E-Paper
Advertisement

CMF Phone 2 Pro: తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్.. ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP కెమెరాతో CMF ఫోన్ 2 ప్రోను పొందండిలా!

CMF Phone 2 Pro: తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్.. ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP కెమెరాతో CMF ఫోన్ 2 ప్రోను పొందండిలా!
Advertisement

CMF Phone 2 Pro: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో నథింగ్‌ కంపెనీ తన ప్రత్యేక డిజైన్‌, ఫీచర్లతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రూ.20 వేల ధర సెగ్మెంట్‌లో నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ను విడుదల చేసి, ఈ నెల ప్రారంభంలోనే సేల్‌ను కూడా ప్రారంభించింది. మరోవైపు.. ఈ ఏడాది మొదట్లో నథింగ్‌ సబ్‌బ్రాండ్‌ CMF నుంచి వచ్చిన CMF ఫోన్‌ 2 ప్రో కూడా యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫుల్‌ HD+ డిస్‌ప్లే, 50MP టెలిఫోటో కెమెరా, అలాగే ఏకంగా 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ హామీతో ఈ ఫోన్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. మరి ఈ CMF Phone 2 Proలో ఉన్న పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా.

 అదనపు డిస్కౌంట్స్:

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో లభిస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.18,999 కాగా.. 8GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.20,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు.. UPI ద్వారా చెల్లింపులు చేసిన వారికి కూడా అదనంగా రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై క్రేజీ ఆఫర్.. ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే డీల్!

నాలుగు కలర్‌ ఆప్షన్లు:

ఈ CMF ఫోన్‌ 2 ప్రో.. బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, ఆరెంజ్‌, వైట్‌ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే. ఈ ఫోన్‌లో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ స్క్రీన్‌ను ఇచ్చారు. గరిష్ఠంగా 3000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 480Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో ఇది అవుట్‌డోర్‌ వినియోగానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారంగా రూపొందించిన Nothing OS 3.2పై ఇది పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ పరంగా వినియోగదారులకు దీర్ఘకాలిక భరోసా ఇస్తూ, మూడు ప్రధాన ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌తో పాటు 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

ట్రూలెన్స్‌ టెక్నాలజీతో ట్రిపుల్‌ కెమెరా:

ఇకపోతే కెమెరా విభాగంలో CMF ఫోన్‌ 2 ప్రో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పవచ్చు. Truelens ఇంజిన్‌ 3.0 టెక్నాలజీతో వెనుక భాగంలో మూడు కెమెరాలను అందించారు. దీనిలో EIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫొటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 16MP కెమెరాను ఏర్పాటు చేశారు.

ఫాస్ట్‌ & రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌:

ఈ ఫోన్‌ 5000mAh సామర్థ్యమైన బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాదు, అవసరమైనప్పుడు ఇతర డివైసులను ఛార్జ్‌ చేసుకునేలా 5W రివర్స్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ కూడా అందించారు. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్‌ 5.3, USB Type-C పోర్ట్‌ ఉన్నాయి. అదనంగా, IP54 రేటింగ్‌తో ఇది డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కూడా కలిగి ఉంది.

Also Read: 5G స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.13,999కే రియల్‌మీ నార్జో 90x 5G మీ సొంతం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×