E-Paper
Advertisement

X on Iran vs Israel war: ఎక్స్ కొత్త రూల్స్.. క్రియేటర్లు తస్మాత్ జాగ్రత్త, లేకుంటే బుక్కైపోతారు

X on Iran vs Israel war: ఎక్స్  కొత్త రూల్స్..  క్రియేటర్లు తస్మాత్ జాగ్రత్త, లేకుంటే బుక్కైపోతారు
Advertisement

X on Iran vs Israel war: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రకరకాల వీడియోలో నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. ఏది నిజమో.. ఏది ఫేక్ వీడియో తెలియక చాలామంది వినియోగదారులు తర్జనభర్జన పడుతున్నారు. ఫలితంగా వాటిని షేర్ చేయడం మొదలుపెట్టారు. మధ్యప్రాఛ్యంలో జరుగుతున్న దానికి భిన్నంగా బయట వీడియోలు హంగామా చేస్తున్నాయి.

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. ఎక్స్ కొత్త రూల్స్

Advertisement

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించిన యుద్ధానికి సంబంధించి వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంది. ఆ విషయం స్పష్టంగా చెప్పకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

ఆ తరహా క్రియేటర్లను రెవెన్యూ షేరింగ్‌ 90 రోజుల పాటు సస్పెండ్ చేస్తామని ప్రకటన చేసింది. న్యూ రూల్స్‌ని ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా వెల్లడించారు. ముఖ్యంగా వార్ సమయంలో రాంగ్ సమాచారం అరికట్టాలన్నది ఉద్దేశంగా చెప్పారు. ప్లాట్‌ఫామ్‌పై వాస్తవికతను కాపాడేందుకే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

క్రియేటర్లు తస్మాత్ జాగ్రత్త, లేకుంటే బుక్కైపోతారు

ఏఐతో ప్రజలను తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను కొందరు సృష్టించడం, ఆపై వైరల్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి సస్పెన్షన్ తర్వాత నిబంధనలను ఉల్లంఘిస్తే రెవెన్యూ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని చెప్పకనే చెప్పింది.  ప్లాట్‌ఫామ్ ఆదాయ భాగస్వామ్యిగా ఉన్న సృష్టికర్తలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.

కమ్యూనిటీ నోట్స్ లేకుంటే ఏఐ టూల్స్ మెటా డేటా ద్వారా కంటెంట్‌ను గుర్తిస్తామని వివరించారు. ఏఐతో రూపొందించిన కంటెంట్‌ను గుర్తించేందుకు మేడ్ విత్ ఏఐ అనే లేబుల్‌ను ఎక్స్ పరిచయం చేసిన విషయం తెల్సిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో తమ ప్లాట్‌ఫామ్‌పై ట్రాఫిక్ ఆల్-టైమ్ రికార్డుకు చేరుకుందని ఇటీవల ఆ సంస్థ వెల్లడించింది.

ALSO READ: కొత్త డిష్ వాషర్ కావాలా? ట్రెండింగ్ మోడల్స్ ఇవే, ఆపై క్రేజీ ఫీచర్స్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×