E-Paper
Advertisement

షాపింగ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీలు ఫిక్స్.. ఆఫర్ల పూర్తి లిస్ట్ ఇదిగో!

షాపింగ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీలు ఫిక్స్.. ఆఫర్ల పూర్తి లిస్ట్ ఇదిగో!
Advertisement

Flipkart Freedom Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన వార్షిక ‘ఫ్రీడమ్ సేల్’ (Freedom Sale) తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఎప్పటిలాగే ఈసారి కూడా అద్భుతమైన ఆఫర్లను.. తమ కస్టమర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రీమియం మెుబైల్స్, ట్యాబ్స్, స్మార్ట్ టీవీలను ఈ సేల్ అతి తక్కువకే సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఫ్రీడం సేల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఆఫర్లను ఈ కథనంలో చూద్దాం.

సేల్ స్టార్ట్ ఎప్పుడంటే?

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8న దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సాధారణ వినియోగదారులందరికీ ఆగస్టు 8 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ సేల్‌.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), బ్లాక్ (Black) సభ్యులు, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మాత్రం ఆగస్టు 7 నుంచే అంటే 24 గంటల ముందుగానే సేల్ ను యాక్సెస్ చేసే అవకాశం లభించనుంది. అయితే ఈ సేల్ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఫ్లిప్ కార్ట్ ప్రకటించలేదు.

బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు

Advertisement

ఈ సేల్‌లో కొనుగోలుదారులకు భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ముఖ్యంగా SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇది ఎంపిక చేసిన ఈఎంఐ లావాదేవీలకు కూడా వర్తిస్తుందని ఫ్లిప్ కార్ట్ వర్గాలు స్పష్టం చేశాయి. వీటితో పాటు నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI), ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ప్రత్యేకమైన రాయితీ కూపన్‌లు కూడా ఫ్రీడం సేల్ లో అందుబాటులో ఉండనున్నాయి.

ఆ వస్తువులపై భారీ ఆఫర్లు!

ఎలక్ట్రానిక్స్ నుంచి గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులు.. ఈ సేల్ లో తక్కువ ధరకే లభించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. మెుబైల్ విషయానికి వస్తే.. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లతో పాటు మోటోరొలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వంటి ప్రీమియం ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. అలాగే శాంసంగ్ 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీలు, గెలాక్సీ ట్యాబ్ A11+, ఇతర ల్యాప్‌టాప్‌లపై కూడా డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. వీటితో పాటు ఆడియో ఉత్పత్తులు, కిచెన్ వేర్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా తక్కువ ధరకే లభిస్తాయని ఫ్లిప్ కార్ట్ సేల్ ప్రమోషన్స్ లో హైలెట్ చేస్తోంది.

Advertisement

Also Read: ఫ్రిడ్జ్ డోర్‌పై అయస్కాంతాలు.. కరెంట్ బిల్లుపై పడే ప్రభావం ఎంత? నిజానిజాలివే!

ఇలా చేస్తే.. నచ్చిన వస్తువు మీదే!

సాధారణంగా ఈ-కామర్స్ సైట్ లో సేల్ అనగానే కొనుగోలు దారుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. కాబట్టి సేల్ ప్రారంభానికి ముందే ‘విష్‌లిస్ట్’ (Wishlist)లో మీకు కావాల్సిన వస్తువులను యాడ్ చేసుకోండి. తద్వారా సేల్ ప్రారంభం కాగానే వెంటనే ఆర్డర్ చేసేందుకు వీలుటుంది. అలాగే, ‘Guess & Win’ వంటి గేమ్‌ల ద్వారా అదనపు డిస్కౌంట్ వోచర్లు గెలుచుకునే అవకాశం కూడా ఉందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. కాబట్టి నచ్చిన వస్తువులను తక్కువ ధరకే పొందేందుకు ఫ్రీడం సేల్ మంచి ఛాన్స్ అని ఈ-కామర్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Also Read: మాకూ కావాలి బుల్డోజ‌ర్లు.. జిల్లాల నుంచి హైడ్రాకు డిమాండ్…! ఇదో కొత్త కోణం..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×