E-Paper
Advertisement

ఒక్కసారి కొంటే పదేళ్లు తిరుగుండదు.. లాంగ్ టర్మ్ వాడకానికి బెస్ట్ మిర్రర్‌లెస్ కెమెరాలు ఇవే!

ఒక్కసారి కొంటే పదేళ్లు తిరుగుండదు.. లాంగ్ టర్మ్ వాడకానికి బెస్ట్ మిర్రర్‌లెస్ కెమెరాలు ఇవే!
Advertisement

Sony vs Canon vs Fujifilm 2026: కెమెరా కొనడం అంటే ఏదో ఫోన్ కొన్నంత సింపుల్ కాదు. ఎందుకంటే మనం పెట్టేది వేలల్లో కాదు. లక్షల్లో! అందుకే మార్కెట్లోకి కొత్త కెమెరా రాగానే దాని వెనక పడకుండా, లాంగ్ టర్మ్ లో మనకు తోడుండే కెమెరాను ఎంచుకోవడం ముఖ్యం. కేవలం కాగితం మీద కనిపించే స్పెసిఫికేషన్లు చూసి మురిసిపోతే.. రెండేళ్లకే అది పాతబడిపోతుంది. మనకు కావాల్సింది గట్టి బిల్డ్ క్వాలిటీ, మంచి లెన్స్ సపోర్ట్, ఎప్పటికీ బోర్ కొట్టని అద్భుతమైన కలర్ సైన్స్. మరి ఈ ఫీచర్లు ఉన్న ఆ “పర్ఫెక్ట్” కెమెరా ఏది? ఆ వివరాలు మీకోసం.

స్పెసిఫికేషన్లు పక్కన పెడితే.. ఏ కెమెరా మీకు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్?

Advertisement

కెమెరా అంటే కేవలం బాడీ మాత్రమే కాదు. అది ఒక ఎకోసిస్టమ్. లాంగ్ టర్మ్ వాడకానికి మీరు కెమెరాను కొనేటప్పుడు ఈ కింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.

1. సోనీ ఆల్ఫా సిరీస్ :
మీరు ఒకవేళ టెక్నాలజీ అప్-టు-డేట్ గా ఉండాలి అనుకుంటే.. Sony A7 IV లేదా Sony A7R V బెస్ట్ ఛాయిస్.

Advertisement

ఎందుకు?: సోనీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ‘లెన్స్ సపోర్ట్’. సోనీతో పాటు థర్డ్ పార్టీ బ్రాండ్స్ కూడా తక్కువ ధరకే అద్భుతమైన లెన్స్ అందిస్తాయి. దీని వల్ల భవిష్యత్తులో మీరు కొత్త లెన్స్ కొనాలనుకున్నా డబ్బు వృథా అవకుండా ఉంటుంది.

లైఫ్: వీటి ఆటో ఫోకస్ సిస్టమ్ చాలా అడ్వాన్స్‌డ్ గా ఉంటుంది. కాబట్టి ఐదేళ్ల తర్వాత కూడా ఇది పాత కెమెరా అనిపించదు.

2. ఫుజిఫిల్మ్ ఎక్స్-సిరీస్ :
స్పెసిఫికేషన్ల కంటే ఫోటోలోని ‘ఫీల్’ ముఖ్యం అనుకునే వారికి Fujifilm X-T5 లేదా X-H2 అద్భుతంగా ఉంటాయి.

కలర్ సైన్స్: ఫుజిఫిల్మ్ లోని ‘ఫిల్మ్ సిమ్యులేషన్స్’ వల్ల ఫోటో తీసిన వెంటనే ఎడిటింగ్ అవసరం లేకుండానే ఇన్స్టాగ్రామ్ లో పెట్టేయొచ్చు.

బిల్డ్ క్వాలిటీ: ఇవి ప్యూర్ మెటల్ బాడీతో, పాతకాలపు కెమెరాల లుక్‌తో వస్తాయి. ఇవి చూడటానికి ఎప్పటికీ క్లాసీగానే ఉంటాయి.

3. క్యానన్ ఆర్ సిరీస్:
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు నమ్మకమైన బ్రాండ్ క్యానన్. Canon EOS R6 Mark II ప్రస్తుతం మార్కెట్లో ఒక సంచలనం.

కలర్ సైన్స్: మనుషుల స్కిన్ టోన్స్ క్యానన్ కెమెరాల్లో వచ్చినంత సహజంగా వేరే వాటిలో రావు.

ఎర్గోనామిక్స్: కెమెరాను చేతిలో పట్టుకున్నప్పుడు వచ్చే గ్రిప్, బటన్లతో చాలా సౌకర్యంగా ఉంటుంది. రోజంతా షూట్ చేసినా మీకు అలసట అనిపించదు.

4. నికాన్ జెడ్ సిరీస్ :
నికాన్ కెమెరాలు వాటి మన్నికకు పెట్టింది పేరు. Nikon Z6 III లేదా Z8 లాంటి కెమెరాలు వర్షంలో, ఎండలో కూడా మొండిగా పనిచేస్తాయి. వీటి ‘జెడ్ మౌంట్’ ఫ్యూచర్ కోసం డిజైన్ చేయబడింది. ఇది అద్భుతమైన కాంతిని సెన్సార్‌కి అందిస్తుంది.

లాంగ్ టర్మ్ కోసం కెమెరా కొనేటప్పుడు ఈ 3 సూత్రాలు గుర్తుంచుకోండి:
లెన్స్ ఎకోసిస్టమ్ : కెమెరా బాడీ కంటే లెన్స్ ధరలే ఎక్కువ ఉంటాయి. మీరు ఎంచుకునే బ్రాండ్‌లో తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు లెన్స్ ఆప్షన్లు ఉన్నాయో లేదో చూసుకోండి.

వెదర్ సీలింగ్ : మీరు ట్రావెల్స్ కి వెళ్లేవారైతే, దుమ్ము, ధూళి, చిన్నపాటి చినుకుల నుంచి కెమెరాను కాపాడే వెదర్ సీలింగ్ ఉన్న బాడీని మాత్రమే ఎంచుకోండి.

రీసేల్ వాల్యూ : భవిష్యత్తులో మీరు కెమెరాను అప్ గ్రేడ్ చేయాలనుకుంటే.. సోనీ , క్యానన్ కెమెరాలకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది.

మీరు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే నికాన్, కమర్షియల్ , వెడ్డింగ్స్ కి క్యానన్, వీడియో , ట్రావెల్ కి సోనీ, అదే ఒక ఆర్టిస్టిక్ ఫీల్ కావాలంటే.. ఫుజిఫిల్మ్ ఎంచుకోండి. కెమెరా ఏదైనా, అది మీ క్రియేటివిటీకి అడ్డు రాకూడదు. మీ బడ్జెట్ , అవసరాలను బట్టి ఒకసారి షోరూమ్ కి వెళ్లి ఆ కెమెరాను చేతిలో పట్టుకుని చూసి మాత్రమే నిర్ణయం తీసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×