E-Paper
Advertisement

D-Mart Fake Offer: డి-మార్ట్ క్రేజీ ఆఫర్.. లింక్ ఓపెన్ చేసిన వెంటనే షాకింగ్!

D-Mart Fake Offer: డి-మార్ట్ క్రేజీ ఆఫర్.. లింక్ ఓపెన్ చేసిన వెంటనే షాకింగ్!
Advertisement

డిమార్ట్, విశాల్ మార్ట్, జియో మార్ట్.. ఒక్కసారి షాపింగ్ చేస్తే, రోజూ ఏదో ఒక ఆఫర్ అంటూ మెసేజ్ లు వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా 75 ఏళ్ల ఓ వృద్ధుడు కూడా డిమార్ట్ లో షాపింగ్ చేశాడు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, సామాన్లు కొని తెచ్చాడు. తాజాగా డిమార్ట్ ఆఫర్స్ పేరుతో ఆయన ఫోన్ కు ఓ లింక్ వచ్చింది. డిమార్ట్ లో పలు వస్తువుల మీద ఏకంగా 80 శాతం తగ్గింపు అందిస్తున్నట్లు ఆ లింక్ తో పాటు ఓ మెసేజ్ యాడ్ చేసి ఉంది. సరే తనకు అవసరమైన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అనే ఆశతో లింక్ క్లిక్ చేశాడు. కాసేపట్లోనే తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాడు. తన అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులు ఖాళీ అయినట్లు తెలియడంతో లబోదిబో అంటూ పోలీస్టేషన్ కు పరిగెత్తి ఫిర్యాదు చేశాడు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

గత కొంత కాలంగా సైబర్ కేటుగాళ్లు రకరకాల మెసేజ్ లు పంపిస్తూ అమాయకులకు వల విసురుతున్నారు. అందులో భాగంగానే తాజాగా నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి.. డిమార్ట్ ఆఫర్ లింక్ తో హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ఓ 75 ఏళ్ల  ఓ స్కామ్ APK ఫైల్‌ వచ్చింది. అందులో ఆకట్టుకునే ఆఫర్లు ఉన్నట్లు కనిపించింది. ఏ వస్తువుల మీద ఆఫర్లు ఉన్నయో చూడాలని క్లిక్ చేశాడు. కాసేపట్లోనే తన అకౌంట్ లో ఉన్న రూ.1.09 లక్షలు మాయం అయినట్లు మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే తన అకౌంట్ ఓపెన్ చేసి చూసి, డబ్బుల అన్నీ పోయినట్లు గుర్తించాడు. వెంటన లబోదిమో అంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Advertisement

Read Also:  గ్రోక్‌ను రూ.2 వేలు అప్పు అడిగిన నెటిజన్.. దాని సమాధానం తెలిస్తే షాకవుతారు!

పోలీసులు ఏం చెప్తున్నారంటే?

గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే APK ఫైల్స్ ను అస్సలు ఓపెన్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  పోలీసుల ప్రకారం.. “హబ్సిగూడ నివాసి అయిన ఆ వ్యక్తికి ఫేస్‌ బుక్‌ లో ‘groceries@298’ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్లు అడిగిన సమాచారాన్ని ఫిల్ చేశాడు. ఆ తర్వాత,  వెంటనే ఆ వ్యక్తి వాట్సాప్‌ లో APK ఫైల్‌ వచ్చింది. అతడు ఫైల్ మీద క్లిక్ చేయగానే, అతడి ఫోన్ హ్యాక్ అయ్యింది. సైబర్ కేటుగాళ్లు తన బ్యాంక్ అకౌంట్ ను యాక్సెస్ చేసి అతడి ఖాతా నుంచి రూ.1.09 లక్షలు విత్‌ డ్రా చేసుకున్నారు” అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాట్సాప్ సహా ఏ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా పంపిన APK ఫైల్‌ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Read Also: లోయర్ బెర్త్ విషయంలో కీలక నిర్ణయం, అసలు విషయం చెప్పేసిన అశ్విని వైష్ణవ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×