E-Paper
Advertisement

Summer Tips: మీ ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయా? ఈ తేలికైన టిప్స్ పాటిస్తే.. వేసవిలోనూ కూల్‌గా ఉండొచ్చు!

Summer Tips: మీ ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయా? ఈ తేలికైన టిప్స్ పాటిస్తే.. వేసవిలోనూ కూల్‌గా ఉండొచ్చు!
Advertisement

Summer Tips: ప్రస్తుత రోజుల్లో సీలింగ్ ఫ్యాన్ లేని ఇల్లు ఉండదంటే ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ఈ సీలింగ్ ఫ్యాన్స్.. 365 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తూ చెమట పట్టకుండా చూసుకుంటాయి. అయితే వేసవిలో ఫ్యాన్స్ వినియోగం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయట ఉండే అధిక వేడి కారణంగా.. ఫ్యాన్ గాలి సైతం వడగాలిని తలపిస్తుంటుంది. తద్వారా ఇంటిని హీటెక్కిస్తుంది. అయితే ‘క్రాస్-వెంటిలేషన్ ట్రిక్’ (Cross-ventilation trick) ద్వారా ఏసీ లేకపోయినా ఫ్యాన్ గాలిని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఇంటిలోని వేడిని తగ్గించుకోని కూల్ గా ఉండొచ్చని హితవు పలుకుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్యాన్ గాలి డైరెక్షన్..

సాధారణంగా చాలామంది ఫ్యాన్ గాలి తమ మీద పడేలా గది లోపల మిడిల్ లో పెట్టుకుంటారు. అయితే వేసవిలో ఉండే వేడిని బయటకు పంపాలంటే ఇది సరిపోదు. ఒకవేళ గదిలో రెండు కిటికీలు ఉన్నట్లయితే ఒక కిటికీ వద్ద ఫ్యాన్‌ను బయటి వైపునకు గాలి పంపేలా ఫిక్స్ చేయండి. ఇది గదిలోని వేడి గాలిని బయటకు పంపుతుంది. రెండవ కిటికీని తెరిచి ఉంచడం వల్ల అక్కడ నుంచి చల్లని గాలి సహజంగానే గదిలోపలికి ప్రవేశించి అహ్లాదకరంగా మార్చేస్తుంది.

ఫైర్‌ ఫైటర్ ట్రిక్

Advertisement

అయితే గదిలోని వేడిని త్వరగా బయటకు పంపడానికి ఫ్యాన్‌ను కిటికీకి అతి దగ్గరగా కాకుండా 2 నుండి 5 అడుగుల దూరంలో ఉంచితే బెటర్. ఇలా చేయడం వల్ల గదిలోని అన్ని వైపుల ఉన్న వేడి గాలిని బయటకు పంపేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనిని బెర్నౌలీ సూత్రంగా చెబుతుంటారు.

కిటికీల ఎత్తును బట్టి ఫ్యాన్

సాధారణంగా వేడి గాలి ఎప్పుడూ పైకే వెళ్తుంది. కాబట్టి తక్కువ హైట్ లో ఉన్న కిటికీల వద్ద కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కిటికీల వద్ద ఫ్యాన్ ను అమర్చండి. ఫ్యాన్ ను బయటకి వెళ్లేలా పెట్టి.. కింద ఉన్న కిటికీలను తెరిచి ఉంచితే క్రాస్ వెంటిలేషన్ అద్భుతంగా జరుగుతుంది. తద్వారా గదిలో ఉక్కపోత, వేడి లేకుండా ఉంటుంది.

ఆ టైంలో కిటికీలు తెరవద్దు

Advertisement

ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్న సమయంలో కిటికీలు మూసి ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం లేదా తెల్లవారుజామున బయట గాలి చల్లగా ఉన్నప్పుడు ఈ క్రాస్-వెంటిలేషన్ ట్రిక్ వాడితే ఇల్లు త్వరగా చల్లబడుతుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: వివాహేతర బంధం కోసం ఘాతుకం.. భర్తను సుపారీ ఇచ్చి చంపించిన భార్య!

మరికొన్ని చిట్కాలు

క్రాస్ వెంటిలేషన్ తో పాటు గదిని చల్లగా ఉంచుకునేందుకు మరికొన్ని చిట్కాలు సైతం అద్భుతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఇంట్లోని టేబుల్ ఫ్యాన్ ముందు ఒక గిన్నెలో ఐస్ ముక్కలు గానీ, చల్లని నీరు ఉంచితే అది గదిలోకి చల్లని గాలిని పంపుతుంది. మరోవైపు వేసవిలో సీలింగ్ ఫ్యాన్ యాంటీ-క్లాక్‌వైస్ (Counter-clockwise) దిశలో తిరిగేలా చూసుకోండి. ఇది గాలిని నేరుగా కిందికి నెట్టి చల్లదనాన్ని ఇస్తుంది.

Also Read: మొదలవ్వక ముందే శర్వానంద్, శ్రీను వైట్ల సినిమాకు ఎండ్ కార్డ్!.. కారణం ఇదే..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×