E-Paper
Advertisement

Washing Machine Tips: ఈ దుస్తులను పొరపాటున కూడా వాషింగ్ మెషీన్‌లో వేయకండి, ఎందుకంటే?

Washing Machine Tips: ఈ దుస్తులను పొరపాటున కూడా వాషింగ్ మెషీన్‌లో వేయకండి, ఎందుకంటే?
Advertisement

Washing Machine Tips: మనందరి వార్డ్‌రోబ్‌లో కచ్చితంగా మనకు నచ్చిన ఫేవరెట్ డ్రెస్సులు కొన్ని ఉంటాయి. మనసుకు నచ్చిన దుస్తులు వేసుకుంటే వచ్చే ఆ కాన్ఫిడెన్సే వేరు. అయితే, ఈ రోజుల్లో బిజీ లైఫ్ వల్ల టైమ్ లేక, మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. వాషింగ్ మెషీన్ కదా అని అన్ని రకాల బట్టలను అందులో కుక్కేయడం. ఒక్కసారి ఆలోచించండి.. ఆ వేగంగా తిరిగే చక్రాలు, వేడి నీళ్లు, ఘాటైన సర్ఫ్ పొడులు మన సున్నితమైన పట్టు చీరలను లేదా ఖరీదైన సూట్లను ఏం చేస్తాయో? పాపం, అవి తమ రంగును, మెరుపును, ఆఖరికి వాటి షేప్‌ను కూడా కోల్పోతాయి.

కష్టపడి కొనుక్కున్న బట్టలు అలా పాడైపోతుంటే చూస్తూ తట్టుకోవడం ఎవరికైనా కష్టమే మరి. అందుకే.. వాషింగ్ మెషీన్ మన పనిని సులభం చేసినా, కొన్ని బట్టల విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. మరి మన వార్డ్‌రోబ్‌లోని ఏయే దుస్తులను మెషీన్‌లో వేయకూడదో, వాటిని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..

పట్టుచీరలు, జరీ వర్క్ డ్రెస్సులు:

Advertisement

పండగలు లేదా ఫంక్షన్లప్పుడు మనం ఎంతో ఇష్టంగా కట్టుకునే పట్టుచీరలు, జరీ వర్క్ ఉన్న డ్రెస్సులను మెషీన్‌లో అస్సలు వేయకండి. మెషీన్ తిరిగే వేగానికి ఆ జరీ పోగులు బయటకు వచ్చేసి, బట్ట పీచు పీచుగా అయిపోయే ప్రమాదం ఉంది. వీటిని వీలైనంత వరకు డ్రై క్లీనింగ్‌కు ఇవ్వడమే బెటర్.

Also Read: థైరాయిడ్ రిపోర్ట్ నార్మల్‌గా ఉన్నా నీరసం తగ్గడం లేదా? అసలు గుట్టు ఇదే!

ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ దుస్తులు:

Advertisement

కుందన్లు, పూసలు లేదా అద్దాలతో డిజైన్ చేసిన డ్రెస్సులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ, మెషీన్‌లో వేస్తే మాత్రం ఆ డిజైన్ చిందరవందర అయిపోతుంది. ఒక్కోసారి ఆ పూసలు ఊడిపోయి మెషీన్ లోపల ఇరుక్కుపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వాటిని చేత్తో చాలా సున్నితంగా ఉతకాలి.

ఉన్ని స్వెటర్లు:

చలికాలంలో మనం వేసుకునే ఉన్ని బట్టలు మెషీన్ వేడికి లేదా వేగానికి సాగిపోయి వాటి షేప్‌ను కోల్పోతాయి. ఒక్కోసారి స్వెటర్లు కుంచించుకుపోయి చిన్నవిగా అయిపోవచ్చు. అందుకే వీటిని ప్రత్యేకమైన లిక్విడ్ డిటర్జెంట్లతో చేత్తో ఉతికితేనే ఎక్కువ కాలం మన్నుతాయి.

లెదర్ జాకెట్లు:

లెదర్ జాకెట్లు, సింథటిక్ మెటీరియల్స్ మెషీన్ నీళ్లలో నానితే వాటిపై ఉన్న పొర పొట్టులా ఊడిపోతుంది. అలాగే ఇవి వాటి సహజమైన మెరుపును కోల్పోయి పాతవాటిలా కనిపిస్తాయి. వీటిని కేవలం తడి గుడ్డతో తుడవడమో లేదా నీటితో సున్నితంగా వాష్ చేయడమో చేయాలి.

 ఎలాస్టిక్ ఇన్నర్‌వేర్‌లు:

చాలామంది చేసే సాధారణ పొరపాటు ఏమిటంటే.. ఇన్నర్ వేర్లను వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటారు. దీంతో వాటిలోని ఎలాస్టిక్ త్వరగా లూజ్ అయిపోతుంది. తద్వారా అవి వాటి షేప్‌ను కోల్పోయి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వీటిని చేత్తో ఉతికితేనే హైజీనిక్‌గా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు వస్తాయి.

Also Read: మార్కెట్లోకి అదిరిపోయే పోర్టబుల్ ఏసీలు.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలో పెట్టుకోవచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×