E-Paper
Advertisement

సీలింగ్ vs పెడెస్టల్ ఫ్యాన్.. కూలింగ్ ‘కింగ్’ ఎవరు? అసలు నిజం ఇదీ!

సీలింగ్ vs పెడెస్టల్ ఫ్యాన్.. కూలింగ్ ‘కింగ్’ ఎవరు? అసలు నిజం ఇదీ!
Advertisement

Ceiling Fan vs Pedestal Fan: సీలింగ్ ఫ్యాన్, స్టాండ్ లేదా పెడెస్టల్ ఫ్యాన్.. ఈ రెండింటిలో ఏది రూమ్‌ను బాగా చల్లబరుస్తుంది? ఏది కొంటే బెస్ట్? అనే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతుంటాయి. అయితే ఈ రెండింటి పనితీరు, గాలిని అందించే విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి దేని ప్రత్యేకత ఏంటీ? రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సీలింగ్ vs పెడెస్టల్ ఫ్యాన్

ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ముందుగా గుర్తొచ్చే సాధనం ఫ్యాన్. అయితే మార్కెట్లో రకరకాల ఫ్యాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ మంది సీలింగ్ ఫ్యాన్ లేదా పెడెస్టల్ (స్టాండ్) ఫ్యాన్‌లను ఎంచుకుంటారు. కానీ గదిని చల్లబరచడంలో ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

అందులో సీలింగ్ ఫ్యాన్ టాప్

Advertisement

సీలింగ్ ఫ్యాన్ గది పైకప్పుకు అమర్చబడి ఉంటుంది కాబట్టి కింది పైపునకు ఎంతో తెలిగ్గా గాలిని ప్రసారం చేస్తుంది. దీనివల్ల గదిలోని మూలమూలకూ గాలి సమానంగా విస్తరిస్తుంది. ఒకే చోట ఎక్కువ మంది కూర్చున్నప్పుడు అందరికీ గాలి తగలాలంటే సీలింగ్ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్.

స్టాండ్ ఫ్యాన్ సంగతేంటి?

మరోవైపు పెడెస్టల్ ఫ్యాన్ ఒకే దిశలో గాలిని విసురుతుంది. ఇది గాలిని ఒకే చోట కేంద్రీకరించి శరీరంపైకి నేరుగా పంపుతుంది. దీనివల్ల చాలా వేగంగా అప్పటికప్పుడు చల్లదనం లభిస్తుంది. ఒకరు లేదా ఇద్దరు ఉన్నప్పుడు వేగంగా గాలి కావాలనుకుంటే స్ట్రాంగ్ గాలి పెడెస్టల్ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది.

ఏది బాగా చల్లబరుస్తుంది?

Advertisement

నిజానికి ఫ్యాన్లు గది ఉష్ణోగ్రతను ఏమాత్రం ప్రభావితం చేయవని నిపుణులు అంటున్నారు. అవి కేవలం చర్మంపై ఉండే చెమటను త్వరగా ఆవిరయ్యేలా చేసి, మనకు చల్లని అనుభూతిని ఇస్తాయని పేర్కొంటున్నారు. పెడెస్టల్ ఫ్యాన్ వేగంగా గాలిని విసురుతుంది కాబట్టి సీలింగ్ ఫ్యాన్‌తో పోలిస్తే ఇది ఎక్కువ చల్లదనపు అనుభూతిని ఇస్తుందని తెలియజేస్తున్నారు. మరోవైపు సీలింగ్ ఫ్యాన్.. గదిలోని వేడి గాలిని పైకి లాగి.. గది అంతటా చల్లగాలి విస్తరించేలా చేస్తుంది.

Also Read: రిమోట్ అక్కర్లేదు.. మీ మాటే శాసనం.. పెంపుడు కుక్కలాంటి స్మార్ట్ ఏసీలు!

ఏది కొంటే బెటర్?

గది పెద్దదై ఉండి ఎక్కువ మందికి గాలి అందాలి అనుకుంటే సీలింగ్ ఫ్యాన్ బెస్ట్. అలా కాకుండా అద్దె ఇంట్లో ఉంటున్నా, ఫ్యాన్‌ను హాల్ నుంచి బెడ్‌రూమ్‌కు మార్చుకోవాలన్నా, స్టడీ టేబుల్, బెడ్ దగ్గర వేగవంతమైన గాలి కోరుకుంటే పెడెస్టల్ ఫ్యాన్ బెస్ట్ అని నిపుణులు వివరిస్తున్నారు. మెుత్తంగా మీ అవసరానికి తగ్గట్లు ఉన్న ఫ్యాన్ ను మీరే ఎంచుకోండి.

Also Read: అరాచకం సామీ.. థర్మాకోల్ గోడలతో ఇల్లు.. ఇక లైఫ్ లాంగ్ కూలింగ్ ఫ్రీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×