E-Paper
Advertisement

Front Load vs Top Load: వాషింగ్ మిషన్లలో ఎందుకీ తేడా? ప్రత్యేకతలు ఏంటి.. రెండింటిలో ఏది బెస్ట్?

Front Load vs Top Load: వాషింగ్ మిషన్లలో ఎందుకీ తేడా? ప్రత్యేకతలు ఏంటి.. రెండింటిలో ఏది బెస్ట్?
Advertisement

Front Load vs Top Load: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో కంపెనీల వాషింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ ప్రధానంగా ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ అనే వేరింయట్లలో విభజించపడ్డాయి. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏది కొంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో ఫ్రంట్ లోడ్ – టాప్ లోడ్ వాషింగ్ మిషన్ల మధ్య తేడాలు ఏంటీ? ఏది కొంటే బెటర్? ఇప్పుడు పరిశీలిద్దాం.

బట్టలు వేసే విధానం..

టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో మూత (డోర్) పైభాగంలో ఉంటుంది. కాబట్టి బట్టలను నిలబడే తెలిగ్గా మిషన్ లో వేయవచ్చు. అదే ఫ్రంట్ లోడ్ విషయానికి వస్తే ముందు భాగంలో డోర్ ఉంటుంది. టాప్ లోడ్ లో నిలబడే వేసేందుకు వీలుండగా.. ఫ్రంట్ లోడ్ లో మాత్రం కాస్త ఒంగి వేయడం వల్ల వృద్ధులు, పెద్దలకు ఇబ్బంది కలుగువచ్చు.

దుస్తులు శుభ్రపరిచే విధానం

Advertisement

టాప్ లోడ్ వాషింగ్ మిషన్లు దుస్తులను గుండ్రంగా తిప్పుతూ (Agitator/Impeller) శుభ్రం చేస్తాయి. ఇది కాస్త కఠినమైన ప్రాసెస్ గా చెప్పవచ్చు. అదే ఫ్రంట్ లోడ్ విషయానికి వస్తే.. ‘టంబల్-లోడ్’ (Tumble-load) పద్దతిలో ఉతుకుతుంది. ఫలితంగా బట్టల మురికిని సమర్థవంతంగా తొలగిస్తుంది.

వాటర్, విద్యుత్ వినియోగం..

టాప్ లోడ్ తో పోలిస్తే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు తక్కువ నీరు, విద్యుత్ ను వినియోగిస్తాయి. టాప్ లోడ్ వినియోగించే దానితో పోలిస్తే 50 శాతం తక్కువ వినియోగం ఉంటుంది. కాబట్టి టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ వినియోగం ద్వారా పవర్ బిల్లును తగ్గించుకోవచ్చు.

వేగవంతంగా వాషింగ్..

Advertisement

ఫాస్ట్ వాషింగ్ విషయంలో టాప్ లోడ్ పైచేయి సాధిస్తుంది. ఫ్రంట్ లోడ్ తో పోలిస్తే 30-40 శాతం లోపే వాషింగ్ ను ఫినిష్ చేసేస్తుంది. అయితే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా.. బట్టలు త్వరగా ఆరిపోతాయి.

వాడే సౌలభ్యం..

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో డోర్ పైన ఉంటుంది కాబట్టి.. మధ్యలోనూ బట్టలు వేసేందుకు వీలు ఉంటుంది. కానీ ఫ్రంట్ లోడ్ లో డోర్ ముందు వైపు ఉన్నందున మధ్యలో ఓపెన్ చేసేందుకు వీలుండదు. ఒకసారి ఫ్రంట్ లోడ్ లో మిషన్ ఆన్ అయితే తిరిగి బట్టలు వేసేందుకు ఆస్కారం ఉండదు.

ధర విషయానికి వస్తే..

ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మధ్య ధర విషయంలో స్పష్టమైన తేడా ఉంది. ఫ్రంట్ లోడ్ తో పోలిస్తే టాప్ లోడ్ కాస్త చౌకగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో మంచి ఎంపికగా నిలుస్తాయి.

Also Read: Air Coolers 50 Percent Off: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ కంపెనీ కూలర్లు.. ఈ ఛాన్స్ వదులుకోవద్దు!

రెండింటిలో ఏది బెటర్?

మెరుగైన క్లీనింగ్, తక్కువ నీరు/పవర్ వినియోగం, బట్టల సంరక్షణ కోరుకునే వారు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొనుగోలు చేస్తే మంచిది. అలా కాకుండా తక్కువ ధర, తేలికపాటి నిర్వాహణ, ఫ్రెండ్లీ యూజింగ్ కోరుకునేవారు టాప్ లోడ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

Also Read: Best ACs Under Rs 20,000: సమ్మర్ స్పెషల్ ఏసీలు.. రూ.20,000లోపు ది బెస్ట్ ఇవే.. ఓసారి ట్రై చేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×