E-Paper
Advertisement

AC vs Cooler: కూలింగ్ పరంగా కాదు.. ఆరోగ్యం పరంగా.. రెండింట్లో ఏది బెస్ట్?

AC vs Cooler: కూలింగ్ పరంగా కాదు.. ఆరోగ్యం పరంగా.. రెండింట్లో ఏది బెస్ట్?
Advertisement

Cooler vs AC: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఏ స్థాయిలో కాస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇళ్లల్లోని ఏసీలు, కూలర్లను ఆన్ చేసుకొని వాటి వద్ద సేద తీరుతున్నారు. అయితే కూలింగ్ పరంగా ఏసీలదే పైచేయి అని అందరికీ తెలిసిందే. మరి ఆరోగ్యం పరంగా కూలర్లు మంచిదా? ఏసీ బెటరా? అన్న సందేహం సహజంగానే చాలా మందిలో ఉంది. ఈ కథనంలో దానిపై ఓ క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.

గాలి నాణ్యత పరంగా..

సాధారణంగా ఎయిర్ కూలర్లు బయటి నుంచి తాజా గాలిని లోపలికి లాగి నీటి ద్వారా చల్లబరిచి గదిలోకి పంపుతాయి. దీనివల్ల గదిలో గాలి నిరంతరం మారుతూ ఉంటుంది. అదే ఏసీ విషయానికి వస్తే అది గదిలోని గాలినే పదే పదే రీసర్క్యులేట్ చేస్తుంది. తాజా గాలి రాకపోవడం వల్ల ఏసీ గదుల్లో బ్యాక్టీరియా, వైరస్‌లు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది.

తేమ ప్రభావం

Advertisement

కూలర్లు గాలిలో తేమను పెంచుతాయి. అందువల్ల ఢిల్లీ, రాజస్థాన్ వంటి పొడి వాతావరణం (Dry Heat) ఉన్న ప్రాంతాల్లో కూలర్ల వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. కానీ ముంబై, చెన్నై, వైజాగ్ వంటి తీరప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూలర్ వాడితే చెమటలు ఎక్కువగా పట్టి ఉక్కపోత పెరుగుతుంది. ఇటువంటి చోట్ల ఏసీలు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తాయి. అదనపు తేమను తీసేసి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది.

శ్వాసకోస సమస్యలు!

ఏసీ గదిలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల కొందరికి కీళ్ల నొప్పులు, జలుబు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీ ఫిల్టర్లను క్రమంగా శుభ్రం చేయకపోతే గాలి నాణ్యత దెబ్బతింటుంది. మరోవైపు కూలర్లలో నీటిని ప్రతిరోజూ మార్చకపోతే దోమలు చేరి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అలాగే ఆస్తమా ఉన్నవారికి కూలర్ వల్ల వచ్చే అధిక తేమ పడకపోవచ్చు. ఈ పరంగా చూస్తే రెండూ కాస్త ఇబ్బంది కలిగించే అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోందా? కొత్తది కొనకుండానే.. స్పీడ్ పెంచే మ్యాజిక్ చిట్కాలు ఇవే!

ఫైనల్గా ఏది బెటర్?

ఆరోగ్య రీత్యా చూస్తే సహజసిద్ధమైన గాలిని అందించే కూలర్ మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ అది మీ ప్రాంత వాతావరణంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. పొడి ఎండలు ఉంటే కూలర్.. ఉక్కపోత ఎక్కువగా ఉంటే ఏసీ మంచిదని సూచిస్తున్నారు. అయితే ఏది వాడినా.. ఏసీ ఫిల్టర్లను, కూలర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని హితవు పలుకుతున్నారు.

Also Read: BSNL బంపరాఫర్.. ఫ్రీ సిమ్, కాల్స్, రోజూ 2GB డేటా.. మే 31 వరకే ఛాన్స్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×