E-Paper
Advertisement

Astronauts: ఇకపై అంతరిక్షంలో పురుగులు, మిడతలు తిననున్న వ్యోమగాములు.. ఎందుకంటే?

Astronauts: ఇకపై అంతరిక్షంలో పురుగులు, మిడతలు తిననున్న వ్యోమగాములు.. ఎందుకంటే?
Advertisement

Astronauts Food:

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తమకు కావాల్సి ఫుడ్ భూమ్మీది నుంచే తీసుకెళ్తారు. వాటిలో ఎక్కువ బ్రెడ్, జామ్ లాంటి పదార్థాలు ఉంటాయి. అయితే, ఇకపై వారి ఫుడ్ మెనూ మారబోతోంది. బ్రెడ్, జామ్ లాంటివి కాకుండా పురుగులు, మిడతలు తినబోతున్నారు. వామ్మో ఇదేం ఫుడ్ అని అశ్చర్యపోకండి. దాని వెనుక ఓ కారణం ఉందంటున్నారు యూరోపియన్ శాస్త్రవేత్తలు. ఇంతకీ అదేంటంటే..

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక నిర్ణయం

డీప్ స్పేస్ మిషన్లను దృష్టిలో ఉంచుకుని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వ్యోమగాముల ఫుడ్ గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రోనాట్స్ కు  ఏ ఆహారం అందిస్తే వారికి అసవరమైన పోషకాలు అందుతాయి అనే దిశగా ఆలోచనలు జరిపారు. ఎక్కువ రోజుల ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి ఆహారం ఇస్తే బాగుంటుందో పరిశీలిస్తున్నారు. ఈ పరిశోధనల్లో వారికి బెస్ట్ ఆప్షన్ గా పురుగులు, మిడతలు కనిపించాయి. వీటిని వారికి ఆహారంగా అందిస్తే, శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని గుర్తించారు.

కొనసాగుతున్న పరిశోధనలు

Advertisement

స్వీడిష్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆసా బెర్గ్రెన్ నేతృత్వంలోని యూరోపియన్ బృందాలు ఇప్పుడు అంతరిక్ష పరిస్థితులలో ఎంపిక చేసిన కీటకాల ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషక విలువలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. మిడతలు, పురుగులు లాంటి జాతులను ఉపయోగించవచ్చని తేల్చారు. వీటిని ఆహారంగా మనుషులు ఉపయోగించవచ్చని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ 2023లో అనుమతించింది.

మిడతులు, పురుగులే ఎందుకంటే?

మిడతలు, పురుగుల్లాంటి కీటకాలు అద్భుతమైన సూపర్‌ ఫుడ్స్ గా  పరిశోధకులు తేల్చారు. ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు, కనీస వనరులున్నప్పటికీ, వేగంగా పెరుగుతాయన్నారు. మనుషులు, మొక్కలు జీర్ణించుకోలేని వ్యర్థాలను తిని బయోమాస్‌ లోకి రీసైక్లింగ్ చేస్తాయి కూడా.  ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే తమ రోజువారీ ఆహారంలో 2,000 కంటే ఎక్కువ కీటకాలాను తీసుకుంటున్నారు. భూమిపై ప్రధాన ఆహారాలలో కూడా కీటకాలు కూడా చేరాయి. పురుగులు, మిడతలు చక్కటి రుచిని కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పురుగులు వగరు, మట్టి రుచిని కలిగి ఉంటాయి. చీమలు లెమన్ టేస్టీని కలిగి ఉంటాయి. ESA వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు మిడతలతో కూడిన బ్లూబెర్రీ మిల్లెట్ బార్లను తిన్నారు. పరిశోధకులు అంతరిక్ష మెనూలకు అనుగుణంగా కీటకాలతో తయారు చేసిన బ్రెడ్స్, పాస్తాలు, స్నాక్స్‌ ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Read Also: ముఖం మీద ఫోన్ పడేసుకుంటున్నారా? ఇదిగో జపాన్ గ్యాడ్జెట్, మీ ఫేస్ ఇక భద్రం!

హైడ్రోపోనిక్ ప్లాంట్ వ్యవస్థలతో కీటకాలు సినర్జీ పోషకాలను రీసైకిల్ చేయడానికి సహకరిస్తున్నాయి. ఇవి మార్స్, మూన్ మిషన్లకు సంబంధించి ఆహారంగా ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం యురోపియన్ పరిశోధకులు చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అయితే, త్వరలోనే కీటకాలు వ్యోమగాములకు ఆహారంగా మారనున్నాయి.

Read Also: రన్నింగ్ ట్రైన్ లో ఫుడ్ డెలివరీ, ఆశ్చర్యపోయిన ఆస్ట్రేలియన్ యువతి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×