E-Paper
Advertisement

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!
Advertisement

Facebook Security Settings: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అందుకే.. మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలన్నా, అకౌంట్ సురక్షితంగా ఉండాలన్నా కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ మార్చుకోవడం చాలా అవసరం.

టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్:

మన ఫేస్‌బుక్ అకౌంట్‌కు అదనపు రక్షణ కల్పించడంలో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆన్ చేయడం వల్ల, మన పాస్‌వర్డ్ వేరే వాళ్లకు తెలిసినా కూడా వాళ్లు మన
అకౌంట్‌లోకి లాగిన్ అవ్వలేరు. ఎందుకంటే.. లాగిన్ అయ్యేటప్పుడు మన మొబైల్‌కు వచ్చే ఓటీపీ లేదా అథెంటికేషన్ యాప్ కోడ్ ఎంటర్ చేస్తేనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి.. దీనిని వెంటనే యాక్టివేట్ చేసుకోవడం మంచిది.

లాగిన్ అలర్ట్స్‌తో అప్రమత్తం:

Advertisement

ఎవరైనా తెలియని వ్యక్తి లేదా కొత్త డివైజ్ నుండి మన ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే.. మనకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేలా ఈ సెట్టింగ్ సహాయపడుతుంది. దీంత మన పర్మిషన్ లేకుండా అకౌంట్ ఓపెన్ అవుతుందనే విషయం వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు మనం అలర్ట్ అయ్యి వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోవడానికి, అకౌంట్‌ను సురక్షితం చేసుకోవడానికి వీలవుతుంది.

Also Read: iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

ప్రైవసీ చెకప్, ప్రొఫైల్ కంట్రోల్స్:

Advertisement

మనం పెట్టే పోస్టులు, ఫొటోలు, మన ఫ్రెండ్ లిస్ట్ ఎవరెవరు చూడాలనేది మనమే నిర్ణయించుకోవచ్చు. ఫేస్‌బుక్‌లోని Privacy Checkp ఆప్షన్ ద్వారా మన వ్యక్తిగత వివరాలు అందరికీ కనిపించకుండా లాక్ చేసుకోవచ్చు. అలాగే, ఎవరైనా మనల్ని ఏదైనా పోస్ట్‌లో ట్యాగ్ చేసినప్పుడు, అది మన ప్రొఫైల్‌లో కనిపించే కంటే ముందే మనం రివ్యూ చేసేలా సెట్టింగ్స్ మార్చుకుంటే టైమ్‌లైన్ క్లీన్‌గా ఉంటుంది.

యాప్ పర్మిషన్లపై నిఘా:

మనం చాలాసార్లు రకరకాల వెబ్‌సైట్లు ఓపెన్ చేసినప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు ‘లాగిన్ విత్ ఫేస్‌బుక్’ అని క్లిక్ చేస్తుంటాం. దీంతో ఆ థర్డ్-పార్టీ యాప్‌లకు మన ప్రొఫైల్ డేటా యాక్సెస్ వెళ్తుంది. అందుకే ఫేస్‌బుక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మీకు అవసరం లేని లేదా మీరు వాడనటువంటి పాత యాప్‌ల పర్మిషన్లను వెంటనే డిలీట్ చేయడం సురక్షితం.

రికవరీ ఆప్షన్స్ అప్‌డేట్:

ఒకవేళ మీ అకౌంట్ ఎప్పుడైనా లాక్ అయినా లేదా పాస్‌వర్డ్ మర్చిపోయినా మళ్లీ అకౌంట్ తిరిగి పొందడానికి రికవరీ ఆప్షన్లు అవసరం. దీనికోసం మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ప్రస్తుతం వాడుకలో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. అవి కరెక్ట్‌గా ఉంటే భవిష్యత్తులో మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు.

Also Read: UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×