E-Paper
Advertisement

అయ్యబాబోయ్.. ఏసీ, టీవీ, మెుబైల్స్‌పై భారీ తగ్గింపు.. 60% తక్కువకే పట్టుకెళ్లొచ్చు..!

అయ్యబాబోయ్.. ఏసీ, టీవీ, మెుబైల్స్‌పై భారీ తగ్గింపు.. 60% తక్కువకే పట్టుకెళ్లొచ్చు..!
Advertisement

Flipkart Big Bachat Days Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఓ అద్భుతమైన సేల్ నడుస్తోంది. ‘బిగ్ బచత్ డేస్’ (Big Bachat Days sale) పేరుతో వచ్చిన ఈ సేల్.. అతి తక్కువ ధరలకే టీవీ, ఏసీలు, స్మార్ట్ ఫోన్స్ ను అందిస్తోంది. వీటిపై 60 శాతం వరకూ డిస్కౌంట్ ను కల్పిస్తోంది. మార్చి 30న మెుదలైన ఈ మెగా సేల్.. 7 రోజుల పాటు కొనసాగనుంది. అంటే ఏప్రిల్ 5వరకూ మాత్రమే ఈ రాయితీలు లభించనున్నాయి.

బ్యాంక్ ఆఫర్లు

ఎలక్ట్రానిక్ పరికాలపై డిస్కౌంట్ ను అందించడమే కాకుండా మరికొన్ని అదనపు ఆఫర్లను సైతం ఫ్లిప్ కార్ట్ అందుబాటులో ఉంచింది. ప్రొడక్ట్ కు సంబంధించిన ధరను.. ఫ్లిప్ కార్ట్ – యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే 5 శాతం మేర రాయితీ పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే.. 10 శాతం మేర డిస్కౌంట్ లభిస్తుంది. ఇవి కాకుండా నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) వంటి ఇతర బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. కాబట్టి బిగ్ బచావత్ సేల్ లో ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

సేల్ మధ్యలో మరో సేల్!

Advertisement

బిగ్ బచావత్ సేల్ సమయంలో ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల పాటు మరో సేల్ ను ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘మిడ్ డే స్టీల్స్ (Mid-Day Steals) పేరుతో మ.12 నుంచి 2 గంటల ప్రాంతంలో అదనపు డిస్కౌంట్లు అందిస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యూటీ ఉత్పత్తులు తదితర వాటిపై మరిన్ని రాయితీలను ఈ మిడ్ డే స్టీల్స్ లో పొందవచ్చు. రియల్ మీ ఇయర్ బడ్స్ ను రూ.1,199, ఫిలిప్స్ ట్రిమ్మర్ రూ.830కే దక్కించుకోవచ్చు.

చౌకగా స్మార్ట్ టీవీలు..

ప్రస్తుత ఫ్లిప్ కార్ట్ సేల్ లో చాలా వరకూ మెుబైల్స్, టీవీలు, ఏసీలు తక్కవకే లభిస్తున్నాయి. ఉదాహరణకు 55 అంగుళాల రియల్ మీ టెక్ లైఫ్ QLED సార్ట్ టీవీ 57 శాతం డిస్కౌంట్ తో రూ.27,499కి లభిస్తోంది. మీ వద్ద పాత టీవీ ఉంటే ఎక్స్ఛేంచ్ ఆఫర్ కింద రూ.3,720 వరకూ తగ్గుతుంది. అలాగే మోటొరోలా 55 అంగుళాల స్మార్ట్ టీవీ ఆఫర్ లో రూ.32,999కే లభిస్తోంది. టీసీఎల్ 55 అంగుళాల టీవీ 63 శాతం రాయితీతో రూ.23,999కి దక్కించుకోవచ్చు.

Advertisement

Also Read: అమెజాన్ బిగ్ స్ప్రింగ్ సేల్.. అత్యంత చౌక ధరకే.. థియేటర్‌ను తలపించే టీవీలు!

ఏసీలు సైతం తక్కువకే..!

సమ్మర్ నేపథ్యంలో ఏసీలు సైతం ఫ్లిప్ కార్ట్ లో తక్కువకే లభిస్తున్నాయి. 1 టన్ స్ప్లిట్ ఏసీలు.. 51 శాతం డిస్కౌంట్ తో రూ.21,990కే లభిస్తున్నాయి. వోల్టాస్ 4-ఇన్-1 అడ్జస్టబుల్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ రూ.30,999 అందుబాటులో ఉంది. డైకిన్ గోద్రేజ్, పానాసోనిక్, ఎల్టీ వంటి ప్రముఖ బ్రాండ్స్ కు చెందిన స్ప్లిట్, విండో ఏసీలపై కూడా డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్.. వరలక్ష్మి ‘సరస్వతి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×