E-Paper
Advertisement

DeepSeek : చైనా డీప్ సీక్ పై సైబర్ దాడి.. ట్రంప్ స్పందన ఏంటంటే!

DeepSeek : చైనా డీప్ సీక్ పై సైబర్ దాడి.. ట్రంప్ స్పందన ఏంటంటే!
Advertisement

DeepSeek : చైనా ఏఐ స్టార్టప్‌ ‘డీప్‌సీక్‌’ సర్వీసులు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఈ సమయంలో చైనా టెలిఫోన్‌ నంబర్లు కలిగి ఉన్నవారు మాత్రమే సైన్‌అప్‌ అయ్యారు. ఈ విషయంపై స్పందించిన ఆ సంస్థ.. డీప్‌సీక్‌పై సైబర్‌ దాడిపై సైబర్ దాడి జరిగిందని.. అందుకే సేవలు కాసేపు ఆగిపోయాయని తెలిపింది. అంతేకాకుండా యూజర్లు రిజిస్టర్‌ చేసుకోలేకపోవటానికి కారణం కూడా ఇదేనని వెల్లడించింది.

చైనా స్టార్టప్‌ కంపెనీ ‘డీప్‌సీక్‌ (DeepSeek)’.. కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఇటీవల R1 పేరిట ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. అయితే ఈ సర్వీస్ పూర్తిగా ఫ్రీ కావటంతో  ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ముందు నుంచి ఈ ప్లాట్ఫామ్ కు విశేష ఆదరణ లభిస్తుండగా తాజాగా సోమవారం ఉదయం ఈ యాప్ డౌన్లోడ్ కోసం యూజర్స్ తెగ పోటీపడ్డారు. యాపిల్ ఐఫోన్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో నెంబర్ వన్ డౌన్‌లోడెడ్‌ ఫ్రీ యాప్‌గా నిలిచింది. అయితే ఇలా జరిగిన కాసేపటికే ఈ యాప్ సర్వీసెస్ నిలిచిపోయాయి. కేవలం చైనా  చైనా టెలిఫోన్‌ నంబర్స్ ఉన్న యూజర్స్ మాత్రమే రిజిష్టర్ అవ్వగలిగారు. ఇతర యూజర్స్ రిజిస్టేషన్ అవ్వలేకపోయారు.

Advertisement

ఈ నేపథ్యంలో డీప్ సీక్ స్పందించింది. తమ సర్వీసులపై సైబర్ దాడి జరిగిందని.. అందుకే రిజిస్ట్రేషన్ సేవలు పరిమితం చేసినట్టు తెలిపింది. ఇప్పటికే రిజిస్టర్ అయిన యూజర్స్ యధావిధిగా సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే కొత్త యూజర్స్ మళ్ళీ ఎప్పటి నుంచి రిజిష్టర్ అయ్యే అవకాశం ఉంటుందో మాత్రం వెల్లడించలేదు.

ALSO READ : డీప్‌సీక్ తో చైనా ప్రపంచాన్ని శాసించనుందా!

Advertisement

ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ డీప్ సీక్ మోడల్ పై స్పందించారు. “డీప్ సీక్ ప్రపంచ ఇండస్ట్రీలకు ఓ మేలుకొలుపు. ఈ పోటీలో గెలవడంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. బిలియన్ డాలర్ల ఖర్చుతో తీసుకొచ్చే సాంకేతికతను మార్చి తక్కువ ఖర్చుతో కొత్త సాంకేతికతను తీసుకొచ్చే పరిష్కారాలను వెతకాలి…” అని తెలిపారు

ఇక డీప్ సీక్ పరిచయం అమెరికా టెక్ పరిశ్రమపై పెను ప్రభావాన్ని చూపించిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎన్విడియాతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధునాతన చిప్స్ తోనే డీప్ సీక్ మోడల్స్ రూపొందించడంతో ఆ సంస్థకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. సోమవారం నాటి మార్కెట్లో ఎన్వీడియా షేర్లు విపరీతంగా తగ్గిపోయాయి. దాదాపు 17 శాతం తగ్గిపోవడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువలో 593 బిలియన్ డాలర్ల సంపద నష్టపోవాల్సి వచ్చింది. అంటే ఇది ఇండియన్ మార్కెట్లో రూ. రూ.51లక్షల కోట్లు. షేర్ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద నష్టం జరగలేదని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు మైక్రోసాఫ్ట్‌, మెటా షేర్లు కూడా విపరీతంగా తగ్గిపోయాయి. మరి ఈ డీప్ సీక్ ముందు ముందు ఇంకెంత ప్రభావం చూపిస్తోందో చూడాలి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×