E-Paper
Advertisement

వాల్‌కి స్టిక్ చేస్తే చాలు.. కిచెన్‌లో హాయిగా వంట చేసుకోవచ్చు, ఈ ‘ఏసీ ఫ్యాన్’ ధర ఎంతంటే?

వాల్‌కి స్టిక్ చేస్తే చాలు.. కిచెన్‌లో హాయిగా వంట చేసుకోవచ్చు, ఈ ‘ఏసీ ఫ్యాన్’ ధర ఎంతంటే?
Advertisement

Summer Deals: సాధారణంగా ఆడవాళ్లకి వంటగదిలో గంటల తరబడి నిల్చొని, రకరకాల వంటలు చేయడం అంటే.. అదొక యుద్దం లాంటిదే. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఆ స్టవ్ దగ్గర వేడికి, బయట ఉష్ణోగ్రత తోడైతే కిచెన్‌లో నిలబడటం నరకప్రాయంగా మారుతుంది. హాల్‌లో ఏసీ ఉన్నా.. ఆ చల్లదనం కిచెన్ దాకా రాదు. అలాగని కిచెన్‌లో ఏసీ పెట్టాలంటే గోడలకు కన్నాలు వేయాలి, కొత్త వైరింగ్ లాగాలి.. ఇవన్నీ పెద్ద తలనొప్పులు. అందుకే వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రముఖ ఎడాన్ కంపెనీ ఓ సూపర్ మినీ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో దీని ఫీచర్లు, ధర, పూర్తి వివరాలు మీ కోసం..

గోడలకు రంధ్రాలు పెట్టక్కర్లేదు:

చాలామందికి కిచెన్‌లో ఫ్యాన్ పెట్టుకోవాలని ఉన్నా.. గోడలు పాడవుతాయనో లేక స్టాండ్ ఫ్యాన్ పెడితే ప్లేస్ సరిపోదనో ఆగిపోతుంటారు. కానీ ఈ ఎడాన్ డివైజ్ ఉంటే ఆ గొడవే లేదు. దీనికి ఇచ్చే స్పెషల్ స్టిక్కర్ స్టాండ్‌తో గోడకు ఈజీగా అతికించేయొచ్చు. డ్రిల్లింగ్ మెషిన్లు, మేకులు కొట్టే అవసరమే రాదు. చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉండి, అసలు చోటే ఆక్రమించదు.

ఎక్కడికైనా పట్టుకెళ్లొచ్చు:

Advertisement

ఈ కూలింగ్ ఫ్యాన్‌లో ఉన్న అసలు మజా ఏమిటంటే.. ఇది వైర్‌లెస్. అలాగే దీనిలో 6000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉండటం వలన ఒక్కసారి ఛార్జింగ్ పెడితే గంటల తరబడి వాడుకోవచ్చు. ఇక ఈ ఏసీ ఫ్యాన్‌లో వైర్లు ఉండవు కాబట్టి.. వంట అయిపోయాక దీన్ని తీసుకెళ్లి బెడ్‌రూమ్‌లోనో, పిల్లలు చదువుకునే దగ్గరో, లేదా సాయంత్రం బాల్కనీలో కూర్చున్నప్పుడు పక్కన పెట్టుకోవచ్చు. మన ఫోన్‌కు లాగే దీనికి కూడా సింపుల్ టైప్‌సి కేబుల్‌తో ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Also Read: యాపిల్ కొత్త స్కెచ్ మాములుగా లేదుగా.. ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే iPhone 16!

గాలిని ఫిల్టర్ చేసే టెక్నాలజీతో:

Advertisement

ఇది మామూలు టేబుల్ ఫ్యాన్ లాగా వేడి గాలిని విసరదు. దీనిలో ఐస్ మిస్ట్ అనే టెక్నాలజీ ఉంది. దీంతో చిన్న ట్యాంకులో నీళ్లు లేదంటే ఐస్ ముక్కలు వేస్తే, అది సన్నని మంచు తుంపరల్లాంటి చల్లటి గాలిని వదులుతుంది. దీంతో చుట్టుపక్కల వాతావరణం ఏసీ ఉన్నట్టుగా ఇట్టే చల్లబడిపోతుంది. పైగా ఈ ఏసీ ఫ్యాన్‌ అయాన్ టెక్నాలజీ గాలిని ఫిల్టర్ చేసి మనకు ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తుంది.

సౌండ్ రాదు.. కరెంటు బిల్లు లేదు:

ఒకవేళ బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే.. ఈ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు అస్సలు శబ్దం రాదు. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాగే దీనిలో మన అవసరానికి తగ్గట్టుగా మూడు స్పీడ్ మోడ్స్ ఉంటాయి. మరీ సోమరిపోతుగా ఉంటే, లేవాల్సిన అవసరం లేకుండా రిమోట్‌తోనే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది కేవలం 20W పవర్ మాత్రమే వాడుకుంటుంది. కాబట్టి.. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే భయం అస్సలే వద్దు.

ధర ఎంతంటే?

ఈ ఎడాన్ మినీ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్ ధర ప్రస్తుతం మార్కెట్లో అది ఇచ్చే ఫీచర్లు, మోడల్‌ను బట్టి సుమారు రూ.4,000 నుండి రూ.6,000 మధ్యలో ఉంది. మీరు కొనుగోలు చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ లేదా అందులో ఉండే ఆఫర్లను బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా అమెజాన్ వంటి సైట్లలో సేల్ సమయంలో ఇది ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.

కొనుగోలు చేయాలా? వద్దా?

ఎండల నుంచి ఉపశమనం పొందడానికి, ముఖ్యంగా వంటగదిలో హాయిగా వంట చేసుకోవడానికి ఈ ఎడాన్ మినీ కూలర్ అనేది బెస్ట్ గ్యాడ్జెట్. తక్కువ ధరలో మంచి క్వాలిటీ, ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యం దీని సొంతం. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉండి ఇల్లు మారాల్సి వచ్చినా, దీన్ని ఊడదీసి సింపుల్‌గా పట్టుకెళ్లొచ్చు. స్టైలిష్‌గా, స్మార్ట్‌గా ఉండే ఈ చిన్న ఏసీ ఫ్యాన్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన వస్తువు.

Also Read: రూ.800కే ఇండక్షన్ స్టవ్ అని ఎగబడి కొన్నారు.. కట్ చేస్తే, ఢాం!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×