E-Paper
Advertisement

ఏసీ బాక్స్‌పై బకెట్ వాటర్‌.. నిజంగా కూలింగ్ పెరుగుతుందా? నిపుణులు చెప్పేది వింటే..!

ఏసీ బాక్స్‌పై బకెట్ వాటర్‌.. నిజంగా కూలింగ్ పెరుగుతుందా? నిపుణులు చెప్పేది వింటే..!
Advertisement

AC Cooling Tips: వేసవిలో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూన్ నెల ఎంటరైనప్పటి నుంచి అడపా దడపా వర్షాలు పడుతున్నప్పటికీ.. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత మాత్రం సమ్మర్ ను తలపిస్తోంది. దీంతో ప్రజలు ఇప్పటికి కూడా ఏసీలను వినియోగిస్తున్నారు. అయితే ఏసీ ఆన్ చేసినా.. గది సరిగా చల్లబడటం లేదన్న కంప్లైంట్స్ ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఏసీ అవుట్ డోర్ యూనిట్ పై బకెట్ వాటర్ పోస్తే.. ఏసీ కూలింగ్ అద్భుతంగా పెరుగుతుందని ప్రచారం జరుగుతోంది. కరెంటు కూడా ఆదా అవుతుందని వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారంలోని నిజా నిజాలేంటో ఈ కథనంలో చూద్దాం.

బకెట్ వాటర్ చిట్కా

సాధారణంగా ఏసీలోని అవుట్‌డోర్ యూనిట్ (కంప్రెసర్) గదిలోని వేడిని బయటకు లాగేసి గాలిని చల్లబరుస్తుంది. ఈ క్రమంలో బయటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినప్పుడు కంప్రెసర్ కూడా విపరీతంగా వేడెక్కిపోతుంది. అది గదిని చల్లబరచడానికి మరింత ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. నెట్టింట జరుగుతున్న ప్రచారం ప్రకారం.. కంప్రెసర్‌పై చల్లటి నీళ్లు పోయడం వల్ల దాని ఉష్ణోగ్రత త్వరగా తగ్గనుంది. కంప్రెసర్ త్వరగా చల్లబడి.. గదిని వేగంగా కూల్ చేయడం మొదలుపెడుతుందని అంటున్నారు. కంప్రెసర్‌పై లోడ్ తగ్గడం వల్ల కొంతవరకు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. సాంకేతికంగా చూస్తే ఈ థియరీ కాస్త నిజమేనన్న అభిప్రాయాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.

లాభాల కంటే నష్టాలే ఎక్కువ

Advertisement

బకెట్ వాటర్ చిట్కా వినడానికి బాగానే ఉన్నప్పటికీ నిపుణులు మాత్రం ఇలా చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక బకెట్ నీళ్లు తెచ్చి ఏసీ కంప్రెసర్‌పై ఒక్కసారిగా గుమ్మరించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అవుట్‌డోర్ యూనిట్‌లో హై-వోల్టేజ్ విద్యుత్ కనెక్షన్లు ఉంటాయని గుర్తు చేస్తున్నారు. నీళ్లు పోసినప్పుడు అవి లోపలికి వెళ్తే షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ పూర్తిగా పాడైపోవచ్చని తెలియజేస్తున్నారు. ఒక్కోసారి కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. కంప్రెసర్ లోపల ఉండే కాయిల్స్, ఫ్యాన్ మోటార్‌పై తరచూ నీళ్లు పడటం వల్ల అవి తుప్పు పట్టి ఏసీ లైఫ్ తగ్గిపోవచ్చని అంటున్నారు.

Also Read: జియో బంపరాఫర్.. రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. మరెన్నో బెనిఫిట్స్!

కూలింగ్ పెంచే చిట్కాలు ఇవే..

Advertisement

ఏసీ కూలింగ్ పెరిగి బిల్లు తగ్గాలంటే బకెట్లతో నీళ్లు పోయాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దానికి బదులు సురక్షితమైన కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా అవుట్‌డోర్ కంప్రెసర్‌పై నేరుగా ఎండ పడకుండా పైన ఒక చిన్న షెడ్ లేదా గ్రీన్ నెట్ లాంటిది ఏర్పాటు చేయాలని హితవు పలుకుతున్నారు. దీనివల్ల కంప్రెసర్ సహజంగానే చల్లగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కంప్రెసర్ వెనుక ఉండే కండోన్సర్ కాయిల్స్‌ ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం వల్ల కూడా ఏసీ సూపర్ గా కూలింగ్ ఇస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ ఎలాంటి వస్తువులు లేకుండా గాలి ఫ్రీగా ఆడేలా ఖాళీ స్థలం ఉంచాలని హితవు పలుకుతున్నారు.

Also Read: BSNL సూపర్ హిట్ ప్లాన్.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా జాతరే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×