E-Paper
Advertisement

క్యాసియో నుంచి మరో క్రేజీ వాచ్ లాంచ్.. తక్కువ బడ్జెట్‌లో పదేళ్ల బ్యాటరీ బ్యాకప్‌‌ పక్కా!

క్యాసియో నుంచి మరో క్రేజీ వాచ్ లాంచ్.. తక్కువ బడ్జెట్‌లో పదేళ్ల బ్యాటరీ బ్యాకప్‌‌ పక్కా!
Advertisement

Casio AE-1600HX: ప్రముఖ వాచ్ కంపెనీ క్యాసియో పేరు చెప్పగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ వాచీల మన్నిక. ఇప్పుడు తాజాగా క్యాసియో తక్కువ బడ్జెట్‌లో ‘AE-1600HX’ సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా ఎవరైతే తక్కువ రేటులో మంచి రగ్గడ్ లుక్ ఉండే వాచ్ కావాలనుకుంటారో.. వాళ్లకైతే ఈ కొత్త సిరీస్ బాగా నచ్చుతుంది. దీనిలో AE-1600HX-1BV, AE-1600HX-3AV అనే రెండు రకాల మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది.

స్టైలిష్ లుక్..

ఈ వాచీలు చూడటానికి చాలా ధృడంగా, పెద్ద సైజులో ఉండి స్పోర్ట్స్ లుక్‌ను ఇస్తాయి. అలాగే ఈ వాచ్ 1BV మోడల్ విషయానికొస్తే.. ఇది బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌తో నీలం రంగు టచ్ ఇచ్చారు. దీంతో ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇక 3AV మోడల్ ఆలివ్ గ్రీన్ రంగులో ఉండి దానికి పసుపు రంగు హైలైట్స్ ఇచ్చారు. ఇది ఆర్మీ లుక్‌లో మెరిసిపోతుంది. ఇక రాత్రిపూట టైమ్ చూసుకోవడం కోసం డిస్‌ప్లే వెనకాల మంచి వెలుతురు ఇచ్చే ఎల్‌ఈడీ లైట్ కూడా ఉంది. ఇది చీకట్లో టైమ్ చూసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది.

Advertisement

Also Read: మీ ఫోన్‌లో ఈ 5 యాప్స్ ఉంటే.. ఇక గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు!

ఫీచర్లు కూడా ఎక్కువే..

బడ్జెట్ ధరలో ఉన్నా సరే.. దీనిలో మనకు కావాల్సిన ఫీచర్లు అన్నీ ఉన్నాయి. ఎక్కడికైనా విదేశాలకు వెళ్లేవారికి ఉపయోగపడేలా రెండు వేర్వేరు దేశాల టైమ్ చూసుకునే ‘డ్యూయల్ టైమ్’ ఫీచర్ ఇచ్చారు. ఇక స్టాప్‌వాచ్, కౌంట్‌డౌన్ టైమర్ ఎలాగో ఉంటాయి. ముఖ్యంగా ఆఫీసుకి వెళ్లే వారికి, పొద్దున్నే నిద్రలేవడానికి ఐదు రకాల అలారాలు సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ వాచ్‌లో స్నూజ్ ఆప్షన్ కూడా ఉండటం వల్ల, ఒక్కసారి ఆపినా మళ్లీ మళ్లీ అలారం మోగి మనల్ని నిద్రలేపుతుంది. అలాగే 2099 వరకు మనం డేట్ మార్చాల్సిన అవసరం లేకుండానే క్యాలెండర్ సెట్ అయి ఉంటుంది.

పదేళ్ల బ్యాటరీ లైఫ్..

Advertisement

ఈ వాచ్‌లో అసలైన హైలైట్ ఏంటంటే.. దీని బ్యాటరీ. ఒకసారి కొంటే దాదాపు పదేళ్ల వరకు బ్యాటరీ మార్చాల్సిన పనిలేదని కంపెనీ చెబుతోంది. ఇక 100 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల.. వర్షంలో తడిచినా, స్విమ్మింగ్ చేసినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. యూరప్ ధరల ప్రకారం చూస్తే మన దగ్గర ఇది దాదాపు రూ.3,600 లోపు ఉండొచ్చని అంచనా. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం మన్నే మంచి బ్రాండెడ్ వాచ్ కావాలనుకునే వారికి ఇది పక్కాగా సెట్ అవుతుంది.

Also Read: మీ గూగుల్ అకౌంట్ వేరే డివైజుల్లో ఉండిపోయిందా? ఇలా సింపుల్‌గా రిమూవ్ చేయండి!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×