E-Paper
Advertisement

Jio Smart TV Series: 400కు పైగా ఉచిత టీవీ ఛానల్స్‌.. జియో ఎకోసిస్టమ్‌తో ఇంటిగ్రేటెడ్ QLED స్మార్ట్ టీవీలు లాంచ్!

Jio Smart TV Series: 400కు పైగా ఉచిత టీవీ ఛానల్స్‌.. జియో ఎకోసిస్టమ్‌తో ఇంటిగ్రేటెడ్ QLED స్మార్ట్ టీవీలు లాంచ్!
Advertisement

Jio Smart TV Series: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భారత మార్కెట్లోకి సెల్లీకార్ గాడ్జెట్స్ లిమిటెడ్ తన సరికొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ టీవీలు జియోటెల్ OS‌తో.. జియో ఎకోసిస్టమ్‌తో అనుసంధానం కలిగి ఉంటాయి. అల్ట్రా స్లిమ్ అండ్ ఎడ్జ్‌లెస్ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌ను అందించే ఈ టీవీలు పిక్చర్ క్వాలిటీ కోసం క్వాంటమ్ లూసెంట్ డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగిస్తాయి. దీంతో స్క్రీన్‌పై బ్రైట్‌నెస్ పెరిగి, కలర్ డెప్త్ మరింత రిచ్‌గా, కాంట్రాస్ట్ హైగా కనిపిస్తుంది. ఈ కొత్త సిరీస్ మొత్తం 55 అంగుళాలు, 43 అంగుళాలు, 32 అంగుళాలు ఇలా.. మూడు స్క్రీన్ సైజుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీల గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: అబ్బా ఏముంది హువావే మేట్‌ప్యాడ్ ఎడ్జ్.. 14.2 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాలతో లాంచ్!

థియేటర్ అనుభూతి:

Advertisement

ఈ సెల్లీకార్ జియో QLED స్మార్ట్ టీవీలు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, జియోహాట్‌స్టార్, జియోసావన్, జియో గేమ్స్, హలో జియో వంటి ప్రముఖ యాప్స్‌ను సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇందులో ఇతర ఓటీటీ యాప్‌లను సైతం జియో‌స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టీవీలు 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీతో వస్తాయి. అలాగే కనెక్టివిటీ ఎంపికలలో మల్టిపుల్ HDMI, USB పోర్ట్స్ లభిస్తాయి. మనం ఎంచుకున్న కొన్ని మోడల్స్‌లో వాయిస్ ఎనేబుల్‌డ్ బ్లూటూత్ స్మార్ట్ రిమోట్ కూడా అందిస్తున్నారు. ప్రతి మోడల్‌లోనూ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల స్పష్టమైన, థియేటర్‌లో ఉండే సౌండ్ అనుభూతిని పొందవచ్చు.

ఏఐ ఆధారిత కంటెంట్:

ఈ సరికొత్త సెల్లీకార్ జియో QLED స్మార్ట్ టీవీలను జియోటెలి OS మరింత స్మార్ట్‌గా, సులభంగా ఉపయోగించేలా రూపొందించబడింది. దీనిలో ఉన్న ఏఐ ఆధారిత కంటెంట్ సూచనలు యూజర్ల ఆసక్తులకు అనుగుణంగా.. షోలు, సినిమాలను సిఫారసు చేస్తాయి. అంతేకాదు.. దీనిలో 400 కంటే ఎక్కువ ఉచిత టీవీ ఛానల్స్‌ యాక్సెస్‌ను అందించడం ద్వారా వినోదాన్ని మరింత ఎక్కువగా చేస్తుంది. అలాగే దీనిలో 4K ప్లేబ్యాక్ సపోర్ట్ ఉండటంతో అధిక నాణ్యత గల కంటెంట్‌ను అందిస్తుంది. కొత్త సెల్లీకార్ జియో QLED స్మార్ట్ టీవీ సిరీస్ ఈ నెలలోనే మార్కెట్లోకి రానుంది. యూజర్లు ఈ స్మార్ట్ టీవీలను ప్రధాన రిటైల్ స్టోర్లలో, ప్రముఖ ఇ-కామర్స్ వైబ్‌సైట్లలో, సెల్లీకార్ ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా కొనేసుకోవచ్చని తెలిపింది కంపెనీ.

Advertisement

Read Also: స్టైలిష్‌గా ఉందని స్మార్ట్‌వాచ్ వాడుతున్నారా.. మరి సైడ్ ఎఫెక్ట్స్ సంగతేంటి?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×