// // Electric Vehicles : ఈవీలకు శీతాకాలం పరీక్ష - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Electric Vehicles : ఈవీలకు శీతాకాలం పరీక్ష

Electric Vehicles : ఈవీలకు శీతాకాలం పరీక్ష
Advertisement
Electric Vehicles

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈవీలతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నా.. చలికాలంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఈవీ బ్యాటరీ ప్యాక్‌ల పని తీరుకు ఈ సీజన్ పరీక్షకాలమనే చెప్పక తప్పదు.

శీతల వాతావరణంలో బ్యాటరీ సామర్థ్యం మందగిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినప్పుడు… మరీ ముఖ్యంగా మైనస్‌లోకి జారిపోయినప్పుడు ఈవీ రేంజ్(మైలేజ్) 12% మేర తగ్గుతుందని అంచనా.

Advertisement

బయటి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతే ఆ ప్రభావం బ్యాటరీపై పడుతుంది. శీతల పరిస్థితుల్లో బ్యాటరీ లోపల కెమికల్ రియాక్షన్స్ నెమ్మదిస్తాయి. దీంతో బ్యాటరీ సామర్థ్యం సన్నగిల్లి.. రేంజ్ కూడా తగ్గిపోతుంది. ఇంజన్ హీటింగ్, డీఫ్రాస్ట్ కోసం ఎలక్ట్రిసిటీని ఎక్కువగా వినియోగించాల్సి రావడం వల్ల కూడా రేంజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.

అంతే కాదు..చలి కాలంలో చార్జింగ్ కూడా అంత వేగంగా జరగదు. సాధారణంగా లిథియం-ఐయాన్ బ్యాటరీలు 20-60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య డిశ్చార్జి అవుతుంటాయి. అయితే చార్జింగ్ విషయానికి వస్తే.. మైనస్ 17 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉంటే మంచిది.

Advertisement

ఇలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చార్జింగ్ చేయడం వల్ల లిథియం ప్లేటింగ్‌ను నిరోధించొచ్చు. ఫ్రీ లిథియం ఐయాన్ల సంఖ్య తగ్గడం ద్వారా తగ్గించి.. తద్వారా బ్యాటరీ పనితీరును, లైఫ్‌టైమ్‌ను తగ్గించే ప్రక్రియను లిథియం ప్లేటింగ్‌గా వ్యవహరిస్తారు. చార్జింగ్ రేట్ పెరిగే కొద్దీ ఈ ప్రక్రియ మరింత ఎక్కువగా జరుగుతుంది. అందుకే సాధ్యమైనంత మేర ఫాస్ట్ చార్జింగ్‌ను ఎంచుకోవద్దు.

ఫాస్ట్ చార్జింగ్ ఎంత మేర తగ్గించగలిగితే.. అంత మేర బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఒకవేళ ఫాస్ట్ చార్జర్‌ను వినియోగించాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మన వాహనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు దీనిని ప్రిఫర్ చేయాలి. ఆరు బయట కాకుండా గ్యారేజిలో ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది. సో.. గ్యారేజీలో వాహనాన్ని పార్క్ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచే వీలుంది.

మరీ ముఖ్యంగా రాత్రివేళ్లలో వాహనాలను ఇండోర్‌లోనే ఉండేలా చూడాలి. మన వాహనాలతో రోడ్డుపైకి వెళ్లే ముందు.. కొద్ది సేపు ప్రీహీట్ చేస్తే మంచిది. ఇప్పుడు దాదాపు అన్ని ఈవీల్లోనూ ప్రీ హీట్ ఆప్షన్ ఉంటోంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కార్లలో హీటర్‌ను గరిష్ఠస్థాయిలో వినియోగించాలి. రీజనరేటివ్(రీ-జెన్) బ్రేకింగ్ ఫీచర్ వల్ల బ్యాటరీలకు అదనంగా చార్జింగ్ లభిస్తుంటుంది.

అయితే వింటర్ సీజన్‌లో.. ముఖ్యంగా మంచు కురిసే ప్రాంతాల్లో రీ-జెన్ బ్రేకింగ్ వల్ల వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో రీ-జెన్ బ్రేకింగ్ ఫీచర్‌ను టర్న్ ఆఫ్ చేయడం మేలు. ఈవీల్లో పవర్ అవుట్ పుట్‌ను తగ్గించేందుకు ఎకో మోడ్ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఈ మోడ్‌లో వాహనాన్ని తక్కువ వేగంతో నడపడం శ్రేయస్కరం. దీని వల్ల బ్యాటరీ రేంజ్ కూడా పెరుగుతుంది.

జారుడు గుణం ఉన్న రహదారులపై ఈ తరహా డ్రైవింగ్ మంచిది కూడా. పెట్రోల్ వెహికల్స్ తరహాలోనే ఈవీ వాహనాల విషయంలోనూ శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టైర్లు, విండ్‌షీల్డ్ వైపర్లు, బ్రేక్‌లకు పీరియాడికల్ తనిఖీలు తప్పనిసరి. అలాగే బ్యాటరీ, చార్జర్ గురించి శ్రద్ధ వహించాలి. పోర్టబుల్ చార్జర్ వినియోగించేవారు లాంగ్ డ్రైవ్ వెళ్లే ముందు పూర్తిగా చెక్ చేసుకోవాలి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×