E-Paper
Advertisement

50 డిగ్రీలకు పైగా ఎండ.. ఎడారి నగరాల్లో చల్లదనానికి వాడే చిట్కాలివే, మీరూ ఫాలో అయిపోవచ్చు!

50 డిగ్రీలకు పైగా ఎండ.. ఎడారి నగరాల్లో చల్లదనానికి వాడే చిట్కాలివే, మీరూ ఫాలో అయిపోవచ్చు!
Advertisement

Summer Tips: దుబాయ్, సౌదీ వంటి గల్ఫ్ దేశాల పేర్లు వినగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే భవనాలు. కానీ, అక్కడ వేసవి వచ్చిందంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీలు దాటేస్తాయి. కారు స్టీరింగ్‌ పట్టుకోవాలన్నా, రోడ్డు మీద అడుగు పెట్టాలన్నా భయపడేంత సెగ ఉంటుంది. మరి ఇంతటి నిప్పుల కొలిమిలో కూడా అక్కడి జనం ఎలా హ్యాపీగా ఉంటున్నారో తెలుసా? దీనికి కారణం వాళ్లు పాటించే కొన్ని స్మార్ట్ చిట్కాలు. అవేంటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం..

ఆ లక్ష్మణ రేఖ దాటరు:

ఎండలు ముదురుతున్నాయని తెలిస్తే చాలు.. అక్కడి ప్రభుత్వాలు కఠినమైన రూల్స్ పెడతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మధ్యాహ్నం 12:30 నుండి 3:00 గంటల వరకు ఎవరూ ఎండలో పని చేయకూడదు. దీనినే ‘మిడ్ డే బ్రేక్’ అంటారు. ఈ టైమ్‌లో రోడ్ల మీద జనం కూడా కనిపించరు. అందుకే మనం కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ పనులను వాయిదా వేసుకుని, ఉదయం లేదా సాయంత్రం ప్లాన్ చేసుకోవడం అన్నిటికంటే బెస్ట్.

టెక్నాలజీతో చల్లదనం..

Advertisement

దుబాయ్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి మనకు ఎక్కడా వేడి తగలకుండా జాగ్రత్తలు ఉంటాయి. బస్ స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు కూడా ఏసీలతో నిండి ఉంటాయి. భవనాల నిర్మాణంలో కూడా ప్రత్యేక అద్దాలను వాడతారు. ఇవి సూర్యరశ్మిని వెనక్కి పంపేసి గది లోపల చల్లగా ఉండేలా చూస్తాయి. ఇక పాతకాలపు పద్ధతైన ‘విండ్ టవర్ల’ టెక్నాలజీని వాడుతూ విద్యుత్ ఖర్చు లేకుండా చల్లటి గాలిని ఇంటి లోపలికి రప్పించుకుంటారు.

Also Read: AC పేలుళ్లకు అసలు కారణం ఇదేనా? కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ 5 జాగ్రత్తలు పాటించకపోతే రిస్కే!

ఆహారపు అలవాట్లే ప్రధానం:

Advertisement

ఎడారి దేశాల్లో ఉండేవారు ఎండను తట్టుకోవడానికి తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. మసాలాలు, వేపుళ్లు తగ్గించి పండ్లు, పెరుగు, సలాడ్స్, ఖర్జూరాలకు ప్రాధాన్యత ఇస్తారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగుతూ.. ఓఆర్ఎస్ లేదా నిమ్మరసం తీసుకుంటారు. మనం కూడా ఈ ఎండలకు కాటన్ దుస్తులు ధరిస్తూ, నీళ్లు ఎక్కువగా తాగితే ఎండ దెబ్బ నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.

ఈ స్మార్ట్ టిప్స్ పాటిస్తూ..

పగటిపూట కిటికీ కర్టెన్లు పూర్తిగా మూసి ఉంచడం వల్ల గదులు వేడెక్కకుండా ఉంటాయి. ఇక కారు విషయంలో దుబాయ్‌లో ఇంట్రెస్టింగ్ టిప్ పాటిస్తారు. గమ్యస్థానానికి చేరుకునే 5 నిమిషాల ముందే ఏసీ ఆపేస్తారు. దీనివల్ల బాడీ బయట ఉన్న వేడికి నెమ్మదిగా అలవాటు పడుతుంది. చల్లటి ఏసీ నుంచి ఒక్కసారిగా 50 డిగ్రీల ఎండలోకి వెళ్తే వచ్చే ‘హీట్ స్ట్రోక్’ ప్రమాదాన్ని ఇలా తప్పించుకోవచ్చు.

Also Read: Wi-Fi AC ఏసీ అంటే లగ్జరీ కాదు.. టైం, కరెంట్ బిల్లును సేవ్ చేసే స్మార్ట్ టెక్నాలజీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×