E-Paper
Advertisement

అల్యూమినియం ఫాయిల్‌తో వైఫై స్పీడ్ పెంచవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది!

అల్యూమినియం ఫాయిల్‌తో వైఫై స్పీడ్ పెంచవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది!
Advertisement

WiFi Signal: ఇంట్లో కూర్చుని వర్క్ చేస్తున్నప్పుడు, నచ్చిన సినిమా చూస్తున్నప్పుడు వై-ఫై సిగ్నల్ డ్రాప్ అయితే వచ్చే కోపం అంతా ఇంతా కాదు. రూటర్ దగ్గర్లో ఉన్నప్పుడు బాగానే వస్తున్న సిగ్నల్స్.. పక్క గదిలోకి వెళ్లగానే ఎందుకు బలహీనమవుతుందో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రూటర్ సిగ్నల్స్ ను స్ట్రాంగ్ చేసే చిట్కాల కోసం నెట్టింట తెగ వెతికేస్తుంటారు. ఈ క్రమంలోనే వైఫై సిగ్నల్ ను మెరుగుపరిచే ఓ చిట్కా ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే అల్యూమినియం ఫాయిల్ ట్రిక్. నిజంగానే ఈ ఫాయిల్.. వైఫై సిగ్నల్స్ పెంచుతుందా? సైన్స్ ఏం చెబుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

సిగ్నల్ పెరగడం నిజమేనా?

నిపుణుల పరిశోధనల్లో అల్యూమినియం ఫాయిల్.. వైఫై సిగ్నల్స్ ను స్ట్రాంగ్ చేస్తున్నట్లు వెల్లడైంది. అమెరికాలోని డార్ట్‌మౌత్ కాలేజ్ (Dartmouth College) పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో కూడా ఈ విషయమే నిరూపితమైంది. రూటర్ వెనుక భాగంలో ఒక పద్ధతి ప్రకారం అల్యూమినియం ఫాయిల్‌ను అమర్చడం ద్వారా సిగ్నల్ బలాన్ని పెంచవచ్చని వారు స్పష్టం చేశారు.

ఇది ఎలా పనిచేస్తుంది?

Advertisement

సాధారణంగా వైఫై రూటర్లు రేడియో తరంగాల ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను అన్ని వైపులా ప్రసారం చేస్తాయి. అంటే 360 డిగ్రీలలో ఈ తరంగాలు ప్రయాణిస్తాయి. ఇందులో చాలా వరకు సిగ్నల్స్ గోడల వైపు, లేదా ఖాళీగా ఉండే మూలల వైపు వెళ్లి వృథా అవుతుంటాయి. అయితే అల్యూమినియం అనేది ఒక మంచి వాహకం. ఇది రేడియో తరంగాలను అడ్డుకుని తిరిగి వెనక్కి ప్రతిబింబించేలా చేస్తుంది. రూటర్ వెనుక ఒక కర్వ్డ్ షేప్ లో అల్యూమినియం ఫాయిల్‌ను పెట్టినప్పుడు వృథాగా పోయే సిగ్నల్స్ అన్నీ పరావర్తనం చెంది సిగ్నల్ కావలసిన దిశ వైపు బలంగా ప్రయాణిస్తాయని తేలింది.

Also Read: బాత్రూమ్‌లోకి వెళ్తే చాలు.. అంతా అదే చూసుకుంటుంది.. షావోమీ అద్భుత స్మార్ట్ హీటర్ లాంచ్!

దీనివల్ల ప్రయోజనాలు ఏంటి?

Advertisement

అల్యూమినియం పాయిల్ ట్రిక్ తో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫాయిల్ ను ఉపయోగించి రూటర్ సిగ్నల్స్ ను వర్క్ చేసుకునే ప్రాంతానికి పరావర్తనం చెందేలా డైరెక్ట్ చేయవచ్చని చెబుతున్నారు. దీని వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరిగి.. వేగంగా ఆఫీసు వర్క్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో సిగ్నల్ అస్సలు అందని ప్రాంతాలకు (Dead Zones) కూడా సిగ్నల్ చేరేలా అడ్జస్ట్ చేయవచ్చు. అలాగే వైఫై సిగ్నల్స్ ఇంటి బయటకు, పక్కింటికి వెళ్లకుండా అడ్డుకోవచ్చని వివరిస్తున్నారు.

Also Read: గోర్లు లేకుండా మనిషి బతకలేడా? అవి పెరగడం ఆపేస్తే అంతే సంగతులా? నమ్మలేని నిజాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×