E-Paper
Advertisement

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?
Advertisement

Casio Smart Ring Watch: చేతి వేలికి ఉంగరంలా తొడుక్కునేలా, అదే సమయంలో టైమ్ చూపిస్తూ ఆరోగ్య సమాచారాన్ని అందించేలా క్యాసియో ఒక కొత్త వినూత్న పరికరాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా స్మార్ట్ వాచ్‌లను మణికట్టుకి కట్టుకుంటాం. కానీ ఈ ‘Casio CRW H001M 8’ మోడల్ మాత్రం రింగ్ రూపంలో ఉంటూనే.. ఒక చిన్న డిజిటల్ వాచ్‌లా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఈ సరికొత్త డివైజ్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేశారు.

చిన్న డిస్‌ప్లేతో డిజిటల్ లుక్:

ఈ స్మార్ట్ రింగ్‌పై ఒక చిన్న ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది సాధారణ క్యాసియో డిజిటల్ వాచ్‌లను గుర్తుచేస్తుంది. ఇందులో సమయంతో పాటు స్టాప్‌వాచ్, అలారం, ఆటోమేటిక్ క్యాలెండర్, నైట్ టైమ్‌లో కనిపించడానికి ఎల్ఈడీ లైట్ వంటి ప్రాథమిక ఫీచర్లన్నీ ఉన్నాయి. చిన్నదిగా, తేలికగా ఉండటం వల్ల వేలికి వేసుకున్నా ఎలాంటి ఇబ్బంది అనిపించదు.

Advertisement

Also Read: ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

ఆరోగ్యంపై నిరంతర నిఘా:

ఈ రింగ్‌లో ఆరోగ్యానికి సంబంధించిన కీలక సెన్సార్లు ఉన్నాయి. ఇది రోజంతా గుండె వేగాన్ని, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని, శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళల్లో నిద్ర నాణ్యతను కూడా అంచనా వేస్తుంది. ఇక ఫిట్‌నెస్ విషయానికి వస్తే.. మనం రోజూ నడిచే అడుగులు, ఖర్చయ్యే కాలరీలు, రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలను ట్రాక్ చేస్తుంది. ఈ వివరాలన్నీ మొబైల్‌లోని AIZO రింగ్ యాప్ ద్వారా చూసుకోవచ్చు.

రింగ్‌లోనే నోటిఫికేషన్లు:

Advertisement

ఫోన్‌కి కాల్స్, మెసేజ్‌లు లేదా అలారమ్‌లు వచ్చినప్పుడు ఈ రింగ్ స్వల్పంగా వైబ్రేట్ అవుతుంది. దీంతో ప్రతి చిన్న విషయానికి ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. సిల్వర్ కలర్‌లో లభించే ఈ రింగ్ మూడు విభిన్న సైజుల్లో అందుబాటులో ఉంది. బరువు కేవలం 19 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం.

ధర ఎంతంటే?

చైనాలో దీని ధర సుమారు రూ.28,000 వరకు ఉంటుంది. సాధారణ వాడకంలో దీని బ్యాటరీ 4 నుంచి 6 రోజుల వరకు వస్తుంది. స్టాండ్‌బై మోడ్‌లో ఉంచితే ఏకంగా 25 రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. త్వరలోనే ఈ స్మార్ట్ రింగ్ వాచ్ భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×