// // ఏసీ నెత్తిన ఉంటే మంచిదా? గోడకు ఉంటే బెటరా? ఇంటికి ఏది బెస్ట్! -->
E-Paper
Advertisement

Central vs Split AC: ఏసీ నెత్తిన ఉంటే మంచిదా? గోడకు ఉంటే బెటరా? ఇంటికి ఏది బెస్ట్!

Central vs Split AC: ఏసీ నెత్తిన ఉంటే మంచిదా? గోడకు ఉంటే బెటరా? ఇంటికి ఏది బెస్ట్!
Advertisement

Central vs Split AC: ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల ఏసీలు ప్రధానంగా అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ ఏసీ, స్ప్లిట్ ఏసీల్లో ఏది కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కూలింగ్ పరంగా, విద్యుత్ ఆదా పరంగా ఏది బెస్ట్ అని తెగ సెర్చ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త ఏసీ కొనాలని భావిస్తున్నవారి కోసం ఈ ప్రత్యేక కథనం అందించడం జరుగుతోంది. సెంట్రల్, స్ప్లిట్ ఏసీలకు మధ్య తేడాలను ఈ కథనంలో ఇప్పుడు చూద్దాం.

బడ్జెట్ పరంగా..

బడ్జెట్ పరంగా చూస్తే.. స్ప్లిట్ ఏసీలు చాలా చౌకైనవని చెప్పవచ్చు. ఒక గదిలో కూలింగ్ కోసం స్ప్లిట్ ఏసీ అద్భుతంగా పనిచేస్తుంది. అదే సెంట్రల్ ఏసీ విషయానికి వస్తే.. దీని ధర చాలా ఎక్కువ. ఇల్లు కట్టేటప్పుడే దీనికి ప్రత్యేకంగా డక్టింగ్ (పైపుల నెట్‌వర్క్) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని ఇన్‌స్టలేషన్ ఖర్చు కూడా భారీగానే ఉంటుంది.

కూలింగ్ కవరేజ్

Advertisement

ఇంట్లోని ఒకే ఒక్క గది లేదా చిన్న హాల్ కు మాత్రమే కూలింగ్ వస్తే సరిపోతుందని భావిస్తే.. స్ప్లిట్ ఏసీ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇవి ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని చాలా వేగంగా చల్లబరుస్తాయి. అయితే ఇల్లు మొత్తం లేదా పెద్ద పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్‌లు అంతటా ఒకే విధమైన చల్లదనం కావాలనుకుంటే మాత్రం సెంట్రల్ ఏసీయే బెస్ట్. ఇది ఒకే సమయంలో భవనం మొత్తాన్ని సమానంగా కూల్ చేస్తుంది.

విద్యుత్ వినియోగం

స్ప్లిట్ ఏసీలలో ప్రధానంగా లభించే ‘ఇన్వర్టర్ ఏసీలు’ తక్కువ కరెంట్ ను వాడుకుంటాయి. పైగా అవసరమైన గదిలోనే ఆన్ చేసుకునే వీలుండటం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. మరోవైపు సెంట్రల్ ఏసీలు ఇల్లు మొత్తాన్ని కూల్ చేయడం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే రూమ్‌లన్నింటికీ విడివిడిగా ఎక్కువ స్ప్లిట్ ఏసీలు పెట్టడం కంటే ఒకే సెంట్రల్ ఏసీ వాడటం బడ్జెట్ పరంగా, కరెంటు బిల్లు పరంగా బెస్ట్ అని నిపుణులు అంటున్నారు.

Advertisement

Also Read: ACల కంటే పవర్‌ఫుల్ గ్యాడ్జెటా? కరెంట్ ఆదా చేస్తూ ప్రకృతిని కాపాడే ఈ Heat Pumps కథేంటి?

లుక్, మెయింటెనెన్స్

స్ప్లిట్ ఏసీల నిర్వహణ విషయానికి వస్తే.. వీటి రిపేరు, సర్వీసింగ్ చాలా సులభం. అదే సెంట్రల్ ఏసీలు అయితే నిపుణులైన టెక్నీషియన్లు తప్పనిసరి. పైపుల క్లీనింగ్ కష్టంతో కూడుకొని ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక లుక్, డిజైన్ పరంగా చూస్తే.. స్ప్లిట్ ఏసీల తరహాలో సెంట్రల్ ఏసీలు.. గోడపై కనిపించవు. వీటిని సీలింగ్ భాగంలో ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఇల్లు అందంగా కనిపించే ఛాన్స్ ఉంటుంది.

Also Read: ట్రోలర్లపై జగపతి బాబు సీరియస్.. రామ్‌చరణ్‌ గురించి చెబుతూ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×