E-Paper
Advertisement

Flipkart Buy Buy Sale 2025: ఫ్లిప్‌కార్ట్ షాకింగ్ ఆఫర్.. రూ.1.10 Samsung Galaxy Z Flip ఇప్పుడు రూ.58వేలకే పొందొచ్చు!

Flipkart Buy Buy Sale 2025: ఫ్లిప్‌కార్ట్ షాకింగ్ ఆఫర్.. రూ.1.10 Samsung Galaxy Z Flip ఇప్పుడు రూ.58వేలకే పొందొచ్చు!
Advertisement

Flipkart Buy Buy Sale 2025: ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘Buy Buy Sale 2025’ అనే భారీ సేల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 2025 ఏడాది ముగుస్తుండటంతో ఈ స్పెషల్ సేల్‌ను నిర్వహిస్తోంది. అయితే ఆ సేల్ ద్వారా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్ నుంచి Samsung Galaxy Z Flip 6 ఫోన్ ఊహించలేనంత తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడీ డిస్కౌంట్ పోనూ మరిన్ని ఆఫర్ల ద్వారా శాంసంగ్ ఫ్లిప్‌ను సగం ధరకే ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం..

దిమ్మతిరిగే ఆఫర్:

ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బై బై సేల్ 2025లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6. ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌తో ఆకట్టుకునే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ మంచి తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.24 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇదే బెస్ట్ ఆప్షన్. ప్లాన్ చేసినా, లేదా మొదటిసారి ఫ్లిప్ ఫోన్‌ను ట్రై చేయాలనుకున్నా.. ఈ ఆఫర్‌ను మాత్రం అస్సలు వదులుకోకండి. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం కొనసాగవు కాబట్..టి అవకాశం ఉన్నప్పుడే కొనేయడం ఉత్తమం.

Advertisement

Also Read: ప్రపంచ అమ్మకాల్లో దూసుకెళ్లిన iPhone 16.. టాప్-10లో అసలు ఊహించని ఫోన్లు!

ధర & డిస్కౌంట్ వివరాలు:

శాంసంగ్ జూన్ 2024లో గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లాంచ్ సమయంలో దీని ధర రూ.1,09,999గా నిర్ణయించారు. కానీ Buy Buy Sale 2025 సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. అంటే.. ధర రూ.89,999కు తగ్గింది. అదనంగా యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు రూ.4వేల తగ్గింపును అందిస్తోంది. అలాగే మీరు ఏదైనా బ్యాంక్ ఆఫర్ తీసుకుంటే.. ఈ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6ను కేవలం రూ.85,999కే సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌ఛేంజ్‌తో మరింత తగ్గింపు:

Advertisement

ఈ ఫోన్ కొనుగోలు చేయడంలో మరింత సేవింగ్స్ కోసం చూస్తున్నట్లయితే.. ఎక్స్‌ఛేంజ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ రూ.82,934 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఇస్తోంది. దీనిలో భాగంగా గూగుల్ పిక్సెల్ 6ఏపై రూ.8వేలు, మోటో ఎడ్జ్ 40 నియోపై రూ.7,750, ఐఫోన్ 16పై రూ.27,950 వరకు ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్ లభిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ 16ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే ధర మరింత తగ్గి, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6ను కేవలం రూ.58,000కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: 2025లో గూగుల్‌ను షేక్ చేసిన టాప్ సెర్చ్‌లు ఇవే!.. ఇంతకీ మీరేం వెతికారో గుర్తుందా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×