E-Paper
Advertisement

ఏసీ బిల్లు తగ్గించే అద్భుత చిట్కా.. మేడ పైకి ఎక్కి ఇదొక్కటి చేయండి చాలు!

ఏసీ బిల్లు తగ్గించే అద్భుత చిట్కా.. మేడ పైకి ఎక్కి ఇదొక్కటి చేయండి చాలు!
Advertisement

Cool Roof Paint: ప్రతి ఇంట్లోనూ సమ్మర్ వచ్చిదంటే.. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు 24/7 ఆన్‌లో ఉండాల్సిందే. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే ఎండల గురించి చెప్పనక్కర్లేదు. అంతలా సెగలు కక్కుతుంటాయి. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్లలో టాప్ ఫ్లోర్‌లో ఉండేవారికి, పెంకుటిళ్లు లేదా రేకుల ఇళ్లలో ఉండేవారికి అయితే ఇల్లు నిప్పుల కొలిమిలా మారిపోతుంది. పగలంతా ఆ కాంక్రీట్ స్లాబ్ ఎండను పీల్చుకుని, రాత్రిపూట ఆ వేడిని గదుల్లోకి వదులుతుంది. దీనివల్ల ఏసీ గంటల తరబడి వేసినా గది చల్లబడదు. పైగా నెలాఖరున వచ్చే కరెంటు బిల్లు చూస్తే గుండె ఆగినంత పనవుతుంది. అయితే ఇప్పుడీ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంది. అదే కూల్ రూఫ్ పెయింట్.

మిద్దె పైన ఈ పెయింట్ వేస్తే చాలు:

సాధారణంగా మన ఇంటి డాబాలు ఎండను పీల్చుకుని లోపలికి వేడిని పంపుతాయి. కానీ ఈ కూల్ రూఫ్ పెయింట్ అలా కాదు. మేడ పైకి ఎక్కి ఈ స్పెషల్ కోటింగ్ వేయిస్తే.. అది సూర్యరశ్మిని అద్దంలా వెనక్కి తిప్పి పంపిస్తుంది. దీంతో దాదాపు 80 శాతం ఎండను ఇది లోపలికి రానివ్వదు. దీనివల్ల మన ఇంటి స్లాబ్ అస్సలు వేడెక్కదు. ఫలితంగా గది ఉష్ణోగ్రత 3 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతుంది. తద్వారా ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉంటుంది.

కరెంటు బిల్లులో సగం ఆదా:

Advertisement

ఏసీ ఆన్ చేసినప్పుడు గది బాగా వేడిగా ఉంటే.. దాన్ని చల్లబరచడానికి ఏసీ కంప్రెసర్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీనివల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. ఒకవేళ మేడపైన ఈ కూల్ పెయింట్ వేయిస్తే.. గదిలో వేడి తక్కువగా ఉంటుంది కాబట్టి ఏసీ చాలా స్పీడ్‌గా గదిని కూల్ చేస్తుంది. కంప్రెసర్ మీద లోడ్ తగ్గుతుంది కాబట్టి.. నెలవారీ కరెంటు బిల్లులో సుమారు 20 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.

Also Read: 50 డిగ్రీల ఎండలోనైనా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోవచ్చు.. ఈ Silent Sleep Split ACలు ఉంటే!

ఏసీని 24లో ఉంచుతున్నారా?

Advertisement

చాలామంది ఏసీ ఆన్ చేయగానే 18 డిగ్రీల్లో పెడితే గది వెంటనే చల్లబడుతుందని అనుకుంటారు. కానీ అది పొరపాటే! ఏసీని ఎప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడమే ఆరోగ్యానికి మంచిది. అలాగే కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఏసీలో పెంచే ప్రతి ఒక్క డిగ్రీ టెంపరేచర్ వల్ల దాదాపు 6 శాతం కరెంటు ఆదా అవుతుంది. ఏసీతో పాటు ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో పెడితే.. ఆ చల్లటి గాలి గది అంతా త్వరగా పరుచుకుంటుంది.

ఎండ లోపలికి రాకుండా చూడాలి:

బయట నుంచి వచ్చే వేడి గాలి, కిటికీల గుండా వచ్చే ఎండ గదిని మరింత వేడెక్కిస్తాయి. అందుకే మధ్యాహ్నం పూట కిటికీలకు మందపాటి తెరలు వేయాలి. అలాగే గది తలుపుల సందుల నుంచి చల్లటి గాలి బయటకు పోకుండా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పాతకాలపు బల్బులకు బదులు LED బల్బులు వాడితే వేడి కూడా చాలా వరకు తగ్గుతుంది.

సర్వీసింగ్ చేయిస్తున్నారా?

ఏసీ ఫిల్టర్లలో దుమ్ము చేరితే ఏసీ గాలిని సరిగ్గా తీసుకోలేదు. దీనివల్ల ఎక్కువ కరెంటు ఖర్చవుతుంది. అందుకే కనీసం నెలకోసారి ఫిల్టర్లను తీసి శుభ్రం చేసుకోవాలి. ఏడాదికి ఒకసారి సర్వీసింగ్ చేయిస్తే ఏసీ లైఫ్ పెరుగుతుంది. ఈ కూల్ రూఫ్ పెయింట్ వల్ల కేవలం చల్లదనమే కాదు.. ఎండ దెబ్బకు పైకప్పు పగుళ్లు రాకుండా కూడా రక్షణ లభిస్తుంది. కాబట్టి.. సమ్మర్‌లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసి ఏసీ బిల్లుకు చెక్ పెట్టొచ్చు.

Also Read: షోరూమ్‌లో AC నచ్చిందని వెంటనే కొనేయొద్దు.. ముందు ఈ 5 విషయాలు చెక్ చేసుకున్నాకే ముందుకెళ్లండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×