E-Paper
Advertisement

D2M Feature Phone: మారుమూల గ్రామాల కోసం ఇంటర్నెట్ అక్కర్లేని మొబైల్స్.. భారత్‌లో తయారీ మొదలెట్టిన ఖుష్‌టెక్!

D2M Feature Phone: మారుమూల గ్రామాల కోసం ఇంటర్నెట్ అక్కర్లేని మొబైల్స్.. భారత్‌లో తయారీ మొదలెట్టిన ఖుష్‌టెక్!
Advertisement

D2M Feature Phone: ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ వాడాలన్నా, అందులో వీడియోలు చూడాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఇప్పుడు రాబోతున్న కొత్త రకం ఫోన్లతో ఆ అవసరం ఉండదు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, ఒక్క రూపాయి డేటా ఖర్చు చేయకుండానే నేరుగా మొబైల్‌లో లైవ్ టీవీ ఛానళ్లను చూసే అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. దీనినే ‘డైరెక్ట్ టు మొబైల్’ (D2M) టెక్నాలజీ అని పిలుస్తారు.

అసలేమిటీ D2M టెక్నాలజీ?

సాధారణంగా మనం ఇంట్లో వాడే టీవీలకు యాంటెన్నా లేదా డిష్ ఎలాగైతే సిగ్నల్స్ అందుకుంటాయో.. ఈ కొత్త ఫోన్లు కూడా అలాగే పనిచేస్తాయి. వీటిలో అమర్చే ఒక ప్రత్యేకమైన స్వీకరణ చిప్ ద్వారా టీవీ ప్రసారాల సంకేతాలను నేరుగా మొబైల్ స్క్రీన్‌పై చూడొచ్చు. దీనివల్ల మొబైల్ నెట్‌వర్క్ లేదా వై-ఫైతో సంబంధం లేకుండా లైవ్ టీవీ ప్రసారాలు నిరంతరాయంగా అందుతాయి. డేటా అయిపోతుందనే భయం లేకుండా ఎంతసేపైనా వార్తలు, వినోద కార్యక్రమాలను ఉచితంగా చూసుకోవచ్చు.

Advertisement

Also Read: ఐఫోన్‌కు కూడా సాధ్యం కాని డిజైన్.. యువతను కట్టిపడేసేలా గూగుల్ స్పెషల్ సర్ప్రైజ్!

రంగంలోకి ప్రముఖ కంపెనీలు..

భారతదేశంలో ఈ D2M సాంకేతికతతో కూడిన ఫీచర్ ఫోన్లను తయారు చేసేందుకు ఖుష్‌టెక్ కొరియా అనే సంస్థ ఇప్పటికే BIS ధృవీకరణ పొందింది. నవీ ముంబైలో దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదికి దాదాపు 30 లక్షల ఫోన్లను తయారు చేయడమే వీరి లక్ష్యం. కేవలం ఈ కంపెనీయే కాకుండా, నోకియా, లావా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి. ఇప్పటికే తమ నమూనా ఫోన్లను ప్రదర్శించిన ఈ కంపెనీలు, త్వరలోనే వీటిని మార్కెట్లోకి తీసుకురానున్నాయి.

గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు..

Advertisement

మన దేశంలో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి చోట్ల నివసించే ప్రజలకు ఈ ఫోన్లు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా 2జీ ఫోన్లు వాడుతున్న వారికి, తక్కువ ఖర్చుతో సమాచారాన్ని, వినోదాన్ని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎలాంటి అదనపు రీఛార్జ్ అవసరం లేకుండానే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ ఫోన్లు సామాన్యులకు మంచి ప్రత్యామ్నాయంగా మారనున్నాయి.

Also Read: అబ్బే, ఇలాంటి ఫోన్ ఎప్పుడూ చూసుండరు.. రియల్‌మీ సెల్ఫీ మిర్రర్ ఫోన్ వచ్చేస్తోందిరోయ్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×