E-Paper
Advertisement

నథింగ్ నుంచి మరో సంచలనం.. మెటల్ బాడీ, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న CMF Phone 3 Pro!

నథింగ్ నుంచి మరో సంచలనం.. మెటల్ బాడీ, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న CMF Phone 3 Pro!
Advertisement

CMF Phone 3 Pro: ప్రముఖ నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుండి త్వరలోనే మార్కెట్లోకి రానున్న సరికొత్త ‘CMF Phone 3 Pro’ గురించే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చర్చ నడుస్తోంది. గతేడాది ఏప్రిల్ నెలలో విడుదలైన పాత మోడల్ మంచి విజయం సాధించడంతో.. ఈసారి కూడా అదే టైమ్‌కి ఈ కొత్త వెర్షన్‌ను లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అయితే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఈ సమాచారం ప్రకారం చూస్తే.. ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఈసారి నథింగ్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈసారి ప్రాసెసర్ మారింది..

సాధారణంగా CMF ఫోన్లలో మీడియాటెక్ చిప్‌సెట్లనే చూస్తుంటాం. కానీ ఈసారి రూటు మార్చి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను వాడుతున్నట్లు సమాచారం. దీనివల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ అంటే ఇష్టపడే వారికి.. ఒకేసారి నాలుగైదు యాప్స్ వాడే వారికి ఈ అప్‌గ్రేడ్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

Advertisement

Also Read: యాపిల్‌కు చెక్ పెట్టేలా ఒప్పో కొత్త ప్లాన్.. వామ్మో, ఈ Mini Padలో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లా!

మెటల్ ఫ్రేమ్ డిజైన్..

డిజైన్ విషయంలో కూడా ఈసారి కంపెనీ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో మంచి క్వాలిటీ ఉన్న అమోలెడ్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. తద్వారా మనం చూసే వీడియోలు, ఫొటోలు చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈసారి మెటల్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్ రాబోతోంది. ప్లాస్టిక్ బాడీ కంటే మెటల్ బాడీ ఉండటం వల్ల ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ రావడమే కాకుండా.. ఫోన్ కూడా గట్టిగా ఉంటుంది.

బ్యాటరీకి ఢోకా లేదు..

Advertisement

స్మార్ట్‌ఫోన్ వాడే వారికి పెద్ద తలనొప్పి బ్యాటరీ. అందుకే ఈసారి ఏకంగా 5,500mAh వరకు కెపాసిటీ ఉండే పెద్ద బ్యాటరీని ఇస్తున్నారు. దీంతో రోజంతా ఫోన్ వాడినా ఛార్జింగ్ అయిపోతుందన్న భయం ఉండదు. దానికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో.. నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

న్యూ లుక్‌తో కెమెరాలు..

ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు మూడు కెమెరాల సెటప్‌ ఇచ్చారు. అయితే ఈసారి డిజైన్ పూర్తిగా కొత్తగా ఉంటుందని టాక్. ఫొటోలు ఇంకా క్లారిటీగా వచ్చేలా కొన్ని మార్పులు చేస్తున్నారట. ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా.. ఈ ఫోన్ మాత్రం బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో మొబైల్ మార్కెట్‌లోకి రాబోతోందని అర్థమవుతోంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంతలో ఉంటుందో వేచి చూడాల్సిందే.

Also Read: యూట్యూబ్ టిప్స్.. 500 సబ్‌స్క్రైబర్లు ఉన్నా ఇక డబ్బులొస్తాయ్, ఇలా చేస్తే చాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×