E-Paper
Advertisement

Electrical Safety Tips: పొరపాటున కూడా ఏసీ, ఫ్రిడ్జ్‌లను ఎక్స్‌టెన్షన్ బోర్డుకు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా?

Electrical Safety Tips: పొరపాటున కూడా ఏసీ, ఫ్రిడ్జ్‌లను ఎక్స్‌టెన్షన్ బోర్డుకు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా?
Advertisement

Electrical Safety Tips: చాలామంది ఇళ్లల్లో ప్లగ్ పాయింట్లు తక్కువగా ఉన్నప్పుడు ఎక్స్‌టెన్షన్ కోర్డులను ఎక్కువగా వాడుతుంటారు. దీనికి ఫోన్ ఛార్జర్, ల్యాప్‌టాప్ ఛార్జర్ అలాగే కొన్నిసార్లు లైట్లకు కూడా కనెక్ట్ చేస్తుంటారు. అయితే ఎక్కువ విద్యుత్ తీసుకునే వస్తువులను ఎక్స్‌టెన్షన్ బాక్సుకు కనెక్ట్ చేస్తే మాత్రం పెను ప్రమాదం పొంచి ఉంటుంది. కొంతమంది అజాగ్రత్తగా ఎయిర్ ఫ్రైయర్లు, హీటర్ల వంటి వాటిని ఎక్స్‌టెన్షన్ బాక్సుకు పెడుతుంటారు. దీనివల్ల వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అవ్వడమే కాకుండా ఇల్లు తగలబడిపోయే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏయే వస్తువులను ఎక్స్‌టెన్షన్ బాక్సుకు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

తట్టుకోలేనంత లోడ్:

ఇప్పుడంతా చాలామంది కిచెన్‌లో ఎయిర్ ఫ్రైయర్లు, మైక్రోవేవ్ ఓవెన్ల వాడటం ఎక్కువైపోయింది. ఇవి త్వరగా వేడెక్కడానికి సుమారు 2000 వాట్స్ విద్యుత్ వరకు తీసుకుంటాయి. ఇలాంటి వాటిని ఎక్స్‌టెన్షన్ బాక్సులకు పెడితే ఆ వైర్లు అంత లోడ్‌ను భరించలేవు. దీంతో ప్లగ్ కరిగిపోవడం లేదా మంటలు రావడం జరుగుతుంది. కాబట్టి.. ఎక్కువ కరెంట్ తీసుకునే వైర్లను ఎప్పుడూ నేరుగా వాల్ అవుట్‌లెట్‌కే కనెక్ట్ చేయాలి.

రూమ్ హీటర్లతో జాగ్రత్త:

Advertisement

చలికాలంలో వాడే స్పేస్ హీటర్లు ఇంట్లో అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. హీటర్లను ఎక్స్‌టెన్షన్ కోర్డుకు పెట్టినప్పుడు అవి విపరీతంగా వేడెక్కి వైర్లను కాల్చేస్తాయి. హీటర్ వాడుతున్నంత సేపు దాన్ని పట్టించుకోకుండా అలా వదిలేయకూడదు. రూమ్ హీటర్ కోసం కచ్చితంగా విడిగా ఉన్న సాకెట్‌నే వాడాలి.

Also Read: బడ్జెట్ ధరే కానీ ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్.. త్వరలో లాంచ్ కానున్న టాప్-5 ల్యాప్‌టాప్స్!

ఒకదానికొకటి తగిలించొద్దు:

Advertisement

చాలామంది చేసే మరో పొరపాటు ఏటంటే.. వైర్ పొడవు చాలలేదని ఒక ఎక్స్‌టెన్షన్ బాక్స్‌కు ఇంకో బాక్స్‌ను తగిలిస్తుంటారు. ఈ పని సులవే అయనా, ఇది చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. ఇలా చేయడం వల్ల పవర్ సరిగ్గా అందకపోవడమే కాక.. లోడ్ ఎక్కువై వైర్లు వేడెక్కి కాలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఎంత అవసరమైనా సరే, ఒకే పవర్ బోర్డుపై మరీ ఎక్కువ లోడ్ పడకుండా చూసుకోవడం మంచిది.

కంప్రెసర్‌కు నష్టమే:

రెఫ్రిజిరేటర్లు రోజంతా కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటాయి. వీటికి ఎక్స్‌టెన్షన్ కోర్డు వాడటం వల్ల సరిగ్గా పవర్ అందక కంప్రెసర్ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే ఏసీల విషయానికి వస్తే.. అవి స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ విద్యుత్ అవసరమవుతుంది. చిన్న వైర్లు ఆ లోడ్‌కు తట్టుకోలేవు కాబట్టి వీటికి ప్రత్యేకమైన సాకెట్లు వాడాల్సిందే.

ఆ రిస్క్ తీసుకోవద్దు:

టోస్టర్లు, చిన్న ఓవెన్లు చూడటానికి చిన్నవిగా అనిపించినా అవి కూడా 1500 వాట్స్ వరకు పవర్ వాడుకుంటాయి. వీటిని కూడా ఎక్స్‌టెన్షన్ బోర్డులకు పెట్టి రిస్క్ తీసుకోవద్దు. కేవలం మొబైల్స్, ల్యాప్‌టాప్స్ లేదా చిన్న ఫ్యాన్ల వంటి వాటికి మాత్రమే ఎక్స్‌టెన్షన్ బాక్సులను వాడొచ్చు. ఇలాంటి జాగ్రత్తలతో మీ ఎలక్ట్రానిక్ వస్తువుల జీవితకాలాన్ని పెంచడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా ప్రమాదాల నుండి కాపాడుకోవచ్చు.

Also Read: మాల్స్, థియేటర్లలో టాయిలెట్ డోర్ల కింద ఆ గ్యాప్ ఎందుకో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×