E-Paper
Advertisement

AC Water Tips: ఏసీ నీటిని వృథా చేస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ లాభాలన్నీ మిస్ అవుతారు!

AC Water Tips: ఏసీ నీటిని వృథా చేస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ లాభాలన్నీ మిస్ అవుతారు!
Advertisement

AC Water Tips: సమ్మర్ లో ఏసీలను పెద్ద ఎత్తున ప్రజలు వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో ఏసీ నుంచి కాస్త ఎక్కువగానే నీరు బయటకు వచ్చేస్తుంటుంది. సాధారణంగా వేసవిలో ఉండే నీటి ఎద్దడి నేపథ్యంలో ఈ నీటిని వ్యక్తిగత అవసరాల కోసం వాడొచ్చా? లేదా? అన్న అనుమానం మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ఈ నీటిని తాగితే ఏమన్నా అవుతుందా? అన్న సందేహం కూడా కొందరిలో కలుగక మానదు. ఈ నేపథ్యంలో ఏసీ నీటిని ఉపయోగించవచ్చా? ఒకవేళ వాడితో వేటికి యూజ్ చేయవచ్చు? వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏసీ నీటిని వాడొచ్చా? లేదా?

ఏసీ (Air Conditioner) నుంచి వచ్చే నీటిని ఖచ్చితంగా వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి ఇది గాలిలోని తేమ నుంచి పుట్టిన ‘స్వేదన జలం’ (Distilled Water) వంటిది. అంటే నీటిని మరిగించి, ఆవిరిని సేకరించి, తిరిగి ద్రవ రూపంలోకి (condense) మార్చడం ద్వారా పొందిన అత్యంత స్వచ్ఛమైన నీరు అని అర్థం. అయితే ఇందులో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున దీనిని తాగడానికి, వంటకు అస్సలు పనికిరావు. మరి వేటికి ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

మొక్కలకు నీరు పోయడం

Advertisement

ఏసీ నుంచి వచ్చిన నీటిని మొక్కలకు ఉపయోగించడం అత్యంత ఉత్తమమైన మార్గం. ఇందులో క్లోరిన్ వంటి రసాయనాలు ఉండవు కాబట్టి మొక్కల పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. అయితే ఈ నీటిలో ఖనిజ లవణాలు (Minerals) ఉండవు కాబట్టి అచ్చం ఇదే కాకుండా అప్పుడప్పుడు సాధారణ నీటిని సైతం మెుక్కలు పోస్తూ ఉంటే బెటర్.

ఇంటి ఫ్లోర్ క్లీనింగ్

ఇంటిని తుడవడానికి లేదా ఫ్లోర్ క్లీనింగ్ చేయడానికి ఏసీ నీటిని ఎలాంటి సందేహం లేకుండా వాడొచ్చు. సాధారణ నీటితో కలిపి లేదంటే నేరుగా ఈ నీటితో గదులను శుభ్రం చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతిరోజూ వృథా అయ్యే లీటర్ల కొద్దీ మంచినీటిని మనం ఆదా చేసినట్లు అవుతుంది.

వాహనాల శుభ్రత

Advertisement

కార్లు లేదా బైక్‌లను కడగడానికి ఏసీ నీరు చాలా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ నీటిలో ఉండే ఫ్లోరైడ్ లేదా ఇతర లవణాల వల్ల వాహనాలపై తెల్లటి మచ్చలు పడే అవకాశం ఉంటుంది. కానీ ఏసీ నీరు సాఫ్ట్ వాటర్ కావడంతో వాహనంపై మచ్చలు పడకుండా తళతళలాడేలా చేస్తుంది.

టాయిలెట్ ఫ్లష్ కోసం

సాధారణంగా ప్రతిరోజూ టాయిలెట్లలో ఫ్లష్ కోసం మనం ఎంతో నీటిని వృథా చేస్తుంటాం. ఏసీ నుంచి వచ్చే నీటిని ఒక బకెట్‌లో సేకరించి టాయిలెట్లను శుభ్రం చేయడానికి లేదా ఫ్లష్ చేయడానికి ఉపయోగించడం వల్ల చాలా నీటిని పొదుపు చేయవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: Airtel Plans: దుమ్మురేపుతున్న టాప్ 2 ప్లాన్స్.. అవి ఏంటి? రెండింటిలో ఏది బెస్ట్?

ఐరన్ బాక్స్‌లో వాడకం

స్టీమ్ ఐరన్ బాక్సులలో సాధారణ నీటిని పోస్తే అందులోని ఉప్పు వల్ల రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏసీ నుంచి వచ్చే నీరు డిస్టిల్డ్ వాటర్ లాంటిది కాబట్టి దీనిని స్టీమ్ ఐరన్ బాక్సులలో పోసి బట్టలను ఇస్త్రీ చేసుకోవడానికి వాడొచ్చు. దీనివల్ల బట్టలపై మరకలు పడకపోవడంతో పాటు ఐరన్ బాక్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

Also Read: ఏంది భయ్యా ఇది.. Poco నుంచి ఇలాంటి క్రేజీ ఫోన్స్.. కలలో కూడా ఊహించలే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×