E-Paper
Advertisement

రోడ్డు పక్కన దొరికే లోకల్ ఛార్జర్లు వాడుతున్నారా? మీ ఫోన్ పాడవడం గ్యారంటీ

రోడ్డు పక్కన దొరికే లోకల్ ఛార్జర్లు వాడుతున్నారా? మీ ఫోన్ పాడవడం గ్యారంటీ
Advertisement

Smart phone charging tips: స్మార్ట్‌ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవని రోజులివి. అలాంటి మన ఫోన్ ఛార్జింగ్ అయిపోతే.. వెంటనే ఏదో ఒక అడాప్టర్ దొరికితే చాలురా బాబు అనుకుంటాం. ప్రయాణాల్లో ఉన్నప్పుడో లేదా ఆఫీసులో ఉన్నప్పుడో ఒరిజినల్ ఛార్జర్ లేకపోతే, రోడ్డు పక్కన దొరికే రూ.100 లేదా రూ.250 లోకల్ ఛార్జర్లను కొనేసి వాడుతుంటాం. “ఛార్జింగ్ ఎక్కుతోంది కదా.. ఏమైపోతుందిలే!” అని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ.. ఈ చిన్న నిర్లక్ష్యం మీ ఫోన్‌ను ఒక టైం బాంబులా మార్చేస్తుందని మీకు తెలుసా? తక్కువ ధరకు దొరికే లోకల్ అడాప్టర్లు వాడటం వల్ల మీ స్మార్ట్‌ఫోన్‌కు జరిగే నష్టాలు, అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లోకల్ ఛార్జర్లు వాడితే కలిగే నష్టాలు:

1. బ్యాటరీ లైఫ్ పూర్తిగా ఖతం!
ఒరిజినల్ బ్రాండెడ్ ఛార్జర్లు మీ ఫోన్ మోడల్‌కు ఎంత వోల్టేజ్, కరెంట్ కావాలో అంత మాత్రమే పంపిస్తాయి. కానీ లోకల్, చౌకైన అడాప్టర్లలో కరెంట్ ఫ్లోను కంట్రోల్ చేసే స్మార్ట్ చిప్స్ ఉండవు. దీని వల్ల పోన్ పై విపరీతమైన ప్రెజర్ పడి, బ్యాటరీ హెల్త్ చాలా వేగంగా పడిపోతుంది. ఫోన్ బ్యాకప్ రాకుండా త్వరగా డ్రై అయిపోతుంది.

Advertisement

2. విపరీతమైన హీటింగ్ సమస్య :
లోకల్ ఛార్జర్‌తో ఫోన్ పెట్టినప్పుడు పవర్ సప్లై పెరుగతూ తగ్గుతూ ఉంటుంది. దీని వల్ల ఫోన్ , అడాప్టర్ రెండు కూడా ఇస్త్రీ పెట్టెలా వేడెక్కిపోతాయి. ఇలా ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఫోన్ లోపల ఉండే మదర్‌బోర్డ్, ప్రాసెసర్ దెబ్బతిని ఫోన్ స్లో అయిపోతుంది లేదా పదే పదే హ్యాంగ్ అవుతుంది.

3. బ్యాటరీ ఉబ్బిపోవడం:
తక్కువ ధరకు దొరికే అడాప్టర్లలో క్వాలిటీ లేని కాంపోనెంట్స్ వాడతారు. షార్ట్ సర్క్యూట్ కాకుండా ఆపే కెపాసిటీ వీటికి ఉండదు. కరెంట్ వోల్టేజ్ ఒక్కసారిగా పెరిగితే.. ఫోన్ బ్యాటరీ ఉబ్బిపోవడమే కాదు, కొన్నిసార్లు ఫోన్ పేలిపోయి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. పేపర్లలో చూసే చాలా వరకు ఫోన్ బ్లాస్టింగ్ కేసుల వెనుక ఈ లోకల్ ఛార్జర్ల హస్తమే ఉంటుంది.

Advertisement

4. టచ్ స్క్రీన్ సరిగ్గా పనిచేయదు:
మీరు ఎప్పుడైనా గమనించారా? లోకల్ ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ టచ్ స్క్రీన్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది. మనం ఒకచోట నొక్కితే ఇంకోచోట క్లిక్ అవుతుంది. దీనికి కారణం లోకల్ ఛార్జర్ల నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ నాయిస్ . ఇది స్క్రీన్ సెన్సార్లను పూర్తిగా పాడు చేస్తుంది.

Also Read: డిజిటల్ డిస్‌ప్లేతో వచ్చే.. బెస్ట్ బడ్జెట్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు.. ఇంకెందుకు ఆలస్యం

స్మార్ట్ ఛార్జింగ్ చిట్కాలు:
ఒరిజినల్ ఛార్జర్ లేదా బ్రాండెడ్ సర్టిఫైడ్ (రైట్ వోల్టేజ్ ఉన్న) ఛార్జర్లను మాత్రమే వాడండి.

అత్యవసర పరిస్థితుల్లో లోకల్ ఛార్జర్ వాడాల్సి వస్తే.. ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ వాడకండి.

పవర్ బ్యాంక్ కొనేటప్పుడు కూడా క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ (Mi, Anker, Ambrane) మాత్రమే ఎంచుకోండి.

ఫోన్ నైట్ అంతా ఛార్జింగ్‌లో పెట్టే అలవాటు ఉంటే.. మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ‘Optimized Charging’ ఆప్షన్‌ను ఆన్ చేసి పెట్టుకోండి.

రూ. 20,000 పెట్టి ఫోన్ కొన్నప్పుడు.. దాని సేఫ్టీ కోసం మరో రూ. 500 లేదా రూ. 1000 పెట్టి మంచి ఛార్జర్ కొనడం ఎప్పుడూ బెస్ట్ ఐడియా. చిన్న లాభం కోసం చూసి పెద్ద నష్టాన్ని కొనితెచ్చుకోకండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×