E-Paper
Advertisement

45W ఫాస్ట్ ఛార్జింగ్, 8000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి Realme C100x ఎంట్రీ.. టెక్ లవర్స్ ఫుల్ హ్యాపీ!

45W ఫాస్ట్ ఛార్జింగ్, 8000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి Realme C100x ఎంట్రీ.. టెక్ లవర్స్ ఫుల్ హ్యాపీ!
Advertisement

Realme C100x: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ నుంచి బడ్జెట్ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. Realme C100x పేరుతో వస్తున్న ఈ ఫోన్ అధికారికంగా విడుదల కావడానికి ముందే ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించిన వివరాలు లీక అయ్యాయి. భారీ బ్యాటరీ సామర్థ్యం కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ కంపెనీ ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు?

లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ Realme C100x బేస్ వేరియంట్ (4GB + 64GB) ఆఫర్లతో కలుపుకొని సుమారు రూ.14,999 లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ రిటైల్ బాక్స్‌పై గరిష్ట ధర రూ.29,999గా ఉన్నప్పటికీ.. లాంచ్ ఆఫర్ల కింద దీనిని చాలా తక్కువ ధరకే అందించనున్నారు. కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: బట్టల రంగును బట్టి మనుషులను అంచనా వేస్తారా? కలర్ సైకాలజీ ఏం చెబుతోందంటే?

అద్భుతమైన బ్యాటరీ లైఫ్:

ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే. దీనిలో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 17 గంటల పాటు నావిగేషన్ వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పదే పదే ఛార్జింగ్ పెట్టే పనిలేకుండా.. పవర్ బ్యాంక్ అవసరం లేకుండా ఎక్కువ సమయం ఫోన్ వాడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మెరుగైన పనితీరు:

Advertisement

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. దీనిలో 6.8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ వేగంగా పనిచేయడం కోసం యూనిసోక్ టీ7250 (Unisoc T7250) ప్రాసెసర్‌ను వాడారు. అలాగే ఫొటోల కోసం వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 5MP కెమెరా ఉన్నాయి. అలాగే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు డీప్‌బ్లూ టైడ్స్, గోల్డెన్ కోస్ట్ రంగుల్లో ఇది లభిస్తుంది.

మార్కెట్ పోటీ ఎలా ఉంది?

ఈ రోజుల్లో రూ.15 వేల బడ్జెట్లో 5G కనెక్టివిటీ, మెరుగైన ప్రాసెసర్లు కలిగిన ఫోన్లు చాలానే ఉన్నాయి. కానీ Realme C100x కేవలం 4G నెట్‌వర్క్, 4GB RAMతో రావడం కాస్త నిరాశపరిచే విషయమే. అయినప్పటికీ దుమ్ము, నీటి నుండి రక్షణ నిలిచే ఐపీ64 రేటింగ్, అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ ఉండటం వల్ల పెర్ఫార్మెన్స్ కంటే బ్యాటరీ లైఫ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాటరీ.. హువావే నుంచి బెస్ట్ ప్రీమియం ఇయర్‌బడ్స్ విడుదల!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×