E-Paper
Advertisement

మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే డేంజర్లో పడ్డట్లే.. మీ పర్సనల్ డేటా గోవిందా?

మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే డేంజర్లో పడ్డట్లే.. మీ పర్సనల్ డేటా గోవిందా?
Advertisement

FBI Warning Apps: అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ (Federal Bureau of Investigation).. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు డేటా భద్రతకు సంబంధించి కీలక సూచనలు చేసింది. విదేశీ కంపెనీలు మరి ముఖ్యంగా చైనా అభివృద్ధి చేసిన యాప్‌ల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాబట్టి మెుబైల్ యూజర్లు ఈ యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.

‘డేటా చోరీ జరుగుతోంది’

విదేశీ యాప్‌లు ఫోన్‌లోని కాంటాక్ట్‌లు, ఇమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, లొకేషన్‌ వంటి వివరాలను నిరంతరం సేకరిస్తున్నాయని FBI తెలిపింది. ముఖ్యంగా చైనా కంపెనీలు నిర్వహించే యాప్స్.. ఆ దేశ జాతీయ భద్రతా చట్టాలకు లోబడి ఉంటాయని పేర్కొంది. కాబట్టి చైనా ప్రభుత్వం.. సదరు మెుబైల్ యాప్ వినియోగదారుల డేటాను యాక్సెస్ చేసే అవకాశముందని ఎఫ్‌బీఐ చెబుతోంది.

చైనా చట్టాలతో.. గోప్యతకు ముప్పు

Advertisement

చైనా జాతీయ గూడాఛార చట్టంలోని ఆర్టికల్ 7 ప్రకారం.. దేశంలోని అన్ని సంస్థలు, పౌరులు చట్టానికి అనుగుణంగా జాతీయ గూఢచార ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని ఎఫ్‌బీఐ తెలిపింది. దీనివల్ల వినియోగారుల గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని FBI అనుమానిస్తోంది.

ఫోన్లలోకి బ్యాక్ డోర్ ప్రవేశం

అంతేకాకుండా కొన్ని విదేశీ యాప్స్.. ఫోన్ లోకి బ్యాక్ డోర్ ప్రవేశాన్ని కల్పించి.. హానికరమైన కోడ్ ను చొప్పించే ఛాన్స్ ఉందని FBI చెబుతోంది. దీనివల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా చోరీ చేసి.. మిమ్మల్ని బ్లాక్ మేల్ చేయడం, బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు దోచుకోవడం వంటి నేరాలకు పాల్పడొచ్చని హెచ్చరించింది. కాబట్టి ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కాకుండా ఇతర వెబ్‌సైట్ల నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం ప్రమాదకరమని స్పష్టం చేసింది.

Advertisement

Also Read: ఎండిన ఆకులతో వంట గ్యాస్.. సరైన సమయానికి.. అద్భుతమైన ఆవిష్కరణ భయ్యా!

ఈ జాగ్రత్తలు పాటించండి

ఫోన్ డేటాను రక్షించుకునేందుకు అవలంభించాల్సిన మార్గాలను సైతం ఈ సందర్భంగా ఎఫ్ బీఐ.. మెుబైల్ యూజర్లకు తెలియజేసింది. ఇందుకోసం ముందుగా యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అవసరం లేని డేటా షేరింగ్ పర్మిషన్లను ఆపివేయాలని తెలిపింది. అలాగే ఫోన్ సెక్యూరిటీ అప్డేట్స్ ను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ ఉండాలని సూచించింది. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు దాని ‘Terms of Service’, ప్రైవసీ పాలసీని ఒకసారి గమనించాలని చెప్పింది. లాగిన్ పాస్ వార్డ్స్ ను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలని హితవు పలికింది.

Also Read: ఆఫ్రికన్ నమూనాతో.. దేశంలో ఎల్‌పీజీ సమస్యకు చెక్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×