E-Paper
Advertisement

Dishwasher Tips: డిష్ వాషర్ ఖర్చు వేధిస్తోందా? టెన్షన్ వద్దు మామ.. ఈ పంచసూత్రాలు ఫాలో అయిపోండి!

Dishwasher Tips: డిష్ వాషర్ ఖర్చు వేధిస్తోందా? టెన్షన్ వద్దు మామ.. ఈ పంచసూత్రాలు ఫాలో అయిపోండి!
Advertisement

Dishwasher Tips: ప్రస్తుతం మార్కెట్ లో అత్యాధునిక డిష్ వాషర్లు అందుబాటులో ఉన్నాయి. చేత్తో తోమడంతో పోలిస్తే అత్యుత్తమంగా పాత్రలను ఇవి క్లీనింగ్ చేస్తున్నాయి. అయితే రూ.15,000 నుంచి రూ.55,000 వరకూ ఖర్చు చేసి ఈ డిష్ వాషర్ ను కొన్నప్పటికీ.. దాని మెయింటెనెన్స్ రూపంలో మరింత ఆర్థిక భారం పడుతోందని వినియోగదారులు వాపోతున్నారు. అటువంటి వారికి.. పవర్ – నీటి బిల్లులు, డిటర్జెంట్ ఖర్చులు భరించలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఒక 5 చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫుల్ లోడ్ అయితేనే వాడండి

డిష్‌వాషర్ సగం నిండినప్పుడు దానిని ఆన్ చేయడం వల్ల అనవసరంగా విద్యుత్, నీరు వృథా అవుతాయి. మెషీన్ పూర్తిగా నిండిన తర్వాతే వాడటం వల్ల ఒకేసారి ఎక్కువ గిన్నెలు శుభ్రమవుతాయి. దీనివల్ల ఒక నెలలో మెషీన్ తిరిగే సైకిల్స్ సంఖ్య తగ్గి.. కరెంటు బిల్లు ఆదా అవుతుంది.

ఎకో-మోడ్ ఎంచుకోండి

Advertisement

చాలా ఆధునిక డిష్‌వాషర్లలో ‘ఎకో-మోడ్’ అనే ఆప్షన్ ను అందుబాటులో ఉంది. ఇది తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీటిని వేడి చేయడంతో పాటు తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. సాధారణ వాష్‌తో పోలిస్తే దీనికి కొంచెం ఎక్కువ సమయం పట్టినప్పటికీ ఇది విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

గిన్నెలను ముందుగా కడగొద్దు

చాలామంది గిన్నెలను డిష్‌వాషర్‌లో పెట్టే ముందు కుళాయి కింద ఉంచి నీటితో కడుగుతుంటారు. దీనివల్ల నీరు విపరీతంగా వృథా అవుతుంది. ప్రస్తుత కాలంలో డిష్‌వాషర్లు, డిటర్జెంట్లు చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి గిన్నెలపై ఉన్న ఆహార వ్యర్థాలను ఒక స్పూన్‌తో తీసేసి నేరుగా మెషీన్‌లో పెట్టడం వల్ల నీటి బిల్లును తగ్గించుకోవచ్చు.

హీట్ డ్రై ఆప్షన్‌ ఆఫ్

Advertisement

చాలా వరకూ డిష్‌వాషర్లలో గిన్నెలను ఆరబెట్టడానికి ‘హీట్ డ్రై’ (Heat Dry) అనే ఫీచర్ ఉంది. ఇది చాలా కరెంటును వినియోగిస్తుంది. దీనికి బదులుగా వాషింగ్ సైకిల్ పూర్తయిన వెంటనే మెషీన్ తలుపును కొంచెం తెరిచి ఉంచండి. బయట ఉండే గాలి ద్వారా గిన్నెలు వాటంతట అవే ఆరిపోతాయి. ఈ చిన్న మార్పుతో విద్యుత్ ఖర్చును ఆదా చేయవచ్చు.

Also Read: Dishwasher Monthly Cost: డిష్ వాషర్ వాడితే.. నెలకు అయ్యే ఖర్చు ఎంత? ఇది తెలుసుకోండి ఫస్ట్!

ఆ సమయాల్లో వద్దు..

కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సంస్థలు సమయాన్ని బట్టి యూనిట్ ధరను నిర్ణయిస్తుంటాయి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కాకుండా రాత్రి పూట లేదా విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో డిష్‌వాషర్ వాడటం వల్ల బిల్లు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ డిష్‌వాషర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల మెషీన్ సమర్థవంతంగా పనిచేసి తక్కువ శక్తిని తీసుకుంటుంది.

Also Read: Upcoming ACs April 2026: కొత్త ఏసీ కావాలా? రుకో జరా, సబర్ కరో.. ఏప్రిల్‌లో వచ్చే టాప్ మోడల్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×