANCOM బ్రాండ్ గడియారం కాంపాక్ట్ సైజులో ఉండి.. టేబుల్ మీద లేదా చిన్న గోడల మీద అమర్చుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది.

Advertisement

పరిమాణం: 10 cm పొడవు, 16 cm వెడల్పు ఉంటుంది. ఇది ఒక చిన్న డైరీ పరిమాణంలో ఉంటుంది.

ప్రత్యేకతలు: దీనిని బెడ్‌రూమ్ సైడ్ టేబుల్స్ లేదా ఆఫీస్ డెస్క్‌ల మీద పెట్టుకోవచ్చు. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. నైట్ మోడ్ ఫీచర్‌తో ఇది వస్తుంది. అంతే కాకుండా రాత్రి పూట కళ్ళకు ఇబ్బంది కలగకుండా తక్కువ కాంతిని ఈ వాచ్ కలిగి ఉంటుంది.

2. AJANTA డిజిటల్ వాల్ క్లాక్ (10.5 cm X 12.5 cm):

అజంతా అనేది ఫమస్ బ్రాండ్. ఇది దశాబ్దాల కాలంగా నమ్మకమైన బ్రాండ్. వీరి డిజిటల్ గడియారం చిన్నదిగా, చతురస్రాకారానికి దగ్గరగా ఉంటుంది.

పరిమాణం: 10.5 cm X 12.5 cm ఉంటుంది.

ప్రత్యేకతలు: ఇది చాలా మన్నికైంది. ఇందులో అలారం ఫీచర్ , క్యాలెండర్ సెట్టింగ్స్ ఉంటాయి. చిన్న పరిమాణం కారణంగా దీనిని వంటగదిలో లేదా స్టడీ రూమ్‌లలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అజంతా బ్రాండ్ కావడంతో సర్వీస్, వారంటీ విషయంలో కస్టమర్లకు నమ్మకం ఉంటుంది.

3. Zeinwap డిజిటల్ వాల్ క్లాక్ (11 cm X 21.5 cm):

మీరు కొంచెం వెడల్పుగా ఉండే డిస్‌ప్లేను కోరుకుంటే.. Zeinwap ఒక మంచి ఎంపిక.

పరిమాణం: 11 cm ఎత్తు ,21.5 cm వెడల్పు ఉంటుంది.

ప్రత్యేకతలు: దీని డిస్‌ప్లే వెడల్పుగా ఉండటం వల్ల అంకెలు పెద్దవిగా కనిపిస్తాయి. పెద్ద వయస్సు ఉన్నవారు సమయాన్ని సులభంగా చూడటానికి ఇది ఉపయోగ పడుతుంది. ఇందులో సమయంతో పాటు ఇండోర్ ఉష్ణోగ్రతను కూడా చూపే సౌకర్యం ఉంటుంది.

4. SZELAM డిజిటల్ వాల్ క్లాక్ (25.5 cm X 25.5 cm):

పెద్ద హాల్ లేదా ఆఫీస్ రిసెప్షన్ల కోసం వెతుకుతున్నట్లయితే.. SZELAM బ్రాండ్ క్లాక్ సరైంది.

పరిమాణం: 25.5 cm X 25.5 cm ఉంటుంది.

ప్రత్యేకతలు: ఇది చతురస్రాకారంలో ఉండి, చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని డిస్‌ప్లే చాలా పెద్దదిగా ఉండటం వల్ల 20-30 అడుగుల దూరం నుంచి కూడా సమయం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని గోడకు తగిలిస్తే ఇంటికి ఒక మోడ్రన్ లుక్ వస్తుంది. దీనిలో ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.

5. FIDEO డిజిటల్ వాల్ క్లాక్ (10 cm X 41.2 cm):

మీకు విభిన్నమైన, పొడవాటి డిజైన్ కావాలంటే FIDEO క్లాక్ అద్భుతంగా ఉంటుంది.

పరిమాణం: 10 cm ఎత్తు, 41.2 cm వెడల్పు ఉంటుంది.

ప్రత్యేకతలు: ఇది చాలా పొడవుగా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి గడియారాలను జిమ్ సెంటర్లు, స్కూల్ కారిడార్లు లేదా పెద్ద హాల్‌లలో ఉపయోగిస్తారు. ఇందులో సెకన్ల డిస్‌ప్లే కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది గోడ మీద ఒక సినిమా స్కీన్ లాంటి అనుభూతిని ఇస్తుంది.

Also Read: క్లాసిక్ స్టైలా లేక మోడరన్ టెక్నాలజీయా? మీ అవసరాలకు తగ్గ వాచ్ ఏది?

ఏ గడియారాన్ని ఎలా ఎంచుకోవాలి ?

డిజిటల్ వాల్ క్లాక్ కొనేటప్పుడు ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోండి.

స్థలం : చిన్న గదుల కోసం JANCOM లేదా AJANTA సరిపోతాయి. పెద్ద హాల్ అయితే SZELAM లేదా FIDEO ఎంచుకోండి.

పవర్ సోర్స్: డిజిటల్ వాచ్‌లకు సాధారణంగా బ్యాటరీలు లేదా ప్లగ్-ఇన్ పవర్ అవసరం అవుతుంది. ఎలక్ట్రిక్ ప్లగ్ ద్వారా పని చేసేవి నిరంతరం వెలుగుతూ ఉంటాయి.

అదనపు ఫీచర్లు: మీకు కేవలం సమయమే కాకుండా ఉష్ణోగ్రత, తేదీ కూడా కావాలంటే Zeinwap లేదా SZELAM మంచి ఎంపికలు.

గోడ గడియారం అనేది మీ ఇంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పైన పేర్కొన్న ఐదు రకాల వాచ్‌లు వేర్వేరు పరిమాణాలు, ఆకారాలలో లభిస్తున్నాయి. మీ అవసరాన్ని బట్టి.. మీ గది పరిమాణాన్ని బట్టి సరైన దానిని ఎంచుకోవడం ద్వారా ఇంటి అందాన్ని పెంచుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×