E-Paper
Advertisement

Grok 3 Photo Editing: ఎలాన్ మస్క్ గ్రోక్ 3తో ఫోటోల ఎడిట్ మరింత ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Grok 3 Photo Editing: ఎలాన్ మస్క్ గ్రోక్ 3తో ఫోటోల ఎడిట్ మరింత ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Advertisement

Grok 3 Photo Editing: టెక్ ప్రపంచంలో ఎలాన్ మస్క్ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో తన AI ఆధారిత గ్రోక్ 3 మరో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ఇది వినియోగదారులకు తక్కువ సమయంలో చిత్రాలను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నిన్నటివరకూ ఫోటోలను ఎడిట్ చేయడం అంటే ప్రత్యేక టూల్స్, సాఫ్ట్‌వేర్ లేదా నైపుణ్యం అవసరమయ్యే పని. కానీ ఇప్పుడు, గ్రోక్ 3 ‘ఎడిట్ ఇమేజ్’ ఫీచర్ ద్వారా మరింత సులభమైంది.

టెక్, ఫోటోగ్రఫీ ప్రియులు
ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా తన Xఖాతాలో ఈ ఫీచర్‌ గురించి ప్రస్తావించారు. నా చిత్రానికి బ్లాక్ క్యాప్ యాడ్ చేయాలని టైప్ చేయడంతో, క్షణాల్లోనే AI అద్భుతమైన మార్పు చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో టెక్, ఫోటోగ్రఫీ ప్రియులు ఈ ఫీచర్ గురించి ఆసక్తిగా స్పందిస్తున్నారు.

Advertisement

గ్రోక్ 3లో చిత్రాన్ని ఎడిట్ చేయడం ఎలాగంటే
-మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించి ఫోటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు.

-ముందుగా గ్రోక్ 3 ఖాతాలో లాగిన్ అవ్వండి
-తర్వాత ఫోటోో ఎడిట్ (Edit Image) ఆప్షన్ ఎంచుకోండి
-మీరు చేయాలనుకున్న మార్పులను పేర్కొనండి (ఉదాహరణకు గ్రీన్ ఫారెస్ట్ లేదా నా చేతిలో స్మార్ట్‌ఫోన్ వంటి మీకు కావాల్సిన విషయాలను పేర్కొనండి)
-ఆ క్రమంలో మీరు చెప్పిన విధంగా ఫోటో తక్షణమే అప్‌డేట్ అవుతుంది

Advertisement

Read Also: Ugadi Special Offer: ఉగాది ప్రత్యేక ఆఫర్..రూ.4 వేలకే …

గ్రోక్ 3 అంటే ఏంటి
గ్రోక్ 3 అనేది ఎలాన్ మస్క్ AI టీమ్ అభివృద్ధి చేసిన హైపర్ రియలిస్టిక్ ఇమేజ్ ప్రాసెసింగ్ టూల్. ఈ టూల్ టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా వాస్తవిక చిత్రాలను సృష్టిస్తుంది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా డిజైనర్లు, సోషల్ మీడియా యూజర్లు, ఆర్టిస్టులు, క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకేసారి నాలుగు వేరియంట్లను అందించడంతోపాటు, మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తక్షణ అప్డేట్ ఫీచర్లను అందిస్తుంది.

గ్రోక్ 3 ప్రత్యేకతలు
టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా ఇమేజ్ మోడిఫికేషన్: కేవలం వివరణ ఇచ్చి, ఒక క్లిక్‌తో మార్పులను పొందవచ్చు
హైపర్ రియలిస్టిక్ ఫోటో ఎడిటింగ్: ఎలాంటి స్పష్టమైన మార్పులు లేకుండా సహజమైన ఫోటోలు.
విభిన్న వేరియంట్లు: ఒకేసారి నలుగురి చిత్రాల ఎంపిక
సమయాన్ని ఆదా చేసే టెక్నాలజీ: ప్రొఫెషనల్ ఎడిటింగ్ టూల్స్ అవసరం లేకుండా తక్కువ సమయంలో ఎడిటింగ్.

గ్రోక్ 3 వినియోగదారులపై ప్రభావం
ఈ కొత్త ‘ఫోటో ఎడిట్ ఫీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మంది వినియోగదారులు తమ సృజనాత్మకతను వెలికి తీస్తూ, తమ చిత్రాలను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ టూల్‌తో ఎడిట్ చేసిన ఫోటోలను పంచుకుంటున్నారు.

గ్రోక్ 3 భవిష్యత్
ఎలాన్ మస్క్ బృందం ఈ టూల్‌ను మరింత అభివృద్ధి చేయడానికి కొత్త ఫీచర్లను జోడించడానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో, వినియోగదారులు మరింత అనుభవాన్ని పొందేందుకు మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో AI ఆధారిత డిజిటల్ ఆర్ట్, వీడియో మోడిఫికేషన్, 3D రెండరింగ్ వంటి అంశాలు భవిష్యత్తులో గ్రోక్ 3లో చేరే అవకాశముంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×