E-Paper
Advertisement

అరాచకం సామీ.. థర్మాకోల్ గోడలతో ఇల్లు.. ఇక లైఫ్ లాంగ్ కూలింగ్ ఫ్రీ!

అరాచకం సామీ.. థర్మాకోల్ గోడలతో ఇల్లు.. ఇక లైఫ్ లాంగ్ కూలింగ్ ఫ్రీ!
Advertisement

EPS Wall Technology: ఇటీవల కాలంలో ఇళ్ల నిర్మాణ రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందేందుకు, ఏసీ కొనుగోలు ఖర్చు, కరెంటు బిల్లులను తగ్గించుకునేందుకు చాలా మంది ఇంటి యజమానులు.. థర్మాకోల్ వాల్ టెక్నాలజీ (EPS Wall Technology) వైపు మొగ్గు చూపుతున్నారు. సాంప్రదాయ ఇటుకల నిర్మాణాలకు భిన్నంగా ఈ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారుతోంది. ఈపీఎస్ వాల్ టెక్నాజీ ప్రత్యేకలు? దాని వల్లే కలిగే లాభాలేంటో ఈ కథనంలో చూద్దాం.

అసలేంటీ ఈపీఎస్ వాల్ టెక్నాలజీ?

సాధారణంగా మనం థర్మాకోల్ అని పిలిచే పదార్థాన్ని సాంకేతిక భాషలో ఎక్స్‌పాండెడ్ పాలీస్టైరిన్ (Expanded Polystyrene – EPS) అంటారు. ఈపీఎస్ వాల్ టెక్నాలజీలో.. రెండు వైపులా బలిష్టమైన వైర్ మెష్ (ఉక్కు జాలీ) ఏర్పాటు చేసి మధ్యలో ఈ థర్మాకోల్ షీట్‌ను అమర్చి గోడలుగా డిజైన్ చేస్తారు. ఈ ప్యానెళ్లను ఇంటి నిర్మాణంలో అమర్చిన తర్వాత వాటిపై రెండు వైపులా కాంక్రీట్ మిశ్రమంతో (Plastering) కోటింగ్ ఇస్తారు. దీనివల్ల గోడ ఎంతో బలంగా, ఇతర గోడల కంటే గట్టిగా తయారవుతుంది.

ఇంటిని చల్లగా ఎలా ఉంచుతుంది?

Advertisement

థర్మాకోల్ అనేది అద్భుతమైన ‘థర్మల్ ఇన్సులేటర్’ (Thermal Insulator). అంటే ఇది వేడిని తన గుండా ఏమాత్రం ప్రయాణించనివ్వదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటి వేడి గోడల ద్వారా లోపలికి రాకుండా ఈ ఈపీఎస్ లేయర్ అడ్డుకుంటుంది. అదే సమయంలో లోపలి చల్లదనం బయటకు పోకుండా ఇది అడ్డుగా ఉంటాయి. ఫలితంగా గది ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకే టెంపరేచర్ వద్ద చల్లగా ఉంటుంది. కాబట్టి ఏసీలు, కూలర్ల వాడకం తగ్గి కరెంట్ బిల్లులు భారీగా ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈపీఎస్‌తో మరికొన్ని బెనిఫిట్స్

ఈ ప్యానెల్స్ చాలా తేలికగా (Lightweight) ఉండటం వల్ల భవనంపై బరువు చాలా వరకు తగ్గుతుంది. అలాగే వీటి ఫ్లెక్సిబిలిటీ వల్ల భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇవి త్వరగా కూలిపోవని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు సాంప్రదాయ పద్ధతిలో ఇటుకలతో ఇల్లు కట్టడానికి పట్టే సమయం కంటే ఈ రెడీమేడ్ ప్యానెల్స్‌తో సగం సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఈ గోడలు కేవలం వేడినే కాకుండా శబ్ద కాలుష్యాన్ని కూడా అడ్డుకుంటాయని.. బయటి శబ్దాలు లోపలికి రాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తాయని తెలియజేస్తున్నారు. ఇవి తేమను పీల్చుకోవు కాబట్టి గోడలు పాడయ్యే సమస్యే ఉడదని వివరిస్తున్నారు.

Advertisement

Also Read: సమంత ‘మా ఇంటి బంగారం’ 3 రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే?.. హీరోలు ఇక సద్దుకోవాల్సిందే..

నిపుణుల పర్యవేక్షణ అవసరం

అయితే థర్మాకోల్ వాల్ టెక్నాలజీకి ప్రత్యేక నైపుణ్యం కలిగిన మేస్త్రీలు, ఇంజనీర్లు తప్పనిసరి. సాధారణ కూలీలతో వీటిని సరిగ్గా ఫిక్స్ చేయించడం కష్టమని నిపుణులు అంటున్నారు. ప్లంబింగ్ (పైపులు), ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను గోడలు అమర్చేటప్పుడే పక్కాగా ప్లాన్ చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఎందుకంటే ఇల్లు పూర్తయ్యాక ఈ గోడలను పగలగొట్టడం కాస్త కష్టమైన పని స్పష్టం చేస్తున్నారు. అయితే సాధారణ ఇటుకల గోడతో పోలిస్తే వీటి నిర్మాణం కాస్త ఖర్చుతో కూడుకున్నది. అయితే ఏసీలు, కూలర్ల అవసరాన్ని, కరెంటు బిల్లును తగ్గిస్తాయి కాబట్టి అదనంగా పెట్టిన ఖర్చును 2, 3 ఏళ్లలోనే తిరిగి రాబట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read: మారుతి To టాటా.. తక్కువ బడ్జెట్‌ లో సన్‌ రూఫ్ తో వచ్చే టాప్ 5 మోడల్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×