// // కంటికి కనిపించని ఏసీ.. కూలింగ్ మాత్రం అదిరిపోద్ది.. అద్భుతం! -->
E-Paper
Advertisement

కంటికి కనిపించని ఏసీ.. కూలింగ్ మాత్రం అదిరిపోద్ది.. నిజంగా అద్భుతం భయ్యా!

కంటికి కనిపించని ఏసీ.. కూలింగ్ మాత్రం అదిరిపోద్ది.. నిజంగా అద్భుతం భయ్యా!
Advertisement

Cassette AC: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. విండో, స్ప్లిట్, పోర్టబుల్ వేరింయట్లలో ఇవి ప్రధానంగా లభిస్తుంటాయి. అయితే ఇది కాకుండా మరో రకం ఏసీ కూడా కూలింగ్ కోసం వినియోగిస్తుంటారు. దానినే క్యాసెట్ ఏసీ (Cassette AC) అంటారు. అయితే వీటిని ఆధునిక ఇంటీరియర్ డిజైన్ కు సరిపోయేలా రూపొందించారు. ఇవి ప్రత్యేకమైన కూలింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. సాధారణంగా హోటల్స్, ఆఫీసులు, ఫంక్షన్ హాల్స్ లో వీటిని వినియోగిస్తుంటారు. కంటికి కనిపించకుండా పనిచేయడం వీటి ప్రత్యేకతగా చెప్పవచ్చు.

క్యాసెట్ ఏసీ అంటే ఏంటి?

క్యాసెట్ ఏసీ అనేది.. స్ప్లిట్ ఏసీ వర్గానికి చెందినదే. కానీ దీని ఇండోర్ యూనిట్ గోడకు కాకుండా సీలింగ్‌లో (పైకప్పులో) అమర్చబడి ఉంటుంది. దీని ప్రధాన భాగం పైకప్పు లోపల దాగి ఉండటం వల్ల.. కేవలం గాలిని విడుదల చేసే ప్యానెల్ మాత్రమే బయటకు కనిపిస్తుంది. కాబట్టి టెక్ నిపుణులు వీటిని అదృశ్య ఏసీలు అని కూడా అంటూ ఉంటారు.

కూలింగ్ ఎలా ఇస్తుంది?

Advertisement

సాధారణ స్ప్లిట్ ఏసీ కేవలం ఒక దిశలో గాలిని పంపిస్తే.. క్యాసెట్ ఏసీ నాలుగు దిశల నుండి చల్లటి గాలిని ప్రసారం చేస్తుంది. ఒకవేళ రౌండ్ ప్యానెల్ వేరియంట్ అయితే 360 డిగ్రీల్లో గాలిని పంపిస్తుంది. దీనివల్ల గదిలోని అన్ని మూలలకూ సమానంగా కూలింగ్ అందుతుంది. క్యాసెట్ ఏసీ.. సీలింగ్‌లో ఉండటం వల్ల గోడలపై స్థలం ఆదా అవుతుంది. కిటికీలు, అలంకరణ వస్తువులకు అడ్డు లేకుండా గది నీట్‌గా కనిపిస్తుంది.

పవర్ ఫుల్ కూలింగ్..

క్యాసెట్ ఏసీ పవర్ ఫుల్ కూలింగ్ టెక్నాలజీతో రావడం వల్ల.. సీలింగ్ ఎత్తులో ఉన్నప్పటికి కూడా దీనిలో శక్తివంతమైన ఫ్యాన్ల కారణంగా గాలి.. నేల వరకూ వేగంగా చేరుతుంది. ప్రస్తుత క్యాసెట్ ఏసీ మోడల్స్ అన్నీ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇది గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ వేగాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఇక దీనిలోని అత్యాధునిక ఫిల్టర్లు.. గాలిలోని ధూళి కణాలను, బ్యాక్టీరియాను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.

Advertisement

Also Read: Power Saving Tips: విద్యుత్ బిల్లును అమాంతం పెంచేసే.. ఈ 15 అలవాట్ల గురించి తెలుసా?

ఫాల్స్ సీలింగ్ తప్పనిసరి..

క్యాసెట్ ఏసీని ఇన్ స్టాల్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం ‘ఫాల్స్ సీలింగ్’ (False Ceiling) తప్పనిసరి అని పేర్కొంటున్నారు. సీలింగ్, అసలు పైకప్పు మధ్య తగినంత ఖాళీ ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు అంటున్నారు. దీని ఫిల్టర్లను శుభ్రం చేయడం సులభమని తెలియజేస్తున్నారు.

Also Read: Vijay Alliance Buzz: విజయ్‌ను వెంటాడుతోన్న 11.. సింహం సీఎం కావాలంటే, పొత్తే దిక్కు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×